జూలై 15 – చంపుకొని తినుము
“పేతురూ, నీవు లేచి, చంపుకొని తినుమని ఒక శబ్దమతనికి వినబడెను…. దేవుడు పవిత్రము చేసినవాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరల రెండవ మారు ఆ శబ్దము అతనికి వినబడెను” (అపో.కా. 10:13-15).
అపో. పేతురు ప్రార్థనయందు పరవశుడైయున్నప్పుడు, మూడుసార్లు ఆకాశము తెరవబడి శబ్దము వినబడి పేతురుతో మాట్లాడెను. మొదటిసారి ఆ శబ్దము, చంపుకొని తినుము అని చెప్పెను. రెండవసారి నా శబ్దము, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని చెప్పెను. మూడవసారి కూడాను అలాగునే వినబడెను.
అపో.కా. 10 ‘వ అధ్యాయము నుండి, ప్రభువు తన యొక్క సువార్తను అన్యజనులకు కూడాను తీసుకుని వెళ్ళుటను చూచుచున్నాము. ఇశ్రాయేలీయులు, అన్యజనులను చులకనగా భావించెదరు, నిషిద్ధమైన వారిగా ఎంచుదురు. అయితే ప్రభువు యొక్క సువార్త సర్వసృష్టికి ప్రకటించవలసినదై ఉండెను. శిష్యులు లోకమంతటా వెళ్లి సర్వసృష్టికిని ప్రకటించవలసిన దేవుని యొక్క ఆజ్ఞను పొందుకొనిరి. అప్పుడు ఆకాశము నుండి కలిగిన శబ్దము వలన, ప్రభువు ఇశ్రాయేలీయులకును, అన్యజనులకును మధ్యన ఉన్న విభజన అను అడ్డుగోడను తొలగించెను. ప్రభువు అపవిత్రమైన వాటిని పవిత్రపరచువాడు. ఆయన పవిత్రపరిచిన దానిని ఎన్నడును నిషిద్ధమైనదని ఎంచనే కూడదు.
ప్రభువు, ఒకసారి మాత్రమే ఈ భూమి మీద జీవించుటకు మనకు ఒక్క అవకాశమును ఇచ్చియున్నాడు. ఇటువంటి అవకాశమునందు అగ్రకులస్తులని, నీచకులస్తుల, అంటరానివారని, నిషిద్ధమైన వారని వ్యత్యాసమును చూడకూడదు. పేతురునకు అట్టి సంగతిని గ్రహింపజేయుటకు పరలోకము నుండి మాట్లాడెను. నీవు అన్యజనుడు అనియు, పరదేశి అనియు, పురుషుడనియు, స్త్రీ అనియు భేదములు చూడవద్దు. గ్రీసు దేశస్తుడనియు, యూదుడనియు భేదము చూడవద్దు. భాషా వెత్యాసములనియు, కుల బేధములనియు వ్యత్యాశమును చూడవద్దు. పరలోకము ప్రతి ఒక్కరికిని సమానమైనదైయున్నది. యేసుక్రీస్తు లోకమునందుగల మనుష్యులందరి కొరకును, రక్తమును చిందించియున్నాడు. కానీ అన్యజనులకు కూడాను పరలోకము సొంతమైనది అను సంగతిని తీసుకొని వెల్లుడి.
ప్రభువైయున్న యేసు పాపులను రక్షించుటకు వచ్చెను. ఎవరైతే తమ్మును పాపులు అని ఒప్పుకొనుచున్నారో, వారు ఎవరై ఉండినను, ఎట్టి కులమును, మతమునైయుండినను, అట్టివారిని రక్షించుటకు, ప్రభువు నమ్మకస్తుడై ఉన్నాడు. బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “అల్పులైనవారు వట్టి ఊపిరియైయున్నారు. ఘనులైనవారు మాయాస్వరూపులు, త్రాసులో వారందరు తూచబడినట్లయితే తేలిపోవుదురు” (కీర్తనలు. 62:9).
నేను అగ్రకులస్తుడను అని ఒకడు అతిశయించినట్లయితే, అతడు అబద్ధమునైయున్నాడు. తమ్మును తక్కువ కులస్తులని కించపరచుకొనువారు వెర్ధమునైయున్నాడు. ఇద్దరును త్రాసులో ఉంచి తూచబడి చూచున్నప్పుడు, అక్కడ వారు వ్యర్థమైన వారిగా తేలిపోయినవారై కనబడుదురు.
క్రైస్తవ మార్గమునందు వివాహమును జరుపుచున్నప్పుడు కొందరు కుల వ్యత్యాసమును చూచుచున్నారు. ఆది పరలోకమునకు విరుద్ధమైన చర్య కదా? ప్రభువు ఎదుట ఉన్నది పరిశుద్ధమైన జాతి ఒక్కటి మాత్రమే. దేవుని బిడ్డలారా, మీరు అట్టి పరిశుద్ధమైన సముఖములో ఒక్కరుగా కనబడవలసినది అవశ్యము కదా?
నేటి ధ్యానమునకై: “సత్యమునాచరించు నీతిగల జనము ప్రవేశించునట్లు ద్వారములను తీయుడి” (యెషయా. 26:2).