అక్టోబరు 17 – నీతినిమిత్తము!
“నీతినిమిత్తము హింసింప బడుచున్నవారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది” (మత్తయి. 5:10).
మీరు ప్రభునకు భయపడి ఆయన నీతిని స్వతంత్రించు కొనుచున్నప్పుడు, సాతాను యొక్క అతి భయంకరమైన వ్యతిరేకతను సంధించవలసినదై ఉండును. దేవునికి బద్ధ శత్రువైన అతడు, ఎవరెవరు నీతిని జరిగించవలెనని కోరుచున్నారో, వారందరికిని బద్ధ శత్రువుగా మారుచున్నాడు. శోధనలను తీసుకుని వచ్చుచున్నాడు, పోరాటములను తీసుకుని వచ్చుచున్నాడు. దేవుని యొక్క బిడ్డలు మనస్సునందు కృంగిపోవుటకు కావలసిన అన్ని పరిస్థితులను రూపించుచున్నాడు.
మా యొక్క తండ్రిగారు ప్రభుత్వమునందు దరిదాపులు పద్నాలుగు సంవత్సరములు ఉద్యోగమును చేసెను. లంచము పుచ్చుకొనకుండా, సంపన్నుల వెనుక పరిగులు తీస్తూ తిరుగుకుండా, యదార్థముగాను, సూటిగాను ప్రవర్తించినందున అత్యధికముగా హేళనము చేయబడెను. అక్కడ ఉన్న ఉద్యోగపు సంఘములో చేరనందున ఆయనను తమలో నుండి వెలివేసి కఠినముగా నడిపించిరి. ఆయుధ పూజ వంటి పలు పూజలలో పాలు పొందనందున పలుమంది అధికారుల యొక్క కోపమునకు గురి ఆయెను.
అయితే ప్రభువు, ఆయనను హక్కును చేర్చుకుని ఓదార్చేను. “నీవు ధన్యుడవు కుమారుడా, నా నామమును నిమిత్తమును, నీతి నిమిత్తమును హింసింపబడినందున ధన్యుడువుగా ఉందువు” అని చెప్పెను. నీతి నిమిత్తము హింసింపబడుచున్న వారికి పరలోక రాజ్యమును ప్రభువు వాగ్దానము చేయుచున్నాడు.
బహుశా మీరు ప్రభువుపై ఉంచిన ప్రేమ నిమిత్తముగాను, నీతి న్యాయముల నిమిత్తముగాను సమాజము చేత తృణీకరింపబడి ఉండవచ్చును. కొన్ని గ్రామములలో ఊరు యొక్క కట్టుదిట్టాలు అని చెప్పి క్రైస్తవులను అణగత్రొక్కున్నారు. అనేకమంది సహోదరీలు అన్యమతములో నుండి క్రీస్తును అంగీకరించినందున, భర్త చేత నిరాకరింపబడి, కుటుంబ సభ్యులచేత అణగత్రొక్కబడి, పరితపించుచున్న సంగతిని చూచి ఉన్నాను. భయపడకుడి ప్రభువు మీకు నీతిని చేయును.
షద్రకు, మేషాకు, అబేద్నగులు నీతి కొరకు నిలబడిరి. ప్రభువునకు తప్ప మరి ఎట్టి విగ్రహములకు ఎదుటను, మా యొక్క చేతులను ఎత్తి మ్రొక్కము అని భక్తి వైరాగ్యముతో బేరించిరి. వారి కొరకు అగ్నిగుండము ఏడు రెట్లు వేడిమి చేయబడెను. అట్టి సంగతిని చూచిన దేవ కుమారుడు ఆ అగ్నిగుండంలోనికి దిగివచ్చి వారితో సంచరించెను. అగ్ని వారిని హాని చేయకుండా కాపాడెను. నేడు కూడాను వారి యొక్క పేరులు ధన్యుల యొక్క పట్టికలో చోటుచేసుకుని ఉంది.
మీరు ప్రభువు కొరకు వైరాగ్యముతో నిలబడినట్లయితే, ప్రభువు మీ కొరకు అత్యధిక వైరాగ్యముగలవాడై ఉండును. విశ్వాసపు యోధుల పట్టికలో ఉన్న అపో. పౌలు నీతిని నిమిత్తము హింపబడుచున్న వారిని సూచించుటలో వెనుకంజ వేయలేదు. లోకము వారికి తగినిదై ఉండలేదు. అవును, వారు నీతి కొరకు దృఢముగా నిలబడిరి. జీవితము అనునది ఈ లోకముతో సమాప్తము అవ్వుటలేదు. ఆ తరువాత పరలోక రాజ్యమును స్వతంత్రించు కొందుము అను గొప్ప విశ్వాసము వారికి ఉండెను.
దేవుని బిడ్డలారా, ప్రభువు కొరకు నిలబడుడి. నీతి కొరకు వైరాగ్యమును కలిగి ఉండుడి. మీరు ధన్యులైయుందురు.
నేటి ధ్యానమునకై: “ఆయనతో కూడ శ్రమలను సహించిన వారమైతే ఆయనతో కూడ ఏలుదుము” (2. తిమోతి. 2:12).