నవంబర్ 17 – బలమును ధరింపజేయువాడు!
“నాకు బలమును ధరింపజేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే” (కీర్తనలు. 18:32).
దేవుని బలమును మీరు ధరించుకోనుడి. అప్పుడే అరుదైన గొప్ప కార్యములను ప్రభువు కొరకు చేసి ముగించగలరు. వయస్సు మళ్లిన దినములలో తాను దేవుని బలమును ధరించుకొని కొండ ప్రాంతమును స్వతంత్రించుకొనిన కాలేబు యొక్క జీవితము మనలను ఆశ్చర్యపరచుచున్నది. అలాగుననే గిద్యోను తాను కలిగియున్న కొద్దిపాటి బలముతోను, ప్రభువు యొక్క ప్రసన్నతతోను, యుద్ధమునకు వెళ్లి మిద్యానియ్యులను జయించిన సంభవము మనలను దేవుని బలముచేత ధరింప చేయుచున్నది.
దావీదు యొక్క అనుభవము ఏమిటి? ఒకవైపున ఆయన యుద్ధము కొరకు బలమును పెంపొందించుకొనెను. మరోవైపున ప్రభువును ఆరాధించుట కొరకు బలమును పెంపొందించుకొనెను. గొర్రెలను కాయుచున్న దావీదు తనకు ఉన్నత బలమును ధరింపజేసుకొని యుండిన్నందున, గొర్రెలకు విరోధముగా వచ్చిన ఎలుగుబంటిని సింహమును కొట్టి పడగొట్టెను.
గోలియాత్తుపై జయమును పొందెను. వందల కొలది రాజులపై యుద్ధమునకు వెళ్లి జయమును స్వతంత్రించుకొనెను. అట్టి ప్రభువు మీకు కూడాను తన యొక్క బలమును ధరింప చేయును. దేవుని వచనముల చేత బలపరచును, వరములచేతను, శక్తిచేతను బలపరచును.
కీర్తనలు. 18:32 – లో ‘నాకు బలమును ధరింపచేయువాడు’ అని వ్రాయుచున్న దావీదు 39 ‘వ వచనములో ‘యుద్ధమునకు నీవు నన్ను బలమును ధరింపజేసితివి’ అని చెప్పుచున్నాడు. యుద్ధపు యోధులు యుద్ధమునకు సైన్యముగా తరలి వెళ్ళుటకు ముందుగా తమ యొక్క నడుమును స్థిరముగా కట్టుకొందురు. ఒక మనుష్యుని యొక్క నడుములోనే అతని యొక్క పూర్తి బలము ఉండును.
అందుచేతనే యేసుక్రీస్తు మీ యొక్క నడుములు కట్టుకొనియుండుడి అని చెప్పుచున్నాడు (లుకా. 12:35). సత్యమను దట్టిని మీ యొక్క నడుమునకు కట్టుకొనియుండుడి అని అపో. పౌలు వ్రాయిచున్నాడు (ఎఫెసీ. 6:14). మీ మనస్సు అను నడుమును కట్టుకొనియుండవలెను అని అపో. పేతురు. (1. పేతురు. 1.13) సూచించుచున్నాడు.
ప్రభువు దావీదు మూలముగా ఇశ్రాయేలు దేశము యొక్క సరిహద్దులను విశాల పరుచునట్లు చేసెను. ఫిలీస్థియ్యులకు విరోధమైన యుద్ధము, అమాలేకీయ్యులకు విరోధమైన యుద్ధము, అని దావీదు యొక్క కాలమంతయు గొప్ప యుద్ధములు జరుగుచూనే ఉండెను. “దావీదు అంత కంతకు ప్రబలెను” (2. సమూ. 3:1) అని బైబిలు గ్రంథము చెప్పుచున్నది. అలాగున బలము పై బలమును పొందినందున దావీదు, నా మీదికి లేచినవారిని నా క్రింద అణచివేసితివి అని చెప్పెను (కీర్తనలు. 18:39).
మీరు ఒక యుద్ధభూమిలో నిలబడియున్నారు. లోకము, మాంసము, సాతాను మొదలగునవి మానక మీతో యుద్ధమును చేయుచునే ఉన్నవి, తుది శ్వాస ఉన్నంతవరకను ఇట్టి పోరాటములు ఉంటూనే ఉండును. పాపమును ఎదిరించి నిలబడుటలో రక్తమును చిందునంతగా మీరు పోరాడుటకు కావలసిన ఆత్మీయ బలము మిగుల అవస్యము.
దేవుని బిడ్డలారా, ఇదిగో ప్రభువు మీకు బలమును ధరింపచేయును.
నేటి ధ్యానమునకై: “నేను యెహోవాయందు ఆనందించెదను, నా రక్షణకర్తయైన నా దేవునియందు నేను సంతోషించెదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము; ఆయన నా కాళ్లను లేడికాళ్లవలె చేయును, ఉన్నత స్థలములమీద ఆయన నన్ను నడవచేయును” (హబక్కూకు. 3:18,19).