Appam, Appam - Telugu

జూలై 23 – బుద్ధి వరమును పొందుకొనును!

“ఎవడైనను, ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించు కొనినయెడల, ఆ బోధ దేవుని వలన కలిగినదో, లేక నా యంతట నేనే బోధించుచున్నానో, వాడు తెలిసికొనును” (యోహాను. 7:17).

దేవుని యొక్క చిత్తము చొప్పున ఒకడు చేయుటకు తన్నుతాను సంపూర్ణముగా సమర్పించు కొనుచున్నప్పుడు, అట్టివానికి పలు ఆశీర్వాదములు లభించుచున్నది. అటువంటి మనుష్యునికి దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క బుద్ధియు కలుగుట అట్టి ఆశీర్వాదములలో ఒక్కటైయున్నది. బుద్ధిని గ్రహింపజేయు వరము అతనిలో క్రియ చేయుచున్నది.

కయీను మరియు హేబేలును సహోదరులు, ఒక దినమున వారిద్దరును ప్రభువునకు అర్పణను చెల్లించుటకు కోరిరి. కయీను ఏదో ఒక దానిని అర్పణగా చెల్లించవలెను అని కాయగూరలను తీసుకుని వచ్చెను. అయితే హేబేలు దేవుని చిత్తము చొప్పున ప్రభువునకు అర్పణను చెల్లించుటకు కోరెను.

కావున, ప్రభువునకు ఇష్టమైన అర్పణ ఏది, దేనిని ఆయన అంగీకరించును, ఏది ఆయనను సంతోషపరచును అని అతడు ఆలోచించెను. తన యొక్క అంతరంగమును ప్రభువు యొక్క అంతరంగముతో ఏకముచేసి, దేవుడు తన ఏకైక కుమారుని గొర్రె పిల్లగా ఈ లోకమునకు అనుగ్రహించనైయున్నాడు అను సంగతిని గ్రహించి ఒక గొర్రె పిల్లను బలిగా అర్పించెను. కావున అట్టి బలిని ప్రభువు అంగీకరించెను. అది గొప్ప ఔన్నత్యమైన అర్పణగా ఉండెను.

దేవుని చిత్తము చొప్పున చేయుటకు ఎవరైతే తన్ను తాను సమర్పించుకొనుచున్నారో, అతడు దేవుని యొక్క అంతరంగమును తెలుసుకొనును. సరియైన ఉపదేశమును తెలుసుకొనును. తాను నడవవలసిన త్రోవను తెలుసుకొనును. ఉన్నతము నుండి వచ్చుచున్న ప్రకటన వరములను నిశ్చయముగానే అతడు ప్రభువు వద్ద నుండి పొందుకొనును.

క్రైస్తవ జీవితమునందు ఉపదేశములు మిగుల ఆవశ్యము. అవి మన ఆత్మీయ జీవితమునకు పునాదివలె ఉండును. లేత పైరునకు కావలసిన వర్షమువలె ఉండును. ప్రభువు చెప్పెను: “నా ఉపదేశము వానవలె కురియును …. పచ్చికమీద కురియు వర్షమువలెను ఉండును” (ద్వితి. 32:2).

అదే సమయమునందు, మనము జాగ్రత్తగా ఉండవలసిన అబద్ధ ఉపదేశములు కలవు. తోడేళ్లవంటి అనేక అబద్ధ ప్రవక్తలు గొర్రె చర్మమును కప్పుకొని వచ్చుచున్నారు. అబద్ధ బోధకులును అంతిక్రిస్తులును లేచి మోసగించునట్లు అద్భుతములను కనబరుతురు. ఎవరైయితే దేవుని యొక్క చిత్తమును చేయుటకు తన్నుతాను సమర్పించు కొనుచున్నాడో, అతడు ఎన్నడును వైతొలకిపోడు. సరియైన ఉపదేశమును కనుగొనును.

మనము దేవుని యొక్క చిత్తమును తెలుసుకొనుటకు మన హృదయమును త్రిప్పుచున్నప్పుడు, ప్రభువు తన దయాసంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేయును (ఎఫెసీ. 1:10). మరెవ్వరికిని తెలియజేయని పరలోకపు మర్మములను ప్రభువు అపో. పౌలునకు బయలుపరచుటకు గల కారణము ఏమిటి? “ప్రభువా, నే నేమి చేయవలెను?” (అపో.కా. 22:10) అని అడిగి దైవ చిత్తమునకు తన్నుతాను సంపూర్ణముగా సమర్పించు కొనుటయైయున్నది.

దేవుని బిడ్డలారా, దేవుని చిత్తము చొప్పున నడుచుకొనుటకు మిమ్ములను సమర్పించుకొనుడి

నేటి ధ్యానమునకై: “ఇత్తడి తలుపులను పగులగొట్టెదను, ఇనుపగడియలను విడగొట్టెదను, అంధకారస్థలములలో ఉంచబడిన నిధులను, రహస్యస్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చెదను” (యెషయా. 45:2,3).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.