సెప్టెంబర్ 24 – చెవియొగ్గు హృదయము!
“నీ దేవుడైన యెహోవావైపు తిరిగి, నేడు నేను నీ కాజ్ఞాపించు సమస్తమును బట్టి, నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను ఆయన మాట నీవును నీ సంతతివారును వినినయెడల, నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్మును తిరిగి రప్పించును” (ద్వితీ. 30:2,3).
మీ యొక్క హృదయము ప్రభువు యొక్క స్వరమును వినేటువంటి హృదయముగా ఉండవలెను. అంతటితో మాత్రము గాక, ఆయన యొక్క స్వరమునకు చెవియొగ్గి, లోబడుచున్న హృదయముగాను ఉండవలెను. ప్రభువునకు చెవియొగ్గుచున్నప్పుడు, ఏయే ఆశీర్వాదములు వచ్చి చేరును అను సంగతిని ద్వితీ. 28:1-14 నందును, ఆయన స్వరమునకు చెవియెగ్గక పోయినట్లయితే వచ్చి చేరేటువంటి శాపములను ఆ అధ్యాయము యొక్క మిగతా భాగమునందు బైబిలు గ్రంథము పట్టిక వేసి తెలియజేయుచున్నది.
ప్రభువు యొక్క స్వరమును మనము లేఖన వచనముల ద్వారానే వినగలము. లేఖన వాక్యములన్నియును ఆత్మయు, జీవమునైయున్నది. పరిశుద్ధాత్ముని ద్వారా అనుగ్రహింపబడియున్నది. అవి మన యొక్క ప్రాణముతోను, ఆత్మతోను మాట్లాడుచున్నది.
అవి మనలను సోమ్మసిల్లు సమయములయందు దృడపరచుచున్నది. అధైర్యమును, అవిశ్వాసమును మార్చి విశ్వాసమును పురిగొలుపుచున్నది. మార్గము తెలియక అలమటించు చున్నప్పుడెల్లను, కాళ్లకు దీపముగాను, త్రోవకు వెలుగుగాను ఉన్నది. బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “యెహోవా స్వరము బలమైనది; యెహోవా స్వరము ప్రభావముగలది” (కీర్తనలు. 29:4).
కొందరు దేవునికి విరుద్ధముగా వితండవాదము చేయుచున్నారు. మధ్యపానీయము తాగకూడదు అని ఎందుకని పది ఆజ్ఞలలో వ్రాయబడలేదు? దూరదర్శిని కార్యక్రమములను చూడకూడదు అని లేఖన గ్రంథము చెప్పుచున్నదా? సిగరెట్టు తాగకూడదని ఎక్కడ వ్రాయబడియున్నది అని మాట్లాడుచున్నారు. ఇట్టివారి యొక్క పిచ్చి మాటలకు హద్దే లేదు. ప్రభువు యొక్క మాటకు పూర్ణహృదయముతో చెవియొగ్గవలెను అను తలంపు లేకపోవుటయే వారి యొక్క ఇట్టి వ్యర్థపు మాటలకు కారణము.
సాధారణముగా మధ్యము, మగువ, జూదము మొదలగునవి వద్దు అని లోక ప్రజలే ద్వేషించి విడిచిపెట్టుచున్నారు. అనేకులు లోక ప్రకారమైన ప్రశ్నలను కోరుకొనుటలేదు. దేవుని బిడ్డల యొక్క నీతి వారి నీతి కంటే అత్యధికముగా ఉండవలెను కదా?
ప్రభువునకు స్తోత్రబలిని అర్పించి, ఆయన పాదముల చెంత కనిపెట్టుకొని ఉన్నప్పుడు, ప్రభువు మీతో మాట్లాడును. కలల ద్వారాను, దర్శనము ద్వారాను, లేఖన వచనముల ద్వారాను ఆయన మీతో మాట్లాడను. ఆయన మాటకు చెవియొగ్గుడి.
ప్రభువునకు చెవియగుచున్నప్పుడు, ఆశీర్వాదములు మిమ్ములను ఆవరించుచున్నట్లుగానే, ప్రభువునకు చెవియొగకుండా ఉండుటను కఠిన పరుచుచున్నప్పుడు, శాపములు సంభవించును. దేవుని బిడ్డలారా, శాపములకు మిమ్ములను తప్పించి కాపాడుకొని ఆశీర్వాదములను పొందుకొనుడి.
నేటి ధ్యానమునకై: “యెహోవా నీకు …. ఆకాశమను తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు, కాని నివు అప్పుచేయవు” (ద్వితీ. 28:12).