Appam, Appam - Telugu

జూన్ 03 – మనఃపూర్వకముగా!

“జనులలో ఇశ్రాయేలీయుల అధిపతులు (సంతోషము) మనఃపూర్వకముగా తాము సమర్పించుకొనిరి. వారియందు నాకు ప్రేమకలదు” (న్యాయ. 5:9).

ఇశ్రాయేలీయుల న్యాయాధిపతిగా ఉండిన దెబోరా యొక్క హృదయము మనఃపూర్వకముగా ఉండుటకు కోరెను. ఇశ్రాయేలీయుల అధిపతులందరును మనఃపూర్వకముగా తమ్మును ప్రభువు కొరకు తమ్మును సమర్పించుకొని దెబోరాతో కలిసి నిలబడి యుద్ధమును చేసినందున వారు జయము పొందిరి. ప్రభువు యొక్క నామము మహిమ పరచబడెను. దెబోరా యొక్క హృదయము సంతోషించి ప్రభువును స్తుతించుటకు ప్రారంభించెను.

ఒక కుటుంబమునందు పిల్లలు మనఃపూర్వకముగా, తల్లితండ్రులతో కలసి నిలబడుట అనునది ఎంతటి గొప్ప సంతోషము! కోడళ్లను, మనమల్లును కలసిగట్టుగా ఉండినట్లయితే దానికంటే ఆశీర్వాదకరమైన అంశము కుటుంబమునకు వేరొకటి లేదు. ప్రత్యేకముగా, పోరాటపు దినములయందు బాధయు దుఃఖమును ఇండ్లలో మోదుచున్నప్పుడు, ఇంట ఉన్న వారందరును ఏక మనస్సుతో నిలబడినట్లైతే దానికంటే సంతోషకరమైన అంశము మరొకటి లేదు. మరియు అట్టి పోరాటములలో జయమును కూడా పొందుకొందురు.

మనఃపూర్వముగా అంటే పూర్ణ మనస్సుతో (Whole Hearted) అని అర్థము. కొందరైతే ఇష్టము వచ్చినట్టు ప్రభువును వెంబడించుచున్నారు. కొందరు విధిచొప్పున, బలవంతముగాను ఆయనను వెంబడించుచున్నారు. కొందరు అవసరతలను తీర్చుకొనునట్లు తమ సొంత ఆదాయము కొరకు వెంబడించుచున్నరు. కొందరైతే మనఃపూర్వకముగా ప్రభువునందు ప్రేమను ఉంచి ఆయనను వెంబడించుచున్నారు.

ప్రత్యక్షపు గుడారమును కట్టుచున్నపుడు ప్రభువు కోరినప్పుడు ఆయన మోషేను చూచి: “మనఃపూర్వకముగా ఉత్సాహముతో అర్పించు ప్రతి మనుష్యుని యొద్ద దాని తీసికొనవలెను” (నిర్గమ. 25:2) అని చెప్పెను. దాని కొనసాగించి, మనఃపూర్వము గల పురుషులేమి, స్త్రీలేమి తమ యొక్క బంగారపు ఆభరణములన్నిటిని కానుకగా ఉత్సాహముతో ఇచ్చిరి (నిర్గమ. 35:22,29). మనఃపూర్వము వచ్చినట్లయితే ఏక మనస్సు వచ్చును. ఏక మనస్సు వచ్చినట్లయితే నిశ్చయముగానే ఉజ్జీవము వచ్చును.

ఒక కార్యాలయముగాని, వ్యవస్థగాని లేక పరిచర్యలోని సమస్థగాని ఆశీర్వదింపబడుటకు ముఖ్య కారణము అందులో మన పూర్వకముగా ఉద్యోగము చేయుచున్న సిబ్బందులే. వారు పరిచర్య కొరకు పని చేయుట లేదు. ప్రభువు కొరకు పని చేయుచున్నారు. అందుచేతనే అపో. పౌలు మనకు ఆలోచనను చెప్పుచున్నప్పుడు: “మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తము మన స్ఫూర్తిగా చేయుడి” (కొలస్సీ. 3:24) అని ఆలోచనను చెప్పుచున్నాడు.

అదేవిధముగా ఫిలేమోనునకు వ్రాయుచున్నప్పుడు: నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛా పూర్వకమైనదిగా ఉండవలెను అని వ్రాయుచున్నాడు (ఫిలేమో. 1:14). మనఃపూర్వకమునందు ప్రభువు నిశ్చయముగానే మనస్సునందు ఆనందించును.

ఇతరులు మీతో మనఃపూర్వకముగా నిలబడవలెను అని మీరు ఎదురుచూచునట్లుగా, మీరు కూడాను ప్రభువుతో మనఃపూర్వకముగా నిలబడుడి. ఆయన యొక్క సువార్త పరిచర్య కొరకు మన పూర్వకముగాను, ఉదారత్వముతో ఇవ్వడి. ప్రార్థించుచున్నప్పుడు సంతోషముతోను మనఃపూర్వకముగా ప్రభువు యొక్క పాదముల చెంత కూర్చుండి ప్రార్థించుడి. దేవుని వాక్యములను మనఃపూర్వకముగా దప్పికతోను చదువుడి. ప్రభువును స్తుతించి పాడుడి, ఆరాధించుడి. ఆయనపైయున్న ప్రేమను మనఃపూర్వకముగా బయలు పరచుడి.

నేటి ధ్యానమునకై: “నీ యుద్ధసన్నాహదినమున నీ ప్రజలు (ఇష్టపూర్వకముగా) మనఃమనఃపూర్వకముగా పరిశుద్ధాలంకృతులై వచ్చెదరు” (కీర్తనలు. 110:3).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.