Appam, Appam - Telugu

జూలై 04 – మేఘములోనుండి ఒక శబ్దము!

“ఈయన నే (నేర్పరచుకొనిన) నా ప్రియకుమారుడు,ఈయన మాట వినుడని యొక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను” (లూకా. 9:35).

ఒకసారి యేసుక్రీస్తు తన శిష్యులైన పేతురు, యోహాను, యాకోబు అను మొదలగు వారిని వెంటపెట్టుకొని ప్రార్థించుటకు ఒక కొండపైకి ఎక్కి, వారి ఎదుట రూపాంతరముచెందిను. ఆయన యొక్క ముఖము సూర్యునివలె ప్రకాశించెను. ఆయన వస్త్రము వెలుగువలె తెల్లనివై ధగధగ మెరిసెను. మరియు మోషే, ఏలీయా అను ఇద్దరు మహిమతో అగపడి, ఆయనతో వారు మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు యేసును చూచి: “ఏలినవాడా, … నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలీయాకు ఒకటియు, మూడు పర్ణశాలలు మేముకట్టుదుము” అనెను (లూకా.9:33).

అప్పుడు, ఆకాశము నుండి ఒక శబ్దము ధ్వనించెను. “ఈయన నా ప్రియకుమారుడు, …. ఈయన మాట వినుడని” సెలవిచ్చెను (మత్తయి.17:5). అదే విధముగా యేసు బాప్తిస్మమును తీయుచున్నప్పుడు, “మరియు, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను” (మత్తయి. 3:17).

ఇక్కడ మోషే ధర్మశాస్త్రమునకు సాదృశ్యమైనవాడు, కావున ఇశ్రాయేలీయులు మోషే యొక్క శబ్దమునకు చెవియొగ్గిరి. ఏలియా ప్రవక్తలకు సాదృశ్యమైనవాడు, కావున ప్రజలు ఆయన యొక్క ప్రవచనపు వాక్కులకు చెవియొగ్గిరి. ఇద్దరును పాత నిబంధనకు చెందినవారు. అయితే, క్రొత్త నిబంధన యొక్క కృపాకాలము ప్రారంభించబడియున్నది. ఇప్పుడు పరలోకము క్రీస్తును ఘనపరచి, “ఆయన మాటకు చెవియగ్గుడి” అని సెలవిచ్చెను.

మోషేయు, ఎలియాయు ఎంతైనను రూపాంతరపు కొండకు వచ్చి మాట్లాడినను, వారు మీ కొరకు ప్రాణమును పెట్టలేదు. క్రీస్తే ప్రాణమును పెట్టియున్నాడు. క్రీస్తు రానైయున్న న్యాయాధిపతి. కావున ఆయనకు చెవియొగ్గుడి. భూసంబంధమైన జీవితములో, ఒక్కడు పలు శబ్దములకు చెవియొగ్గవలసినదై ఉండినప్పటికీని, ప్రధానముగా ప్రభువు యొక్క శబ్దమునకే చెవియోగ్గవలెను. ప్రభువు యొక్క శబ్దమునకు విరుద్ధమైన వెవ్వేరు శబ్దమునకు చెవియొగ్గవలసినది లేదు.

ప్రభువు కొరకు రోషముగా ఉన్న ఒక చిన్నదానిని, ఆమె తల్లిదండ్రులు తాగుడు అలవాటు ఉన్న ఒక పటాలపు దళపతికి ఇచ్చి వివాహము చేసిరి. అతడు తన తోటి దళపతులతో రాత్రియందు తాగి నాట్యమాడు అలవాటు గలవాడు. అతడు తన భార్య వద్ద తన తోటి వారికి మద్యపానమును పోసి ఇచ్చి, వారితో కలసి నార్చమాడునట్టు చెప్పెను. ఆమె నిరాకరించగా, అతడైయితే, భర్తకు లోబడు అను లేఖన వాక్కును జ్ఞాపకము చేసెను.

దానికి ఆమె, “(స్త్రీ) భార్యలారా, ప్రభువునకువలె మీ సొంతపురుషులకు లోబడియుండుడి” (ఎఫెసీ. 5:22) అనియే బైబిలు గ్రంథమునందు చెప్పబడియున్నది. ‘ప్రభువునకు విరుద్ధముగా నడిచి, ఆయనను దుఃఖపరచిన మీకు లోబడలేను’ అని దృఢముగా చెప్పెను.

దేవుని బిడ్డలారా, భక్తి వైరాగ్యముతో ఆకాశము నుండి వచ్చుచున్న శబ్దమునకు లోబడుడి. నిత్యా నిత్యా కాలమునకు ఆశీర్వదింపబడుదురు.

నేటి ధ్యానమునకై: “వారు తమ కన్నులెత్తి చూడగా, యేసు తప్ప మరి ఎవరును వారికి కనబడలేదు” (మత్తయి. 17:8).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.