Appam, Appam - Telugu

జూన్ 08 – సీయోను యొక్క ఆశీర్వాదములు!

“భూమ్యాకాశములను సృజించిన యెహోవా సీయోనులో నుండి నిన్ను ఆశీర్వదించును గాక” (కీర్తనలు. 134:3).

ఆశీర్వాదము అను పదము ఎంతటి మధురమైనది! అందరును తాము ఆశ్వీదింపబడవలెను అను తలంపును కలిగియున్నారు. తల్లిదండ్రులు యొక్క ఆశీర్వాదముల కొరకు పిల్లలు తపించుచున్నారు. ఉపాధ్యాయులు, పెద్దలు, ఉన్నత స్థితిలో ఉన్నవారు మొదలగు వారి యొక్క ఆశీర్వాదములను ఎదురుచూస్తున్నారు. అదే సమయములో, దేవుని సేవకుల యొక్క ఆశీర్వాదము కూడాను మనకు కావలెను.

కీర్తన గ్రంథమునందు పలు స్థలములలో సీయోను యొక్క ఆశీర్వాదమును గురించి చూడవచ్చును. పైన చెప్పబడియున్న వచనమును చదివి చూడుడి. అది యెహోవా వలన సీయోను నుండి వచ్చుచున్న ఆశీర్వాదము గూర్చి మాట్లాడుచున్నది. ‘భూమ్యాకాశములను సృజించిన యెహోవా సీయోనులో నుండి నిన్ను ఆశీర్వదించును గాక’ అని చెప్పి దావీదు ఆశీర్వదించుచున్నాడు.

కీర్తన గ్రంథమునందు, “సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు” (కీర్తనలు. 128:5) అని వ్రాయబడియున్నది. సీయోను నుండి వచ్చుచున్న ఉన్నతమైన ఆశీర్వాదములును కలదు. అదే సమయములో ఇహ సంబంధమైన లోక ఆశీర్వాదములు కూడాను మనకు కలదు.

లోక ప్రకారమైన ఆశీర్వాదములను గూర్చి ద్వితీయోపదేశకాండము 28 ‘వ అధ్యాయము 1-14 వచనములలో చదువ వచ్చును. నీ గర్భఫలమును, నీ భూఫలమును, నీ పశువుల మందలును, నీ దుక్కి టెద్దులును, నీ గొఱ్ఱె మేకల మందలును దీవించబడియుండును. నీ గంపయును, పిండి పిసుకు నీ తొట్టియును దీవించబడియుండును అని వరుసగా అట్టి ఆశీర్వాదములను చూడవచ్చును.

అదే సమయములో సీయోనునకు సంబంధించిన ఆత్మీయ ఆశీర్వాదములును మనకు కలదు. “ఆయన క్రీస్తునందు పరలోకవిషయములలో ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనక అనుగ్రహించెను” (ఎఫెసీ. 1:3) అని బైబిలు గ్రంధము చెప్పుచున్నది. అవును, క్రీస్తునందుగల పరలోకపు ఆత్మీయ ఆశీర్వాదములు మనకు కలదు.

అవి ఏమిటి? మొదటిది సీయోను నుండి మనకు లభించుచున్న రక్షణ యొక్క సంతోషము. ప్రభువు మన యొక్క పాపములను క్షమించెను, శాపములను విరిచెను. దేవుని బిడ్డల యొక్క సహవాసమును ఇచ్చెను అని గ్రహించుతున్నప్పుడు అది మనకు గొప్ప ఆశీర్వాదముగా ఉన్నది. పాతాళము యొక్క శక్తుల బారి నుండి విడిపించబడి పరలోకపు మార్గమునందు వెళుతున్నాము అనుచున్న గ్రహింపు ఎంత గొప్ప ఆశీర్వాదము!

రెండోవదిగా, సీయోను యొక్క ఆశీర్వాదములలో పరిశుద్ధ ఆత్మ యొక్క అభిషేకము మిగుల ప్రాముఖ్యమైనది. తండ్రి యొక్క సింహాసనము నుండి జీవజలముల ఆత్మీయ పరిశుద్ధ ఆత్మడు దిగి వచ్చి మన ప్రాణమును నింపుట ఎంతటి సంతోషకరమైన అంశము! పరలోకపు బలము మనలోనికి వచ్చుచున్నది. జీవాత్మ మనలోనికి కుమ్మరించబడుచున్నది. ఆత్మీయ ఫలములు మనలో కనబడుట ఆత్యున్నతమైన ఆశీర్వాదము కదా?

దేవుని బిడ్డలారా, అంత్య దినములలో, “సర్వజనులమీద నా ఆత్మను కుమ్మరింతును” (యోవేలు. 2:28) అని ప్రభువు వాగ్దానమును చేసియున్నాడు, పొందుకొందురా?

నేటి ధ్యానమునకై: “ప్రియుడా, నీ (ఆత్మ) ప్రాణము వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను” (3. యోహాను. 1:2).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.