జూన్ 01 – ఎడబాయను!
“నీవు బ్రదుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ యెదుట నిలువలేకయుండును; నేను మోషేకు తోడైయుండినట్లు నీకును తోడైయుందును; నిన్ను విడచి ఎడబాయుటను లేదు; నిన్ను చెయ్యి విడచి పెట్టుటను లేదు” (యెహోషువ. 1:5).
ప్రభువు యొక్క వాగ్దానములన్నిటిలోను ఈ వాగ్దానము మిగుల ప్రత్యేకమైనది. యెహోషువాకు ఇట్టి వాగ్దానమును ఇచ్చిన దేవుడు సుమారు 1300 సంవత్సరములకు తర్వాత కూడాను అట్టి వాగ్దానమును స్థిరపరచుచున్నాడు. నేను నిన్ను విడిచి ఎడబాయుటను లేదు, నిన్ను చెయ్యి విడిచి పెట్టుటను లేదు అని ఆయన చెప్పుచున్నాడు అని అపోస్తులుడైన పౌలు కూడాను జ్ఞాపకము చేయుచున్నాడు (హెబ్రీ. 13:5).
అవును ప్రభువు యొక్క వాగ్దానము ఆయన యొక్క పిల్లలకు నిరంతరమును ఉండను. మనము ఆయన యొక్క పట్టును విడిచి పెట్ట వచ్చును, ఆయనను విడిచి పెట్టి తొలగుటకు తలంచ వచ్చును. అయితే, ప్రభువు మనపై ఉంచిన ప్రేమ పట్టును విడిచిపెట్టను లేదు; మనలను విడిచి ఎన్నడును ఎడబాయుటను లేదు.
ఒక చిన్నవానికి ఈదుటకు నేర్పించువాడు అతని నడుమునకు బలమైన తాడును కట్టి తన చేతిలో పట్టుకొనుచున్నాడు. అతడు నీటిలో ఈదుటకు ప్రారంభించుచున్నాడు. అయితే ఆయన ఒడ్డున నిలబడి ఆ చిన్నవాడు మునిగిపోకున్నట్లుగా తాడును పట్టుకొని నిలబడియున్నాడు. ఆయన తాడు కురచగా పట్టుకుని ఉన్నట్లయితే ఆ చిన్నవాని వలన ఈదుటకు నేర్చుకొనలేక ఉండేవాడు.
కావున ఆయన తన చేతిలో ఉన్న తాడును కొద్దికొద్దిగా పొడిగించి విడిచిపట్టుచూ అతడు ఈదుచున్నాడా అను సంగతిని గమనించుచున్నాడు. అయితే అతడు ఒక సమయమున చక్కగా ఈదుచున్నాడు, మరో సమయమున మునిగిపోవుచున్నాడు. అయితే అతడు మునిగిపోయి మరణించుటకు ఒడ్డుపై నిలుచున్నవాడు విడిచిపెట్టడు. అతడు నీటిలో మునుగుటకు ప్రారంభించుచున్నాడు అని తెలిసిన వెంటనే తాడును పైకి లాగి మరలా ఈదున్నట్లుగా చెప్పుచున్నాడు. అయితే అతడు భయపడుచున్నాడు. ఆయన ఒడ్డుపై నిలబడి నేను నిన్ను విడిచి ఎడబాయుటను లేదు, నిన్ను చేయ్యి విడచి పెట్టుటను లేదు. ఎల్లప్పుడును నిన్ను నా చేతులతో పట్టుకొనియున్నాను అని చెప్పుచున్నాడు. ఆ పిల్లవానికి ఎంతటి ఆదరణయు, సంతోషముగా ఉండును!
పలు సమయములలో మనము ఆత్మీయ జీవితములో ఈదుట నేర్చుకొనుటకు ప్రభువు అవకాశములను ఇచ్చుచున్నాడు. తన యొక్క తాడును కొద్దికొద్దిగా పొడిగించి పట్టుకొనుచున్నాడు. మనము అట్టి సమయములలో ప్రభువు నన్ను చేయ్యి విడిచి పెట్టెను. ప్రభువు నా ప్రార్థనను ఆలకించలేదు అని చెప్పి అల్లాడుచున్నాము. అయితే ప్రభువు, మనుష్యుని కట్టి లాగేటువంటి ప్రేమ పాశముచేత మనలను కట్టి తన వద్దకు చేర్చి పెట్టుకొనుచున్నాడు.
దేవుని బిడ్డలారా, ప్రభువు యొక్క ప్రేమ ఎల్లప్పుడును మనలను వెంబడించుచూనే వచ్చుచున్నది. తప్పిపోయిన గొర్రెవలే ఆయన మనలను వెతుకుచున్నాడు. కనబడకపోయినా వెండి నాణమువలె కనుగొని ఆనందించునట్లు ఆయన ఆనందించుచున్నాడు. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చువరకును తపనతో ఎదురుచూచుచున్న తండ్రివలె మన కొరకు ఎదురుచూస్తున్నాడు. నేను నిన్ను విడిచి ఎడబాయుటకు కోరుకొనుటనులేదు. నిన్ను చేయ్యి విడిచిపెట్టుటకు కోరుకొనుటను లేదు అని చెప్పి హక్కున చేర్చుకొని ప్రేమతో ముద్దు పెట్టుచున్నాడు.
నేటి ధ్యానమునకై: “నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో, నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నాను” (మత్తయి. 28:20).