Appam, Appam - Telugu

జూలై 08 – స్వరమండలపు శబ్దము!

“మరియు, విస్తారమైన జలముల ధ్వనితోను, గొప్ప ఉరుము ధ్వనితోను, సమానమైన యొక శబ్దము పరలోకములోనుండి రాగా వింటిని; నేను వినిన ఆ శబ్దము (వీణలు) స్వరమండలములను వాయించుచున్నవారు తమ స్వర మండలమును వాయించుచున్న (వైణికుల) నాదమును పోలినది” (ప్రకటన. 14:2).

బైబిలు గ్రంథమునందు గల సంగీత వాయిద్యములన్నిటిలోను, స్వరమండలము అను సంగీతవాయిద్యము మిగుల ప్రత్యేకమైనది. అదియే దావీదు వాయించిన ప్రాముఖ్యమైన సంగీత వాయిద్యమునైయున్నది. “దేవా నా దేవా, (సితారా) స్వరమండలమును వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను” (కీర్తనలు. 43:4) అని దావీదు చెప్పెను.

స్వరమండలమును వాయించుచున్నప్పుడు, దేవుని యొక్క ప్రసన్నత కొలత లేకుండా దిగి వచ్చుటను ఆయన గ్రహించెను. అంత మాత్రమే కాదు, స్వరమండలము ద్వారా ప్రకటన వరములు ఆయనపై దిగివచ్చెను. ప్రభువు చెప్పెను: “స్వరమండలమును (సితారా) తీసికొని నా మరుగుమాటను బయలుపరచెదను” (కీర్తనలు. 49:4). స్వర మండలము భూసంబంధమైన సంగీతముగా మాత్రము గాక, పరలోక సంబంధమైన సంగీతముగాను ఉన్నది. ప్రకటన గ్రంథమునందు పరలోకపువాసులు మూడుసార్లు స్వరమండలములను వాయించి ప్రభువును స్తుతించుటను చూడవచ్చును.

ప్రవక్తయైన సమూయేలు యొక్క దినములలో, స్వరమండలపు నాదముతో ప్రవచనపు అభిషేకము కూడాను ఏకమైయుండెను. “ఊరిదగ్గరకు నీవు రాగానే, స్వరమండలము తంబుర సన్నాయి సితారా వాయించువారి వెనుక ఉన్నతమైన స్థలమునుండి దిగివచ్చు ప్రవక్తల సమూహము నీకు కనబడును; వారు ప్రకటనచేయుచు వత్తురు” (1. సమూ. 10:5) అని రాజవ్వబోచున్న సౌలు వద్ద సమూయేలు ప్రవక్త చెప్పెను.

ఎలీషా ప్రవచనమును ప్రకటించుటకు ముందుగా, ఒక పరిశుద్ధమైన దైవీక సంగీత నాదమును వినుటకు కోరెను. కావున, ఒక స్వరమండలపు వాయిద్య కారుని నా వద్దకు తీసుకొని రండి అని అడిగెను. స్వరమండలపు వాద్యకుడు ఒకడు వచ్చి వాయించుచుండగా, యెహోవా హస్తము అతని మీదికి దిగివచ్చెను గనుక, అతడు దేవుని యొక్క మాటను రాజులకు ప్రవచనముగా ప్రకటన చేసెను (2. రాజులు. 3:15).

ఒక బలమైన ప్రవచనపు అభిషేకమును పొందుకొనిన, ఒక దైవ సేవకురాళ్లు, బహు స్పష్టముగా, తేటగా ప్రవర్చనమును ప్రవర్చించును. ఆ రీతిగా ప్రవర్తించుటకు ముందుగా, దేవుని యొక్క సేవకులు ప్రభువును పాడి స్తుతించి సంగీత వాయిద్యములను వాయించుదురు.

అప్పుడు ప్రభువు యొక్కఆత్ముడు ఆమెపై దిగివచ్చును. వేల సంఖ్యలో ఎంతమంది వచ్చియుండినను, సహనముతో అంతమందికి కూడాను, వ్యక్తిగతముగా ఆ సేవకురాళ్లు ప్రవచించుచుండును. విద్యా జ్ఞానము లేని ఆ సహోదరిని ప్రభువు వాడుకొను విధమును చూచి నేను ఆశ్చర్యపడియున్నాను.

అదే విధముగా మరొక సేవకుడు ప్రసంగమునకు ముందుగా, తన అకార్డిన్ అను సంగీత వాయిద్యమును తీసి అనేక పాటలను అభిషేకముతో నింపబడి పాడుచుండును. ప్రభువు యొక్క శక్తి దిగువచ్చున్నప్పుడు, ప్రసంగించును. అట్టి ప్రసంగము ప్రవచనపు మాటలుగా బయలుపరచబడును. అప్పుడు అనేకులు తమ యొక్క హృదయమును ప్రభువునకు సమర్పించుకొని మారుమనస్సు పొందుదురు. దేవుని బిడ్డలారా, ప్రభువును పొగడి స్తుతించి చూడుడి.

నేటి ధ్యానమునకై: “బూరధ్వనితో ఆయనను స్తుతించుడి; స్వరమండలముతోను సితారాతోను ఆయనను స్తుతించుడి” (కీర్తనలు. 150:3).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.