Appam, Appam - Telugu

ఆగస్టు 23 – కీడునుండి రక్షింపుము!

“మమ్మును శోధనలోకి తేక (దుష్టుని) కీడు నుండి మమ్మును తప్పించుము” (మత్తయి. 6:13).

‘దుష్టుని నుండి తప్పించుము’ అని తెలుగులో అర్థమును ఇచ్చు ఈ వచనము ఆంగ్లమునందు ‘ దుష్టుని బారి నుండి నన్ను రక్షించుకొనుము’ అర్థమును ఇచ్చునట్లుగా భాషాంతరము చేయబడియున్నది. దుష్టుడైన సాతాను యొక్క చేతులలో పడకుండునట్లు నన్ను కాపాడుము అని ప్రార్థించు వారిగా మనము ఉన్నాము.

సాతాను యొక్క నామములలో ఒకటి శోధకుడు అనుటయైయున్నది. అతని యొక్క ఉద్దేశమే దేవుని ప్రజలను శోధనలో పడద్రోసి పాపపు భారమును మోపి, ఆత్మీయ జీవితమును నష్టపరుచుటయైయున్నది. కొన్ని శోధనలు కుటుంబ సమాధానమును నశింపజేయుచున్నది. కొన్ని శోధనలు ఆత్మహత్యకు త్రోవ నడిపించును. కొన్ని శోధనలు ఆత్మీయ జీవితమును నష్టపరిచి, కలంక పరచుచున్నది. అందుచేతనే దేవుణ్ణి తేరి చూచి, “తండ్రి, నన్ను శోధనలోనికి ప్రవేశింపనియ్యక కీడు నుండి రక్షించుకొనుము” అని ప్రార్థించుట అవశ్యమునైయున్నది.

శోధన వచ్చుచున్నప్పుడు అనేకులు కలత చెందుదురు. కొందరు పాపపు శోధనలను దేవుడే తీసుకుని వచ్చుచున్నాడని పొరపాటుగా బావించుచున్నారు. బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవునిచేత శోధింప బడుచున్నానని అనకూడదు; దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు; ఆయన ఎవనిని శోధింపడు” (యాకోబు. 1:13).

దేవుడు ఎవరిని శోధింపడు అని బైబిలు గ్రంథము చెప్పుచున్న అదే సమయములో ప్రభువు అబ్రహామును శోధించెను (ఆది.కా. 22:1) అని బైబిలు గ్రంధము చెప్పుచునందున ఒకదానికొకటి బిన్నముగా ఉన్నదే అని కొందరు అడుగవచ్చును. తెలుగు భాషలో పలు అర్థములు ధ్వనించు రీతిలో పరీక్షించుట, శోధించుట వంటి పదములు ఉపయోగించుటయే దానికి గల కారణమునైయున్నది. ఆంగ్లమునందు (1) Test (2) Trial (3) Temptation అని వెవ్వేరు పదములు వెవ్వేరు అర్థములను ఇచ్చు విధముగా అమర్చబడియున్నది.

పై తరగతికి ఒక విద్యార్థి వెళ్ళుటకు అర్హత గలవాడేనా అని తెలుసుకొనుట కొరకే పాఠశాలలయందు పరీక్షను (Test) పెట్టుదురు. అయితే ప్రభువు మిమ్ములను శోధించుట అంతయును, ఎట్టి దృక్పదముతో మిమ్ములను హెచ్చించుట, ఔనత్యపరచుట, అత్యధికమైన బాధ్యతలను ఇచ్చుట మొదలగు వాటికి సంబంధించినదై యుండును.

అయితే పరీక్షను శోధనను ఒక మనుష్యుని క్రిందకు త్రోసివేసి, పేరును చెరిపివేసి, అతనిని పతనము చేయుటకే సాతాను తీసుకొని వచ్చుచున్నాడు. అతడు శోధకుడుగా మాత్రము గాక, దొంగగాను, నర హంతకుడిగాను ఉన్నాడు. అతడు దొంగలించుటకును, హత్య చేయుటకును, నశింప చేయుటకును వచ్చుచున్నాడే గాని మరిదేనికిని రాడు.

దేవుని బిడ్డలారా, ఆయన నిన్ను బాధించి, నిన్ను సాతాను చేత హింసించి, మనుష్యుడు రొట్టె వలన మాత్రము గాక, ప్రభువు యొక్క నోటి నుండి బయలు దేరివచ్చున్న ప్రతి మాట వలనను బ్రతుకును అను సంగతిని నీకు గ్రహింప చేయుచున్నాడు (ద్వితీ. 8:3).

నేటి ధ్యానమునకై: “మీరు సహింప గలిగినంత కంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింప

Leave A Comment

Your Comment
All comments are held for moderation.