Appam, Appam - Telugu

జూలై 24 – మనుష్యుల కుట్రలు, దుష్టక్రియలు!

“భీకరుల ఊపిరి గోడకు తగిలిన గాలివానవలె ఉండగా, నీవు బీదలకు శరణ్యముగా ఉంటివి, దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను, గాలివాన తగులకుండ ఆశ్రయముగాను, వెట్ట తగుల కుండ నీడగాను ఉంటివి” (యెషయా. 25:3).

మీకు విరోధముగా పలు దుష్టులు లేవవచ్చును. మీ కార్యాలయములో పోరాటముతో కూడిన పరుస్థుతులును, సమస్యలును చుట్టుకుని ఉండవచ్చును. అట్టి సమయములలో మనుష్యుల యొక్క దుష్ట ఆత్మలపై మీరు జయము పొందునట్లు మీకు జయము ఆవశ్యము.

ప్రభువు తట్టు తీరి చూచి గోజాడేటువంటి విజ్ఞాపన, ఉద్రుక్తమైన పరిస్థితిని శాంతియుక్తముగా మార్చగలదు. ఉప్పొంగుచున్న సముద్రమును నిమ్మల పరచగలదు. వీచుచున్న తుఫాను గాలిని శాంతి పరచగలదు. ప్రార్థన యొక్క గొప్ప రహస్యము ప్రభువు మనకు ప్రజలను లోబర్చుటయైయున్నది. దావీదు సెలవిచ్చెను: “ఆయన జనములను మనకు లోపరచును మన పాదముల క్రింద ప్రజలను అణగద్రొక్కించును” (కీర్తనలు. 47:3).

జనములను ప్రభువు మనకు లోబర్చకుండినట్లయితే, కలవరములును, గలిబిలియు జరుగుచూనే ఉండును. ప్రార్థన ద్వారా మనుష్య ఆత్మలపై జయమును పొందుడి. మనుష్యుని యొక్క చెడు గుణాతిశయములు, చెడు స్వభావములపై విజయమును పొందుడి. మనుష్యుని యొక్క కోపములు, క్రోధములు, ఇచ్చలు, కామ వికారములు మిమ్ములను ముట్టకుండునట్లు ప్రార్ధించుడి.

సొలోమోను బాల్యములోనే రాజాయెను. అనుభవము లేని యవ్వన వయస్సు అది. అప్పుడు ఇజ్రాయేలు దేశములో అనుభవముగల బలసాలులును, పలు సైన్యాధిపతులును ఉండెను. వృద్ధాప్యపు వయస్సుగల మంత్రులు ఉండెను. అయితే సొలోమోను ప్రభువును తేరి చూచి ఆసక్తితో ప్రార్ధించినప్పుడు, ప్రభువు సమస్త జనములను సలోమోనునకు లోబరచెను.

బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “దరిద్రులను అధికారులతో కూర్చుండ బెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింప జేయుటకును వారిని మంటిలో నుండి యెత్తువాడు ఆయనే, లేమిగలవారిని పెంటకుప్ప మీదినుండి లేవనెత్తువాడు ఆయనే” (1. సమూ. 2:8).

దానియేలు యొక్క జీవిత చరిత్రను చూడడి. ఆయన బానిసగా బబులోనునకు వెళ్లెను. బబులోను రాజనగరునందు బబులోనియుల జ్ఞానము ఆయనలోనికి చొచ్చింపబడెను. అది సాతాను యొక్క జ్ఞానము. ఆయన దేవుని తట్టు చూచి ప్రాదించినప్పుడు, దేవుడు బబులోను నందుగల సమస్త జ్ఞానుల కంటెను పది రెట్లు సమర్ధుడైయుండునట్లు ఆజ్ఞాపించెను.

బబులోను రాజు బహు క్రూరమైన కోపిష్టుడై ఉండినప్పటికీని, దానియేలు తన స్నేహితులతో కలసి రాత్రియందు ప్రార్ధించినప్పుడు, ప్రభువు రాజు యొక్క కలను, దాని భావమును బయలుపరచెను. రాజు యొక్క కోపము అనచబడి, అనుకూలత లభించెను.

మనుష్యులపైనను, మృగములపైనను ప్రభువు మీకు అనుగ్రహించియున్న అధికారమును ఉపయోగించి ఆసక్తితో ప్రార్థించుడి. ప్రార్ధన సమస్యలను, పోరాటములను, పరుస్థుతులను మార్చును. ప్రార్ధన దేవుని ప్రసన్నతను, దేవుని మహిమను మీ లోనికి తీసుకుని వచ్చును.

నేటి ధ్యానమునకై: “నీ ప్రక్కను వేయిమంది పడినను, నీ కుడిప్రక్కను పదివేల మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు” (కీర్తనలు. 91:7).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.