ఆగస్టు 18 – వెదకితిని!
“రాత్రివేళ పరుండియుండి నేను నా ప్రాణప్రియుని వెదకితిని; వెదకినను అతడు కనబడకయుండెను. నేనిప్పుడే లేచెదను పట్టణము వెంబడిపోయి వెదకుదును సంతవీధులలోను రాజవీధులలోను తిరుగుదును, నా ప్రాణప్రియుని వెదకుదును అని నేననుకొంటిని” (ప.గీ. 3:1,2).
రాత్రి వేళ అనుట మనుష్యునికి దేవుడు అనుగ్రహించిన మహా గొప్ప బహుమానమునైయున్నది. రాత్రి సమయములయందు నిద్రించి విశ్రమించుచున్నాము. అప్పుడు అంతరంగపు ఖ్శోభలును, చింతలును తేలికగా మరుగైపోవుచున్నది. మంచి విశ్రాంతిని తీసుకుని ఉదయకాలమునందు లేచున్నప్పుడు, నూతన బలముతోను, ఉత్సాహముతోను ప్రభువును స్తుతించుటకు అది సహాయకరముగా ఉండును.
అదే సమయములో సాతాను కూడాను రాత్రి సమయమును తన చెడు కార్యములకు వాడుకొనుటకు కోరుచున్నాడు. కలుపులను తలంపులలోను, ఆలోచనలోను విత్తి అసలీలపు స్వప్నములను, పీఢ కలలను తీసుకొని వచ్చుచున్నాడు. దొంగలను, చోరులను అట్టి సమయములలో పంపించుచున్నాడు.
విషజంతువులు తమ యొక్క విషమును ఎవరిలో దించుట అని అలయుచు తిరుగుచున్న సమయము రాత్రి సమయమే. ‘రాత్రి వేళ కలుగు భయమునకైనను’ (కీర్తనలు.91:5) అనియు, ‘చీకటిలో సంచరించు తెగులునకైనను’ (కీర్తనలు.91:5) అనియు, అని బైబిల్ గ్రంథమునందు చదువుచున్నామే!
మీరు ప్రాణ ప్రియునితో ప్రార్థనలో ఖర్చుపెట్టి రాత్రియందు ప్రక్కకు వెళ్ళినట్లయితే, ఏ కీడును సమీపించకుండా ప్రభువు మిమ్ములను కాపాడును. శత్రువు వరదవలె వచ్చుచున్నప్పుడు పరిశుద్ధాత్ముడు వానికి విరోధముగా ధ్వజమును ఎత్తును. దేవుని ప్రసన్నతలో నిద్ర వచ్చుచున్నంతవరకు స్తుతించుచూను, ఆత్మలోనింపబడి అన్య భాషలు మాట్లాడుచూనూ పండుకొని ఉండుట ఎంతటి మహిమకరమైన అనుభవము!
మనుష్యుని యొక్క జీవితములో మూడిట్లో ఒక భాగము నిద్రలో ఖర్చు అవ్వుచున్నది. కొందరికి అది వ్యర్ధమైన సమయముగా ఉన్నది. అట్టివారికి నిద్ర లేకుండా మనస్సును అలమటింప చేసుకొని పలు విధములైన చింతల చేత నెమ్మది లేకుండా పరుపుపై దొర్లుచూనేయుందురు. మరి కొందరిని గాఢ నిద్ర ఆత్మ పట్టుకుని స్వయలేకుండా మంచము పట్టియుంచును. అట్టివారు తమ ఆయుష్షు కాలములోని మూడవ భాగమును వ్యర్ధము చేయుచున్నారు.
అయితే షూలమితి, రాత్రివేళ పడుండియుండి నేను నా ప్రాణ ప్రియుడ్ని వెదకితిని” అని చెప్పుచున్నది. ప్రభువును వెతుకుటకు రాత్రి సమయము చక్కని ఒక సమయమునైయున్నది. తమ యొక్క దుఃఖమును, మనోవేదనలను ప్రాణ ప్రియుని వద్ద పంచుకొని, పరిహారమును వెదకు సమయము అది. ప్రభువుపై మన అంతరంగము యొక్క భారపుబరువులను, చింతలను దించి పెట్టి ఆదరణను, ఓదార్పును పొందుకొనే సమయము అది.
“దేవా పరలోకపు దర్శనమును నాకు దయచేయుము. ఇట్టి రాత్రి సమయములో మీ మార్గములను నాకు బోధించుము. మీ యొక్క చిత్తమును నాకు తెలియజేయుము” అని ప్రార్థించుచున్నప్పుడు, ప్రభువు కలలద్వారాను, దర్శనములద్వారాను పరలోకపు దృశ్యములను మీకు చూపించును. దేవుని బిడ్డలారా, దేవుడు తన పిల్లలైయున్న మీకు తన చిత్తమును, భవిష్యత్కాలమును నిశ్చయముగా ముందుగానే తెలియజేయును.
నేటి ధ్యానమునకై: “తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచ కుండ ప్రభువైన యెహోవా యేమియు చేయడు” (ఆమోసు. 3:7).