Appam, Appam - Telugu

ఆగస్టు 26 – ఐదు మంటపములు!

“యెరూషలేములో గొఱ్ఱెల ద్వారము దగ్గర, హెబ్రీ భాషలో బేతెస్ద అనబడిన యొక కోనేరు కలదు, దానికి అయిదు మంటపములు కలవు” (యోహాను. 5:2).

నేడు మిమ్ములను ఇశ్రాయేలు దేశమునందుగల బెతస్థ కోనేరునకు తీసుకుని వెళ్ళుటకు కోరుచున్నాను. చూడండి, ఈ కోనేరు చుట్టూతాను, వేల సంఖ్యలో వ్యాధిగ్రస్తులు ఆ కోనేరు నీళ్ళనే చూస్తూ ఉన్నారు.

ఈ కోనేరు యొక్క పేరు బేతెస్థయైయున్నది. బేతెస్థ అంటే కనికరపు గృహము అను అర్థమునైయున్నది. ఆ కోనేరు నీళ్లు దేవదూత చేత కదిలింప బడుచున్నప్పుడు, అందులో మొదట దిగుచున్న వ్యాధిగ్రస్తుడు ఎవరైయుండినప్పటికీని, ఎటువంటి భయంకరమైన వ్యాధిగలవాడై యుండినప్పటికీని, స్వస్థత పొందును అనుటయే ఈ కోనేరు యొక్క ప్రత్యేకత.

ఈ కోనేరునకు చెందినంత మట్టుకు రోగి యొక్క వయోపరిమితి ప్రాముఖ్యమైనది కాదు. అది ఆస్తమా గాని, క్యాన్సరు జబ్బు లేదా మరేదైనా ప్రాణాంతకమైన వ్యాధియైనను కావచ్చు, దాని సంగతి ప్రాముఖ్యముకాదు. కోనేరు కదిలింప బడుచున్నప్పుడు, ముందుగా దిగవలెను అనుటయే ప్రాముఖ్యమైనది. కోనేరు ఎప్పుడు కదిలించబడుతుందో ఎవరికిని తెలియదు. ఆ కోనేరులో కనికరము ఉండెను.

అయితే సంపూర్ణమైన కనికరము కాదు. బహుశా అందరికీ లభించేటువంటి కనికరమును కాదు. అక్కడ ముఫ్ఫై ఎనిమిది సంవత్సరములుగా దుర్భలమైనస్థితిలో ఒక వ్యాధిగ్రస్తుడు స్వస్థత లభించునా అను తపనతో పండుకొనియుండెను. ఐదు మండపములు గల ఆ బేతెస్థ కోనేరు‍ను, ఆ వ్యాధిగ్రస్తుడును దేనికి సాదృశ్యమో తెలియునా? ధర్మశాస్త్ర నియమమునందు ఆదికాండము, నిర్గమకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము మొదలగు ఐదు కాండములున్నట్టుగా బేతెస్థ కోనేరునకు ఐదు మండపములు ఉండెను. ముఫ్ఫై ఎనిమిది సంవత్సరముల వ్యాధిగ్రస్తునివలె ఇశ్రాయేలీయులు ఉండెను. ఐగుప్తు నుండి బయలుదేరినది మొదలుకొని, అరణ్యమునందు ఇశ్రాయేలీయులు నడిచిన కాలము ముఫ్ఫై ఎనిమిది సంవత్సరములు. ఇశ్రాయేలీయులు కలిగియున్న ధర్మశాస్త్ర నిరమమునందు కనికరము ఉండినప్పటికీని అది సంపూర్ణమైనదిగా ఉండలేదు.

ఇప్పుడు కృపా నియమమును యేసు తీసుకొని వచ్చెను. ఆయన కనికరమునందు సంపన్నుడైయున్నాడు. తన వద్దకు వచ్చుచున్న ఏఒక్కరిని కూడాను వెలుపలకు త్రోసివేయువాడు కాదు. ఆయన వద్దకు వచ్చుచున్న ఎట్టి రోగికైనను కనికరము కలదు, దైవిక స్వస్థత, ఆరోగ్యమును కలదు. అక్కడ ఉన్న ఐదు మండపములవలె, క్రీస్తు యొక్క గాయములు కనబడుచున్నది. కోనేరు నందుగల నీళ్లవలె, గాయముల నుండి శ్రవించుచున్న అమూల్యమైన రక్తము ఉన్నది.

ఈ బేతెస్థ కోనేరుకు వెళ్ళు త్రోవను గూర్చి ఒకరు వ్రాయుచున్నప్పుడు, “దానికై వెళ్ళు త్రోవ విశ్వాసమే, ఆ బాటలో నడిచి, క్రైస్తవ మార్గము అను ఊరిలో చేరుకొని, క్రీస్తు అను కోనేరు వద్దకు వెళ్లి, క్రీస్తు యొక్క ఐదు గాయములు అను మండపములోనికి ఆశ్రయమును పొంది, ఆయన యొక్క కనికరములో మునుగుచున్నప్పుడు నీ ప్రాణము యొక్క వ్యాధులు అదే నిమిషములో తొలగిపోవుటను చూడుము” అని సూచించెను.

దేవుని బిడ్డలారా, నేడును క్రీస్తు కనికరమునందు సంపన్నుడై, మీ యొక్క వ్యాధులను, రోగములను, బలహీనతలను స్వస్థపరచుటకు శక్తి గలవాడైయున్నాడు.

నేటి ధ్యానమునకై: “యేసు వానిని చూచి: నీవు లేచి, నీ పరుపెత్తికొని నడువుమని వానితో చెప్పగా. వెంటనే వాడు స్వస్థతనొంది, తన పరుపెత్తికొని నడిచెను” (యోహాను. 5:8,9).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.