ఆగస్టు 08 – ప్రాణమును దయచేయువాడు!
“జనులను సజీవులనుగాను మృతులనుగాను చేయువాడు యెహోవాయే; పాతాళమునకు పంపుచు అందులోనుండి రప్పించుచుండువాడు ఆయనే” (1. సమూ. 2:6).
హన్నా మొట్టమొదటిగా, ప్రభువు యొక్క పరిశుద్ధమైన అలంకారమును కీర్తించి పొగెడెను. రెండోవదిగా, ప్రభువు యొక్క జ్ఞానము కీర్తించి పొగెడెను. మూడోవదిగా, ప్రభువు యొక్క జీవింపచేయు శక్తిని ప్రశంసించు రీతిలో ప్రభువు జీవాధిపతి అనియు, సర్వశరీరులకు జీవమును ప్రసాదించువాడనియు కీర్తించెను.
“యేసు పునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును; బ్రదికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు” (యోహాను. 11:25,26) అని యేసుక్రీస్తు చెప్పెను.
మీరు ఇట్టి సజీవుల యొక్క దేశమునందు జీవించునట్లు మీకు కృపగా ప్రాణము అను జీవమును అనుగ్రహించియున్నాడు. కల్వరి సిలువలో తన యొక్క సొంత జీవమును మీ కొరకు అర్పించి త్యాగమును చేసియున్నాడు. పరలోక రాజ్యమునకు వెళ్ళుచున్నప్పుడు, ఆయన నిత్యాజీవమును అనుగ్రహించియున్నాడని తెలుసుకుందురు. “ఆయనలో జీవముండెను; ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను” (యోహాను. 1:4). ఆయన ఒక్కడే మార్గమును సత్యమును జీవమునైయున్నవాడు (యోహాను. 14:6) అని అపో. యోహాను వ్రాయుచున్నాడు.
సారపతు విధవరాలు యొక్క కుమారుడు చనిపోయినప్పుడు ఏలియాకైతే, “ప్రభువు జీవింపచేయువాడు జీవమును దయచేయువాడు” అనుటలో కదల్చలేని నమ్మికయుండెను. అందుచేత దేవుణ్ణి తేరి చూచి: “యెహోవా నా దేవా, నా మొఱ్ఱ ఆలకించి యీ చిన్న వానికి ప్రాణము మరల రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా. యెహోవా ఏలీయా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరల రానిచ్చినప్పుడు వాడు బ్రదికెను” (1. రాజులు. 17:21,22). అదేవిధముగా ఎలీషా ప్రవక్త షూనేమీయురాళ్లు యొక్క కుమారుడు చనిపోయినప్పుడు ప్రభువును తెరి చూచి విజ్ఞాపన చేసెను. అప్పుడు ఆ పిల్లవాడు యేడుమారులు తుమ్మి కండ్లు తెరచెను (2. రాజులు. 4:35).
ప్రార్థించుకొనుటకై వచ్చిన ఒక వ్యక్తి ఇలా చెప్పెను: “నాకు 58 ‘వ వయస్సులో మిగుల బలహీనముగా ఉన్నది. అన్ని రకముల రోగములన్నియును నా శరీరములోనికి వచ్చెసింది. నేను 60 సంవత్సరముల వయస్సు వరకును ప్రాణాలతో ఉండునట్లు ప్రార్థించండి” అని చెప్పెను. దీర్ఘాయుష్షును ఇచ్చుటకు ప్రభువు కృప గలవాడైయున్నప్పుడు, ఎందుకని 60 సంవత్సరముల వయస్సు మాత్రమే అని అడిగారు అనుట అర్థముకాక ఆయన వద్ద వివరమును అడిగాను. ఆయన “నేను నా ప్రభుత్వ ఉద్యోగమును పూర్తిగా ముగించుకుని, విరామ ఉపాధి సదుపాయములను పొందగోరుచున్నాను” అని చెప్పెను.
చూడండి, ప్రభువు నాకు ఆయుష్షును ఇచ్చినట్లయితే, నేను పరిచర్యను చేయుదును అనిగాని, ఆత్మలకు సువార్తను ప్రకటించి ప్రభువు వద్దకు త్రోవ నడిపించేదను అనిగాని చెప్పలేదు. ఆయన ఉద్దేశము అంతయును ఉద్యోగ కాలమును పూర్తిగా ముగించుకున్నప్పుడు తద్వారా లభించేటువంటి ధనము పైనే ఉండెను. దేవుని బిడ్డలారా, మీ యొక్క దినములు ప్రభువు చేతిలో ఉన్నది. మీరు ఆయనను మహిమ పరచుటకు తీర్మానించినట్లయితే, నిశ్చయముగానే దీర్ఘాయుషుతో ఆయన మిమ్ములను తృప్తి పరచును.
నేటి ధ్యానమునకై: “గొఱ్ఱెలకు జీవము కలుగుటకును, అది సమృధ్ధిగా కలుగుటకును నేను వచ్చితిని” (యోహాను. 10:10).