Appam, Appam - Telugu

జూన్ 14 – ఒక్క తలాంతు!

“ఒకనికి అయిదు తలాంతులను ఒకనికి రెండు తలాంతులను, ఒకనికి ఒక్క తలాంతును ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి, వెంటనే దేశాంతరము పోయెను” (మత్తయి. 25:15).

ప్రభువు మనలను సృష్టించి కలుగజేసినవాడు మాత్రము కాదు, మనకు తలాంతులను, సామర్థ్యములను, ప్రత్యేకమైన కృపలను దయచేసి ఆశీర్వదించుచున్నవాడై ఉన్నాడు. ఈ తలాంతుల యొక్క రకమును, సంఖ్యయు ప్రతి ఒక్కరిలోను వ్యత్యాసమును చూపించుచున్నది.

దేవుని యొక్క బిడ్డలకు తలాంతులు ఉన్నట్లుగానే లోకస్తులకు కూడాను పలు రకములైన తలాంతులు ఉన్నాయి. లోకస్తులు తమ యొక్క తలాంతులచేత అభివృద్ధి చెంది, పేరు ప్రఖ్యాతులను పొందుకొనుచున్నారు. ధనమును పెంపొందించు కొనుచున్నారు. వారిలో కొందరు తమ యొక్క తలాంతులను సాతానునకు అమ్మి వేసి అతనికి ఊడిగము చేయుచున్నారు. అయితే దేవుని యొక్క బిడ్డలమైయున్న మనము, మన యొక్క తలాంతులను సామర్థ్యములను అన్నిటిని ప్రభువు యొక్క నామ మహిమార్ధమై ఉపయోగించవలెను.

మనము రక్షింపబడుచున్నప్పుడు, ప్రభువు మనకు దయచేయుచున్న మొదటి తలాంతు ప్రార్ధనయైయున్నది. ప్రార్ధన ఒక అమూల్యమైన తలాంతైయున్నది. ప్రార్థనయందు దేవునిని ‘అబ్బా తండ్రి’ అని సంతోషముతో పిలచుచున్నాము. ఆయన వద్ద మనస్సును విడచి మాట్లాడుచున్నాము. ప్రారంభమునందు దేవునికి మనకును మధ్యన ప్రార్ధన ఒక సంబంధమును ఏర్పరచుచున్నది. ఆ తరువాత అది ఇతరుల కొరకు గోజాడుటకును, దేశము కొరకు బద్దలైన సందులో నిలబడుటకును, తల్లాచున్న ఆత్మలకై విజ్ఞాపన చేయుటకును మిగుల సహాయకరముగా ఉన్నది.

ఆ ఒక్క తలాంతును పొందుకొనుటతో పాటు మనము ఆగిపోకూడదు. ఆ ఒక్క తలాంతును ఉపయోగించి మరొక్క తలాంతును సంపాదించవలెను. ప్రార్ధన అను తలాంతు నుండి గోజాడుట అను తలాంతునకు రావలెను. ఆ తరువాత, విజ్ఞాపన చేయు ఆత్మ అను తలాంతునకు రావలెను. ఇలాగున మనము మన యొక్క తలాంతులను ఉపయోగించుచున్నప్పుడు, ప్రభువు మరి అత్యధికమైన ఆత్మీయ తలాంతులను మనకు అనుగ్రహించును.

బైబులు గ్రంథమునందు ఒక తలాంతును తీసుకున్నవాడు దాని ద్వారా మిగతా తలాంతులను సంపాధించలేదు. తన యొక్క సామర్ధ్యమును వృద్ధి చేసుకొనను లేదు. తీసుకున్న తలాంతును తీసుకొని వెళ్లి, భూమిని త్రవ్వి పాతిపెట్టెను. ఇందువలన యజమానునికి ఏర్పడినది నష్టమే. యజమానుడు ఎదురుచూచిన విషయములో అతడు తప్పిపోయేను. తలాంతును పొందుకొని ఉండినప్పటికీని ఉద్దేశమును నెరవేర్చక ఉండిపోయెను.

ఇట్టి కొద్దిపాటి కాలపు జీవితమునందు తలాంతును ఉపయోగించి ప్రభువునకై అరుదైన గొప్ప కార్యములను చెయ్యక ఆ మనుష్యుడు తప్పిపోయెను. అంత మాత్రమే కాదు, అతడు యజమానుని పైనే నేరమును మోపుటకు ప్రారంభించెను. ‘నీవు విత్తనిచోట కోయువాడవును, చల్లని చోట పంట కూర్చుకొను వాడవునైన కఠినుడవని నేనెరుగుదును’ అని చెప్పెను. ఎంతటి దురుసైన సమాధానము అది! ప్రేమగల ప్రభువును ఎంతగా ఇట్టి సమాధానము దుఃఖపరిచి ఉండవచ్చును!

దేవుని బిడ్డలారా, నేడును ప్రభువు మీకు కూడాను పలు రకములైన తలాంతులను ఇచ్చి ఉండవచ్చును. మీరు మీ యొక్క తలాంతులను ప్రభువు యొక్క నామ మహిమార్థమునకును, దేవుని యొక్క పని కొరకును ఉపయోగించు చున్నప్పుడు ఆయన అత్యధికముగా మిమ్ములను ఆశీర్వదించును.

నేటి ధ్యానమునకై: “క్రీస్తునకు (దాసు) సేవకుడైనవాడు దేవునికి ఇష్టుడును, మనుష్యుల దృష్టికి యోగ్యుడునైయున్నాడు” (రోమీ. 14:18).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.