Appam, Appam - Telugu

సెప్టెంబర్ 07 – బ్రదికింపుము!

“మమ్మును బ్రదికింపుము, అప్పుడు నీ నామమును బట్టియే మేము మొఱ్ఱపెట్టుదుము” (కీర్తనలు. 80:18).

“బ్రతికింపుము ప్రభువా” అని దావీదు కన్నీటితో ప్రార్ధించుటను చూడుడి. అవును, ప్రభువు బ్రతికించువాడు. ఇతరులు ఇతడు అప్పుల సమస్యలో మునిగిపోవును, అతని వృత్తి క్షీణించి పోవును అని తలంచుచున్నప్పుడు, ప్రభువు అటువంటి వారిని అద్భుతముగా మరల తిరిగి బ్రతికించును.

మీకు వ్యాధియా? బలహీన పడిపోయారా? కుటుంబమునకు చేయవలసిన బాధ్యతలను చేయలేక పోవుచున్నారా? ప్రభువు మిమ్ములను బ్రతికించును. బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “మృతులలో నుండి క్రీస్తుయేసును లేపినవాడు చావునకులోనైన మీ శరీరములను కూడ మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును” (రోమీ. 8:11).

బలహీనత సమయములలో ప్రభువును తేరి చూచి, “నన్ను బ్రతికింపుము ప్రభువా” అని బతిమాలుడి. “విశ్వాససహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును; అతడు పాపమును చేసినవాడైతే పాపక్షమాపణ నొందును” (యాకోబు. 5:15).

ప్రాణమునకు ప్రమాదకరమైన స్థితిలో ఒక వ్యాధిగ్రస్తుడ్ని వైద్యశాలకు తీసుకుని వెళుచున్నప్పుడు, మరణపు వుచ్చుల నుండి అతనిని బ్రతికించుటయే వైద్యులు చేయుచున్న మొదటి అంశము. ఆ తరువాత బ్రతికింపబడ్డ అతడు మంచి స్వస్థతను, బలమును పొందుకొనవలెనని చికిథ్స చేయుచున్నారు. పరమ వైద్యుడైన ప్రభువు ఏమి చేయుచున్నాడు? మొదటిగా, జీవము కలిగియుండుటకు, ఆ తరువాత ఆ జీవము పరిపూర్ణత చెందుటకును కృపను కనబరుచుచున్నాడు (యోహాను. 10:10).

నేడు బహుశా, మీరు గాని లేక మీకు ప్రియులైనవారు గాని వ్యాధి బారినపడి ఉండవచ్చును. బ్రతికించుటకు శక్తిగల ప్రభువును తేరిచూచి, ఆయన మీద విశ్వాసమును ఉంచుచున్నప్పుడు, నిశ్చయముగానే కృప యొక్క శక్తి మీ మీదకు దిగివచ్చి వ్యాధిచేత పీడింపబడుచున్న వారిని బ్రతికించును. ప్రభువు కదా మిమ్ములను సృష్టించినవాడు? మీయొక్క ఎముకలను, నరములను, ధమనులను, రక్తపు అణువులన్నిటిని కలుగజేసినవాడు ఆయనే కదా! ఆయన మిమ్ములను బ్రతికింపచేయును.

మిమ్ములను జీవింపచేయుట కొరకే తన జీవమునే ఆయన అనుగ్రహించెను. తన ప్రాణమును పానబలిగా కుమ్మరించెను. రక్తపు క్రయధనమును చెల్లించి, మీయొక్క శరీరములను విమోచించియున్నాడు. మిమ్ములను స్వస్థపరచుట కొరకు శరీరమునందు దెబ్బలను వహించుకొనెను. ఆయన మిమ్ములను జీవింప చేయకుండా ఉండునా? మీయొక్క ఆయుష్షు దినములను పొడిగించకుండా ఉండునా? నిశ్చయముగానే ఆయన అద్భుతమును చేయును.

లాజరు మరణించినప్పుడు, ఆయన యొక్క సహోదరీలకు ప్రభువు బ్రతికించును అను విశ్వాసము లేకుండెను. లాజరు మరణించి నాలుగు దినములు గతించిపోయేనే, కంపుకొట్టునే అని చెప్పెను మార్తా. నీవు విశ్వసించినట్లయితే దేవుని యొక్క మహిమను చూచెదువు అని చెప్పి: ‘లాజరు బయటికి రా’ అని యేసు అధికారముతో పిలిచెను. ఎంతటి ఆశ్చర్యము! లాజరు యొక్క శరీరము సజీవముగా లేచెను.

దేవుని బిడ్డలారా, ఈ యేసుక్రీస్తు నేడును జీవించుచున్నాడు. ఆయన నిన్నా, నేడు, నిరంతరమును మారనివాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదియు లేదు.

నేటి ధ్యానమునకై: “నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను; నాకు అసాధ్యమైనది ఏదైన నుండునా?” (యిర్మియా. 32:27).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.