Appam, Appam - Telugu

జూన్ 19 – జీతము!

“పాపమువలన వచ్చు జీతము మరణము; అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్యజీవము” (రోమీ. 6:23).

ప్రతినెల మనము చేయుచున్న పనికి జీవితమును పొందుకొనుచున్నాము. ఆ జీతము పుచ్చుకొనుచున్నప్పుడు మన యొక్క హృదయమునందు ఆనందమును, సంతోషమును కలుగుచున్నది. ఆ జీతమును తీసుకొని వచ్చి కుటుంభమునకు కావలసిన వస్తువులన్నిటిని కొనుగోలు చేయుచున్నాము.

అదే విధముగా, మనము పాపము చేయుచున్నప్పుడు దాని తగిన కూలిని పొందు కొనవలసినదైయున్నది. పాపము యొక్క జీతము మరణము అని బైబిలు గ్రంధము చెప్పుచున్నది. నిషేధించిన ఫలమును తినవద్దు అని ప్రభువు ఆదాము వద్ద చెప్పినప్పుడు, దానితో పాటు దీనిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు అనియు చెప్పెను. ఇట్టి మరణము ఆత్మ యొక్క మరణము. అది మనిషిని దేవుని విడిచి వేరు చెయుచున్నది. ఆదాము యొక్క తొమ్మిది వందల ముప్పైయోవ సంవత్సరమునందు అతనికి కలిగినది లోక ప్రకారమైన మరణము. అదే సమయమునందు రెండవ మరణము అని పిలవబడుచున్న అగ్ని గంధకములతో మండు గుండము కలదు.

పాపము అను పదమునకు గ్రీకు భాషలో “కమార్టియా” అని పిలువబడుచున్నది. దాని యొక్క అర్థము గురిని విడిచి తొలగుటయైయున్నది. దేవుని ప్రణాళికను, ఉద్దేశమును విడచి వైతొలగి వెళ్ళుటయే. ప్రభువు నియమించిన క్రమశిక్షణను నిర్లక్ష్యముచేసి వెళ్ళుటయే. ఎలాగైతే ఒక బాణము అన్నది వేయబడుచున్నప్పుడు గురిని విడచి, గురి తప్పి ప్రక్కకు ఎలా వెళ్ళుచున్నదో, అదే విధముగా దేవుడు ఒక మనుష్యునికి ఏర్పరిచిన నీతి మార్గము నుండి దారి తప్పి వెళ్ళుచున్నప్పుడు అదే పాపమగుచున్నది.

ఒక మనుష్యుడు తాను పాపము చేసేను అను సంగతిని ఎప్పుడు గ్రహించుచున్నాడు? అవును, మనస్సాక్షియందు నేరారోపణ చేయబడుచున్నప్పుడు, అతడు పాపము చేయుచున్న సంగతి అతనికి స్పష్టముగా అర్థమవుచున్నది. ప్రతి ఒక్క మనుష్యునియందును, ప్రభువు దైవీక స్వరముగా మనస్సాక్షిని ఉంచియున్నాడు. మనకు మనస్సాక్షితో పాటు లేఖన గ్రంథమునందు గల ఆజ్ఞలను కూడా అనుగ్రహించియున్నాడు. మనస్సాక్షికిని, లేఖన వచనములకును విరోధముగా చేయుచున్న ఎట్టి అంశమును పాపమగుచున్నది.

మనుష్యుని పాపము చేయుటకు పురిగొలుపుచున్న మూడు భయంకరమైన శక్తులు కలవు. మొదటిది లోకము, రెండోది శరీరము, మూడోది సాతాను. ఒకానొక కాలమునందు దేవుని దూతగా ఉన్న సాతాను అనువాడు, ప్రభువునకు విరోధముగా అతిశయించి గర్వముతో నడిచినప్పుడు, పరలోకము నుండి భూమి మీదకు త్రోయబడెను. ఆ దినము మొదలుకొని అతడు ప్రభువునకు నిరోధముగా పనిచేయుచు వచ్చుచున్నాడు. అతడే జనులను పాపము చేయునట్లుగా పురిగొలుపుచున్నాడు. “అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు, గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి” (1. యోహాను. 3:8).

అయితే, ‘పాపము చేయలేక జీవించలేము; లంచము తీసుకొనక, ఇవ్వకుండా ఒక పనిని సాధించలేము; మన యొక్క పనులను సాధించుకొనుటకు పాపమును చేసే తీరవలసినదైయున్నది. దీనిని తప్పించలేము’ అని కొందరు పొరపాటుగా వాదించుచున్నారు. ఎలా సమాధానము చెప్పినను పాపము పాపమే. అది దేవుని యొక్క ఉగ్రతను తీసుకొని వచ్చుచున్నది. దేవుని బిడ్డలారా, దేవుడు పాపములన్నిటిని న్యాయ తీర్పులోనికి తీసుకుని వచ్చి నిలబెట్టును అను సంగతిని మరచిపోకుడి.

నేటి ధ్యానమునకై: “మీ దోషములే మీకును మీ దేవునికిని మధ్యన అడ్డముగా వచ్చెను” (యెషయా. 59:2).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.