Appam, Appam - Telugu

సెప్టెంబర్ 30 – దేవుని వ్రేలు!

“శకునగాండ్లు –ఇది (దైవశక్తి) దేవుని వ్రేలు అని ఫరోతో చెప్పిరి” (నిర్గమ. 8:19).

మోషే ఫరో ఎదుట అనేక అద్భుతములను చేసెను. తెగుళ్లచేత ఐగుప్తును బాధించెను. ఈ సంగతిని చూచిన ఐగుప్తు దేశమునందుగల శకునగాండ్లు కూడాను కొన్ని అద్భుతములను చేసిరి. మోషే నేల ధూళిపై కొట్టినప్పుడు, భూమి యొక్క దూళి అంతయు పేళ్లాయెను. ఇలా చేయుటకు శకునగాండ్లవల్ల చేయలేక పోయిరి. కావున ఇది దేవుని వ్రేలు అని వారు చెప్పిరి.

అవును, దేవుని యొక్క వ్రేలు మోషేతో కలసి పనిచేయుటను వారు కనుగొనిరి. మనుష్యుడు చేయు పనులు కొద్దిపాటివే. దెయ్యాల సహాయముతో శకునగాండ్లు చేయుచున్న పనులు కూడాను ఒక్క స్థాయికి మాత్రమే. ప్రభువు యొక్క వ్రేలుతో చేయబడుచున్న అద్భుతము అయితే, ఎవరి వలన కూడాను చేయలేని గొప్ప ఉన్నతమైనది.

ప్రభువు మీ చేతులకు మొత్తము పది వ్రేలను ఇచ్చియున్నాడు. ఈ చేతుల చేతనే మీ యొక్క కుటుంబము కొరకు శ్రమించుచున్నారు, ప్రయాసపడుచున్నారు. మీ యొక్క చేతులను ప్రభువు యొక్క చెయ్యితో కలిపినప్పుడు, ఎలాగైతే అపో. పౌలు యొక్క చేతులతో ప్రభువు శ్రేష్టమైన అద్భుతములను చేసెనో, అదే విధముగా మీయొక్క చేతులతో శ్రేష్టమైన అద్భుతములను చేయును.

ప్రభువు యొక్క వ్రేలు సృష్టించు వ్రేలు. “నీ చేతిపనియైన నీ ఆకాశములను, నీవు కలుగజేసిన చంద్రనక్షత్రములను నేను చూడగా” (కీర్తనలు. 8:3) అని చెప్పి దావీదు నివ్వెరపోయి కీర్తించుచున్నాడు. ప్రభువు తన చేతి వ్రేలతో స్థాపించిన అన్నిటియందును, ఆయన యొక్క అనంత జ్ఞానమును, మహా గొప్ప శక్తియు, కృపయును బయలు పరచబడుచున్నది. ప్రభువు సృష్టించిన సృష్టి అన్నియును కోట్లకొలది సంవత్సరములుగా నిలిచియున్నాయి. మీరు ఆయన చేతి పనియైయున్న అద్భుతమైన సృష్టిగా ఉన్నారే!

రెండోవదిగా, ప్రభువు యొక్క వ్రేలు పరిశుద్ధమైనది. అట్టి పరిశుద్ధమైన వ్రేలతో ఇశ్రాయేలీయుల యొక్క పరిశుద్ధమైన జీవితము కొరకు ప్రభువు పది ఆజ్ఞలను వ్రాసియిచ్చేను (నిర్గమ. 31:18). రాతి పలకలపై చేతి వ్రేలతో వ్రాయుట ఎంతటి కఠినమైనది! అయితే, దేవుని యొక్క వ్రేలు అగ్నిమయమైన వ్రాతలను ఆ రాతిపలకపై పొదిగించుటకు శక్తిగలదిగా ఉన్నది.

నేడు ప్రభువు తన ఆజ్ఞలను రాతిపలకలపై కాకుండా మీయొక్క హృదయములోను, మనస్సాక్షిలోను వ్రాయవలెను. అగ్నిమయమైన ఆత్మీయ నియమములను మీలో వ్రాయవలెను. అప్పుడు మీరు పరిశుద్ధతలో నండి అత్యధిక పరిశుద్ధతను పొందుకొందురు.

మూడోవదిగా, ఆయన వ్రేలు క్షమించు వ్రేలు. పాపాత్మురాళ్లైన స్త్రీని రాళ్లతో కొట్టి చంపుటకు యూదులు ముందుకు వచ్చి నిలబడినప్పుడు, యేసు తన యొక్క వ్రేలతో నేలపై వ్రాయుచుండెను. ఆ వ్రాతలు ఆ స్త్రీకి క్షమాపణను, విడుదలను తీసుకుని వచ్చెను. దేవుని బిడ్డలారా, మీ కొరకు గాయపడిన హస్తములో నుండి శ్రవించుచున్న అమూల్యమైన రక్తముచేత ఆయన వద్ద నుండి క్షమాపణ యొక్క మహత్యమును పొందుకొనుడి.

నేటి ధ్యానమునకై: “నేను దేవుని వ్రేలితో దయ్యములను వెళ్లగొట్టుచున్న యెడల, నిశ్చయముగా దేవుని రాజ్యము మీయొద్దకు వచ్చియున్నది” (లూకా. 11:20).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.