నవంబర్ 05 – లేఖన వాక్యముల ద్వారా!
“వాటిని ఎల్లప్పుడు నీ హృదయమునందు ధరించుకొనుము, నీ మెడచుట్టు వాటిని కట్టుకొనుము. నీవు త్రోవను వెళ్లునప్పుడు అది నిన్ను నడిపించును; నీవు పండుకొనునప్పుడు అది నిన్ను కాపాడును; నీవు మేలుకొనునప్పుడు అది నీతో ముచ్చటించును” (సామెతలు. 6:21,22).
ప్రభువు మనతో కూడా మాట్లాడటకు వేల కొలది మార్గములు కలదు. ప్రభువు ప్రకృతి ద్వారా మాట్లాడను; లేఖన వాక్యముల ద్వారాను మనతో కూడా మాట్లాడును లేఖన వాక్యములు అన్నియును దేవుని ఆత్మ వలన అనుగ్రహించ బడియున్నది.
బైబిలు గ్రంధము తన యొక్క సేవకుల ద్వారా వ్రాసి ఇచ్చిన దేవుడు, లేఖన వచనమును ముద్రించి మన యొక్క చేతులలో వినియోగించిన ప్రభువు, అట్టి లేఖన వచనముతో తన యొక్క స్వరమును కూడాను ఏకముగా జతపరిచియున్నాడు.
బహుశా బైబిలు గ్రంథము అనునది మిగతా సాధారణ గ్రంథములవలె కనబడవచ్చును. మిగతా గ్రంధములవలె కాగితములో సిరతో ముద్రించబడియున్నది. అయితే మిగతా పుస్తములకంటేను ఈ బైబిలు గ్రంథము అనునది మిగుల గొప్ప శ్రేష్టమైనది.
బైబిలు గ్రంథములో ప్రతి ఒక్క అక్షరములోను, ఆత్మ ఉన్నది. జీవము ఉన్నది. లేఖన వాక్యములు అన్నియును ఆత్మయు జీవమునైయుండుట చేత ఆ ఆత్మయు జీవమును జీవింపజేయు శక్తిని తీసుకుని వచ్చుచున్నది. చదువుచున్న వారి యొక్క ప్రాణములో జీవమును తీసుకొని వచ్చుటతో పాటు, అది చదువుచున్న వారితో మాట్లాడుటను చేయుచున్నది. కావున, ఇట్టి లేఖన గ్రంథమునకు సరి సాటియైనది లేదు.
మా యొక్క తండ్రిగారికి చిన్ననాటి నుండే అత్యధికముగా చదువవలెను అను ఒక తపన ఉండెను. విదేశాలలో ఉన్న ఆయన యొక్క తండ్రిగారు, వ్రాయుచున్న ఉత్తరముల అన్నియును “కుమారుడా, నీవు ఎమ్. ఏ చదువు వలెను” అని మరలా మరలా వ్రాసేవారు. అలాగున ఆయన ఎమ్. ఏ చదివెను. మరొక్క ఎమ్. ఏ చదువుటకు తలంచెను. దానిని కూడా చదివెను. ఆదాయపు పన్ను చట్టములన్నిటిని చదివెను.
అయితే ఇట్టి పుస్తకములన్నియును ఆయనకు కేవలము లోక జ్ఞానమును ఇచ్చేనే తప్ప, ప్రాణములో విశ్రాంతిని ఎన్నడును తీసుకొని రాలేదు, దైవ సమాధానము తీసుకొని రాలేదు. రక్షణ సంతోషమును తీసుకొని రాలేదు. పరలోకపు మహిమను తీసుకొని రాలేదు.
అయితే ఈ లేఖన గ్రంథము ఆత్మయు జీవమునైయున్నది. అది ఆయనతో కూడా మాట్లాడినది. ఆయనను నూతన సృష్టిగా మార్చినది. జీవమును తీసుకొని వచ్చినది. అట్టి జీవము నిత్యా నిత్యముగా ఆయనను ఔనత్య పరచినది. దేవుని యొక్క శక్తిని ఆయన లోనికి తీసుకొని వచ్చినది.
బైబిలు గ్రంథమును వ్రాసిన పరిశుద్ధాత్ముడు దానిని మనకు వివరించి ఇచ్చునట్లు వేరే ఎవరి వలన మనకు వివరించి చెప్పలేరు. “తండ్రి నాతో మాట్లాడుమయ్యా, లేఖనము యొక్క లోతులను, మరుగైన అంశములను నాకు నేర్పించుమయ్యా” అని నిజముగా మనము తపనతో బతిమిలాడి అడుగుచున్నప్పుడు ప్రభువు అట్టి లేఖన వాక్యముల ద్వారా మనతో కూడా మాట్లాడును. ప్రభువు యొక్క వాగ్దానపు వచనములు మనలను ఉత్సాహపరచి, ధైర్యపరచుచున్నది.
దేవుని బిడ్డలారా, లేఖన గ్రంథమును ఆశతో, ప్రేమించి చదువుడి.
నేటి ధ్యానమునకై: “యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు” (కీర్తనలు. 1:2).