నవంబర్ 19 – పాపము నుండి విడుదల!”
“మీరు అట్లు చేయని యెడల, యెహోవా దృష్టికి పాపము చేసినవారగుదురు; గనుక మీ పాపము మిమ్మును పట్టుకొనును అని నిశ్చయముగా తెలుసుకొనుడి” (సంఖ్యా. 32:23).
పాపము ఘోరమైనది, తెగించి చేసే పాపములు కుటుంబమునకు శాపమును తీసుకొని వచ్చుచున్నాయి. వ్యాధిని తీసుకుని వచ్చున్నాయి. చివరకు దేవుని యొక్క న్యాయ తీర్పునకు ఎదుటను ఉగ్రతాగ్నికి ఎదుటను తీసుకుని వచ్చి నిలబెట్టుచున్నది. పాపము ఒక భయంకరమైన బరువైన రాయివలె బుద్ధిహీనుని యొక్క మెడను పాతాళము తట్టునకు ఈడ్చుకొని వెళ్ళుచున్నది. “తన పాపములను దాచి పెట్టువాడు వర్ధిల్లడు; దానిని ఒప్పుకుని విడిచి పెట్టువాడు కనికరమును పొందును” (సామెతలు. 28:13).
“మారుమనస్సును పొందుడి” అని బాప్తీస్మమునిచ్చు యోహాను ఎంత ఖచ్చితముగా ప్రసంగించెను! మారుమనస్సు పొందుటకు ఇష్టము లేని పరిసయ్యులను, సదుకయ్యులను చూచి: “సర్పసంతానమా! రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడెవడు? మారుమనస్సునకు తగిన ఫలమును ఫలించుడి” (మత్తయి. 3:7) అని హెచ్చరించెను. మారుమనస్సు పొందక పోయినట్లయితే ఏమి జరుగును? “గొడ్డలి చెట్టువేరున ఉంచబడియున్నది; గనుక, మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును” (మత్తయి. 3:10).
యేసుక్రీస్తు కూడాను మారుమనస్సు పొందుడి అని ప్రసంగించెను. మారుమనస్సును గూర్చి సర్వ సృష్టికిని ప్రసంగించునట్లుగా యేసు తన యొక్క శిష్యులకు ఆజ్ఞాపించెను. అపోస్తులులు మారుమనస్సును గూర్చియే అత్యధికముగా ప్రసంగించిరి.
“మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును. ఆయన కుమారుడైన యేసుని రక్తము ప్రతి పాపమును మన నుండి తొలగించి, మనలను పవిత్రులనుగా చేయును” (1. యోహాను 1:9,7).
అనేకులు పలు పాపపు అలవాటులకు బానిసగా ఉన్నారు. మారు మనస్సును పొందవలెను అంటే, పాపపు అలవాటులో నుండి ఒక విడుదల కావలెను. విడుదలను పొందుకొనుటకు ప్రాముఖ్యమైన మూడు పద్ధతులు కలవు. ఒకటి దేవుని కుమారుడు ఇచ్చుచున్న విడుదల. “కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులైయుందురు” (యోహాను. 8:36).
రెండోవది, సత్యము ఇచ్చుచున్న విడుదల. “సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునను” (యోహాను. 8:32). మూడోవది, పరిశుద్ధాత్ముడు ఇచ్చుచున్న విడుదల. “ప్రభువే ఆత్ముడు ప్రభువు యొక్క ఆత్మ యెక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యము నుండును” (2. కోరింథీ. 3:17).
పాపమును విడిచి ఒకడు మారుమనస్సును పొందుచున్నప్పుడు అతని యొక్క అంతరంగమునందు గొప్ప సంతోషము కలుగుచున్నది. దేవుని యొక్క పిల్లలమయ్యాము అని గొప్ప ఆనందమును! కుటుంబమునందు సమాధానమును సంతోషమును కలుగుటతోపాటు పరలోకమునందు కూడాను గొప్ప ఆనందము కలుగును! “మారుమనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలొకమందు ఎక్కువ సంతోషము కలుగును” (లూకా. 15:7).
నేటి ధ్యానమునకై: “అపవాది మొదట నుండి పాపముచేయుచున్నాడు; గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి; అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను” (1. యోహాను. 3:8).