మే 21 – దేవుని బలముచేత త్రోవనడిపించును!
“నీవు విమోచించిన యీ ప్రజలను నీ కృపచేత తోడుకొనిపోతివి నీ బలముచేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి” (నిర్గమ. 15:13).
ప్రభువు మన యొక్క కాపరి. మనము ఆయన మేపేటి గొర్రెలము. మందను కాపరి నడిపించునట్లుగా ప్రభువు మనలను బహు చక్కగా త్రోవ నడిపించుచున్నందున మనకు లేమి కలుగుటను లేదు, ఏదియు కొదువైయుండుటను లేదు.
కాపరి గొర్రెలు అన్నిటిని ఒకేలా నడిపించడు. పాలు తాగే గొర్రెలను సౌమ్యముగా నడిపించును. సూలిదైన గొర్రెలను జాగ్రత్తగాను, నిదానముగాను త్రోవ నడిపించును. కాలు విరిగిన గొర్రెను భుజములపై మూసుకొని త్రోవ నడిపించును. ఇశ్రాయేలు ప్రజలు పలు లక్షల మందిగా ఉండినను, నలభై సంవత్సరములు వారిని అరణ్యమునందు బహు చక్కగా త్రోవ నడిపించుకొనుచు వచ్చెను.
ప్రభువు వారిని నడిపించుకుని వచ్చినందున, ప్రతి ఉదయమును మన్నా వారికి కురిసెను. మాంసమును కోరినప్పుడు పుర్రెలు పిట్టలను వారి పాలెములో రాశులుగా కూర్చెబడెను. దాహము కలిగినప్పుడెల్లాను బండలోనుండి వారికి నీళ్లు ఉబుకు వచ్చెను. వారి యొక్క వస్త్రములు పాతగిల్లిపోలేదు. నడిచినందున వారి కాళ్లు వాచిపోలేదు (ద్వితీ. 8:4). ప్రభువు వారిని నడిపించినందున గుర్రుపోతు వంటి బలముతో వారు ముందుకు కొనసాగుతూనే ఉండిరి. అట్టి దేవుడు మిమ్ములను కూడా నడిపించును.
మేము ప్రతిసారి ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుచున్నప్పుడెల్లను మమ్ములను త్రోవ నడిపించుకుని వెళ్ళుటకు యూదుల మార్గదర్శకుడు ఒకడు వచ్చును. ప్రతి స్థలమును కూడాను మాకు వివరించి చూపించును. అనుమతి తీసుకోవలసిన స్థలములయందు ఆయనే వెళ్లి అనుమతిని తీసుకొని వచ్చును. ఎట్టి సమస్యలు వచ్చినను ఆయనే ముందు నిలబడి వాటికి పరిష్కారమును చూపించును.
ఈ లోక పయనమునందు కూడాను మనకు ఒక మార్గదర్శకుడు కావలెను. సత్యమార్గమునందు త్రోవ నడిపించేటువంటి మార్గదర్శి కావలెను. పరమ కానానులోనికి, నిత్య రాజ్యములోనికి వెళ్లేంతవరకును ఆ మార్గదర్శి మనలను త్రోవ నడిపించుకుని వెళ్లును. జ్ఞానులకు త్రోవ చూపించటకు నక్షత్రము ముందుగా వెళ్ళెను. మనకు త్రోవ చూపించుటకు ప్రకాశించేటువంటి వేకువ చొక్కయైన దావీదు యొక్క చిగురైన యేసుక్రీస్తు ఉన్నాడు. ఆయన మనలను బహు చక్కగా త్రోవ నడిపించును.
ఇశ్రాయేలు ప్రజలకు త్రోవ చూపించుటకు మేఘస్తంభములు వచ్చి నిలిచెను. రాత్రియందు అగ్నిస్తంభములు నిలిచెను. కనాను స్వతంత్రించు కొనువరకును రాత్రింపగళ్ళు అవి వారిని త్రోవ నడిపించుకుని వెళ్లెను. ‘నీవే నన్ను త్రోవ నడిపించుము ప్రభువా’ అని తమ యొక్క జీవితము ఎవరెవరైతే ఆయన హస్తములలో అప్పగించుకొనుచున్నారో వారు నిశ్చయముగానే ధన్యులు.
దేవుని బిడ్డలారా, ప్రభువు ఇట్టి పయనమునందు మీతో కూడా ఉండి మిమ్ములను త్రోవ నడిపించుచున్నాడు అను సంగతిని దృఢ నిశ్చయము చేసుకొనుడి. ఆయన మీతోకూడా వచ్చినట్లయితే పూర్తి పరలోకమే మీతో కూడా వచ్చును. ప్రయాణములోనికి కావలసిన కృపలను, వరములను, శక్తులను, సామర్థ్యమును, బలమును ఆయన దయ చేయుచూనే ఉండును.
నేటి ధ్యానమునకై: “ఇశ్రాయేలునకు కాపరీ, చెవియొగ్గుము; మందవలె యోసేపును నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడవైనవాడా, ప్రకాశింపుము” (కీర్తనలు. 80:1).