నవంబర్ 06 – కలలు దర్శనములు ద్వారా!
“మీ ముసలివారు కలలు కందురు, మీ యౌవనులు దర్శనములు చూతురు” (యోవేలు. 2:28).
మనతో కూడా మాట్లాడుట కొరకే కలలను దర్శనములను ప్రభువు మనకు ఇచ్చుచున్నాడు. ప్రభువు మనతో కూడా మాట్లాడుట కొరకే, ఇట్టి అంత్య దినములలో సర్వశరీరులైన అందరి మీదను తన యొక్క ఆత్మను కుమ్మరించుచూనే ఉన్నాడు. పరిశుద్ధాత్మ చేత పరలోకమును భూమిని ఏకముచేయుచున్నాడు.
కడవరి వర్షము మన మధ్యలో కుమ్మరించబడినందున మనలో ప్రవక్తలు లేవనెత్త బడుచున్నారు. సువార్తికులు లేవనెత్త బడుచున్నారు. ప్రభువు కొరకు గొప్ప కార్యములను చేయుచున్నవారు లేవనెత్త బడుచున్నారు. అంత మాత్రమే కాదు, మన యొక్క ముసలివారు దర్శనములను చూతురు, యవ్వనులు కలలను కందురు.
పాత నిబంధనలో యోసేపును గూర్చి మనము చదువుచున్నప్పుడు యోసేపు ‘కలలు కనువాడు’ అనియే పిలవబడటను చూచుచున్నాము. చిన్న వయస్సు నుండి ప్రభువు యోసేపుతో కూడా కలల ద్వారా మాట్లాడి, భవిష్యత్కాలమును ముందుగా తెలియజేయువాడుగా ఆయనను రూపించెను.
కలలలో మూడు రకములు కలవు. మొట్టమొదటి రకము కలలను చూచు వారి యొక్క జీవితములో నెరవేరు కలలు. దానికి ఉదాహరణముగా యోసేపు యొక్క కలలను మనము చెప్పవచ్చును. ఆయన యవ్వన ప్రాయములో చూచిన కలల యొక్క అత్యధిక భాగము ఆయనకు తర్వాతి కాలములో ఐగుప్తునందు హెచ్చింపబడిన దినమునందు నెరవేర్చబడెను. ప్రభువు ముందుగానే కలలను దర్శనములను యోసేపునకు ఇచ్చినందున, ఆయన నడిచి వెళ్లిన శ్రమల యొక్క బాటలో సంతోషముగా ముందుకు సాగి పోగలిగెను.
రెండోవది, దానియేలు యొక్క ప్రవచనములు, కలలు దీర్ఘకాలము తరువాత నెరవేర్చబడేటువంటి కలలుగా ఉండెను. నేడును నెరవేర్చబడవలసిన భాగములు, ఆ కలలలో మిగిలియున్నాయి. వెయ్యేల పరిపాలనను గూర్చియు, నిత్యత్వమును గూర్చి కూడాను ఆయన కలల ద్వారా ఎరిగియుండెను.
మూడోవ రకపు కల, అప్పుడే జరుగుచున్న వాటిని అప్పటికప్పుడే చూచునట్లు ఉన్నాయి. ఉదాహరణకు, లోకమునందు ఎట్టి భాగములోను జరుగుచున్న అన్ని కార్యకలాపాలను మరియు అంత్యరిక్షముల యొక్క సంభవములను కూడా అప్పటికప్పుడే భారత దేశములో ఉంటూనే దూరదర్శనిలో చూచునట్లుగా అప్పటికప్పుడు జరుగుతున్న సంభవములను అలాగునే చూచునట్లు ప్రభువు కృపను చేయుచున్నాడు.
కల అనుట ఒక దైవీక భాష. కొన్ని సమయములలో అట్టి కలలను మనము తిన్నగా చూడవచ్చును. కొన్ని సమయములలో అవి ఉపమానములుగా కనబడుచున్నాయి. ఘూడాంశముగాను ప్రభువు వాటిని ఉంచియున్నాడు.
దేవుని బిడ్డలారా, ప్రభువు మీతో కూడా కలల ద్వారా మాట్లాడును. ప్రభువు ఇచ్చుచున్న కలలు మరియు దర్శనములు అన్నిటికిని లోతైన అర్థములు కలవు. ప్రభువు మీకు వాటిని బయలుపరచును.
నేటి ధ్యానమునకై: “వారిద్దరు రాగా ఆయన –నా మాటలు వినుడి; మీలో ప్రవక్తయుండిన యెడల, యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలిసి కొనునట్లు కలలో అతనితో మాటలాడుదును” (సంఖ్యా. 12:6).