Appam, Appam - Telugu

సెప్టెంబర్ 06 – కాళ్లను కప్పుకొనుచు!

“రెండు రెక్కలతో తన ముఖమును కప్పుకొనుచు, రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు, రెంటితో ఎగురు చుండెను” (యెషయా. 6:2).

యెషయా, దర్శనమునందు సెరాపులను చూచెను. ఆ సెరాపులు రెండు రెక్కలతో తమ కాళ్లను కప్పుకొనియుండెను. యెహేజ్కేలు ప్రవక్త, దర్శనమునందు నాలుగు జీవులను చూచెను. ఆ జీవులు తమ యొక్క రెక్కలతో శరీరమును కప్పుకొనియుండెను.

మనము కూడాను మన యొక్క కాళ్ళను మరుగుపరుచు కొనవలెనని ప్రభువు కోరుచున్నాడు. అనేకులు యొక్క కన్నులు చూచిన చోటకెళ్ళ కాళ్లు వెళ్ళుచున్నాయి. అంతమునందు పాతాళములోనికి పడిపోవుచున్నారు. మీ కాళ్లు దైవ చిత్తమును నెరవేర్చునట్లు ప్రయాసపడవలసినది అవశ్యము.

మీ యొక్క జీవితము ఆత్మ నిగ్రహమును కలిగి, దైవ చిత్తమును మాత్రమే చేయుచున్న ఒక జీవితముగా ఉండవలెను. ప్రభువు పేతురుని చూచి: “నీవు యౌవనుడవై యుండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని, నీకిష్టమైన చోటికి వెళ్లుచుంటివి; నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు; వేరొకడు నీ నడుము కట్టి, నీకిష్టము కాని చోటికి నిన్ను మోసికొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పెను” (యోహాను. 21:18).

నేడును నాగరికత అను ముసుగులో అనేకులు అసహ్యించుకొనునట్లు ధరించుకొని తిరుగుచున్నారు. దేవుని యొక్క పరిశుద్ధతను బయలు పరచకుండా, శరిరేచ్చలనె బయలుపరచుచున్నారు. శరీర సంబంధాలు దేవునికి ప్రీతికరముగా ఉండనేలేరు.

బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “శరీరాను సారమైన మనస్సు మరణము” (రోమీ. 8:5). మీరు మీ మాంసమును బయలుపరచకుండా క్రీస్తును బయలుపరచుడి. “దేవుడు ఆత్మగనుక, ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను” (యోహాను. 4:24). కావున, ఆ జీవులు తమ శరీరములను కప్పుకొనెను. సేరాపులు తమ కాళ్ళను కప్పుకొనెను.

అమెరికా దేశములో ఒక పరుగుపందెపు క్రీడాకారుడు ఉండెను. అతని కాళ్లు బహు వేగముగా పరిగెత్తగలిగినది. కాళ్ళ బంతి క్రీడాకారులు తమ దేశమునకు అతడు కావలెను అని అతనిని మభ్యపెట్టిరి. అయితే అతడు తన కాళ్ళను ప్రభువు కొరకు ప్రతిష్టించుకొని, రెడ్ ఇండియన్స్ మధ్య పరిచర్యను చేయుటకు వెళ్ళిపోయెను. వారి హృదయాలను ఆకర్షించుకొనెను.

పలు సంవత్సరములకు తర్వాత, ఒక దినమున ఆ సేవకు తన సొంత ఊరికి బయలు దేరవలసిన సమయము వచ్చెను. అక్కడి ప్రజలు ఆయన కాళ్ళను విడువక పట్టుకొనిరి. ‘మీ కాళ్లు మమ్ములను వెతుక్కుంటూ వచ్చెను, సువార్తను ప్రకటించిన కాళ్లు; పుణ్యకరమైన కాళ్లు. ఆశీర్వదించబడిన కాళ్లు’ అని చెప్పి ఏడ్చిరి. దేవుని బిడ్డలారా, అలాగైతే, పరిచర్యను చేసిన ఒక మనిష్యుని యొక్క కాళ్ళే ఆ స్థాయికి కొనియాడబడెను అంటే, ప్రభువు యొక్క పాదములు ఎంతటి అద్భుతమైనవి అను సంగతిని కాస్త తలంచి చూడుడి! సువార్తికుని యొక్క పాదములు పర్వతము మీద ఎంతో సుందరములైయున్నవి!

నేటి ధ్యానమునకై: “నీ దేవుడు ఏలుచున్నాడని సీయోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములైయున్నవి” (యెషయా. 52:7).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.