జూన్ 06 – దేవునికిష్టమైన బలి!
“విరిగిన (మనస్సే) ఆత్మయే దేవుని కిష్టమైన బలులు; దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు” (కీర్తనలు. 51:17).
సహజముగా అందరు సంతోషమును, ఆనందమనే వెంటాడుదురు. ఆటపాటలతో, ఉత్సాహముగా ఉండుటయే కోరుకొందురు. ప్రభువు అటువంటి సందర్భములను ఇవ్వవలెను అంటే, మనము విరిగి, నలిగిన హృదయముతో ప్రార్థించువారిగా ఉండవలెను.
మన పరిస్థితి అనుకూలముగా ఉన్నప్పుడు దేవుని స్తుతించి, ఆనందించే మనము, పరిస్థితి వ్యతిరేకముగా ఉన్నప్పుడు ప్రభువును స్తుతించుచున్నామా? “అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్షచెట్లు ఫలింపక పోయినను, ఒలీవచెట్లు కాపులేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొఱ్ఱెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవాయందు ఆనందించెదను నా రక్షణకర్తయైన నా దేవునియందు నేను సంతోషించెదను” (హబక్కూకు. 3:17,18) అనుటయే హబక్కూకు చేసిన తీర్మానము.
నష్టములును, కష్టములును వచ్చుచున్నప్పుడు స్తుతించుట కష్టమైన ఒక అంశమే. అయితే ఎవరెవరు తమకు ముందుగా ఉన్న కీడులను ప్రభువు మేలుగా మార్చును అను విశ్వాసముగలవారై ఉందురో, వారు ప్రభువును స్తుతించెదరు. ప్రభువును ప్రేమించుచున్నవారికి సమస్తమును మేలునకై సమకూడి జరుగుచున్నది అని ఎవరెవరు ఎరిగియున్నారో, అట్టివారు ప్రభువును స్తుతించెదరు. స్తుతితో కూడిన ప్రార్థన అంధకార శక్తులను విరచి, దేవుని యొక్క వెలుగును, ఆశీర్వాదమును తీసుకొని వచ్చును. విశ్వాసమును దృఢపరచి నిజమైన సమాధానమును ఇచ్చును.
హన్నాకు సంతానము లేనందున గొడ్రాలు అని ఆమె యొక్క వైరి పరిహాసము చేసేను. ఆమె యొక్క జీవితము సరిచేయబడుటకు, నలిగిన హృదయముతో మనోదుఃఖముతో ప్రార్థించవలసినది అవశ్యముగా ఉండెను. ఆమె కన్నీటితో ప్రార్ధించిన ప్రార్థనను ప్రభువు ఆలకించి ఆశీర్వాదకరమైన సమూయేలును అనుగ్రహించెను.
మీరు విరిగి, నలిగిన హృదయముతో దేవుణ్ణి తట్టు చూచుచున్నప్పుడు, దేవుని యొక్క కృప గల హస్తము మిమ్ములను హక్కున చేర్చుకొనుటను చూచెదరు. ప్రేమగల హస్తము మిమ్ములను ఓదార్చుటను గ్రహించుకొందురు. సాధారణమైన పరిస్థితిలో ఒక మనుష్యుడు నేర్చుకోవలసిన ఆత్మీయ పాఠములకంటేను, శోధనయు, పోరాటమును నిండిన పరిస్థితిలో మిగుల ఔన్నత్యమైన ఆత్మీయ రహస్యములను గ్రహించుకొనుచున్నాడు. అతడు నలగగొట్ట బడుచున్నప్పుడు, అతనిలో హృదయము అహము అను అహంకారము తొలగించ బడినవాడై, “ఇక నేను కాదు క్రీస్తే” అని గ్రహించుటకు ప్రారంభించుచున్నాడు.
దావీదు రాజునకు, పలు ఉపద్రవములును, శ్రమలును, పోరాటములును వచ్చెను. చివరిలో ఆయన ఏమి చెప్పెనో తెలియునా? “నేను నీ కట్టడలను నేర్చుకొనునట్లు, శ్రమ నొందియుండుట నాకు మేలాయెను” (కీర్తనలు. 119:71) అని ఆయన చెప్పెను.
నేటి ధ్యానమునకై: “పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించు కొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను” (రోమీ. 12:1).