Appam, Appam - Telugu

ఆగస్టు 20 – బలమును ధరించుకొనుము!

“సీయోనూ, లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము; పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకొనుము” (యెషయా. 52:1).

ఒక తండ్రి నిద్రించుచున్న తన బిడ్డలను మేల్కొలుపుచున్నాడు. పాఠశాలకు వెళ్ళవలసిన వేలయైనందున త్వరగా కాల కృత్యములను ముగించుకుని బయలుదేacccరునట్లుగా చేయుచున్నాడు. అయితే, పరలోకపు దేవుడు: “సీయోనా, లెమ్ము లెమ్ము” అని మనలను లేపుట సాధారణమైన అంశములకు కాక, బలమును ధరించుకొనుటకైయున్నది.

ఒక పోలీసు అధికారి, ఆయన యొక్క పోలీసు దుస్తులను ధరించెను అంటే, ఆయన తన విధిని చేయుటకు బయలుదేరెను అని అర్థమునైయున్నది. అయిన పోలీసు దుస్తులయందు ఆయనకు గల ప్రభుత్వపు అధికారము స్పష్టముగా తెలియును. ఆయన పోలీసు వాహనమునందు బయలుదేరి వచ్చుచున్నాడు అంటే, దొంగలును, నేరము చేసిన వారును వణుకుదురు. దేవుని యొక్క పిల్లలు, తమకు ఇవ్వబడియున్న దేవుని భలమును ధరించుకొని ప్రభువు కొరకు బయలుదేరుచున్నప్పుడు, పాతాళపు లోకమును, దెయ్యపు కుటుంబమును బహుగా వణికిపోవును.

మీలో ఉన్న బలమును చూచి సాతాను వణుకును. ప్రభువు యొక్క అగ్ని మీలో రగులుకొని మండుచు ఉన్నట్లయితే, అట్టి అగ్ని అభిషేకమునకు ఎదుట అతడు నిలబడలేదు. అట్టి కార్యసాధకముతో బలమును ధరించుకొనుటకు లేవండి.

ప్రవక్తయొన యెషయా గ్రంథమునందు “లెమ్ము, లెమ్ము” అను పదము మూడుసార్లు చోటుచేసుకుని ఉంది. అట్టి పదము దేవుని యొక్క పిల్లలను మండించి లేపుచున్నట్లు చేయుచున్నది. ‘లెమ్ము, లెమ్ము బలము పొందుకొనుము’ (యెషయా. 51:9) అని బైబిలు గ్రంధమునందు చదువుచున్నాము. “యెహోవా బాహువా, లెమ్ము లెమ్ము బలము తొడుగు కొమ్ము పూర్వపు కాలములలోను, పురాతన తరములలోను లేచినట్లు లెమ్ము రాహాబును తుత్తునియలుగా నరికివేసినవాడవు నీవే గదా? మకరమును పొడిచినవాడవు నీవే గదా?” (యెషయా. 51:9).

ఐగుప్తును, ఐగుప్తునందుగల ఫరోను ప్రభువు పది తెగుళ్లచేత మోత్తెను. ప్రభువుతో కలసి నిలబడుటకు ఆయన మోషేను లేవనెత్త వలసినదైయుండెను. మోషే యొక్క చేతికి కర్రను ఇచ్చి, ఇట్టి బలమును వహించునట్లుగా గ్రహింపజేసెను. అట్టి కర్రను చేత పట్టుకొని ఇశ్రాయేలు జనులను విడుదలజేసి మోషే విజయముతో ఐగుప్తును విడిచి బయలుదేరెను. మీరు ప్రభువు కొరకు అరుదైన గొప్ప కార్యములను చేయునట్లు ఆయన శక్తిని ధరించుకొనుడి.

మీరు లేచి ప్రకాశించునట్లు పిలవబడియున్నారు. మీ పై ప్రభువు యొక్క వెలుగు వచ్చియున్నది. మీ యొక్క జీవితము కుంచెము క్రింద దాచబడిన ఒక జీవితము కాదు. అది కొండమీద ఉంచబడిన ఒక పట్టణము యొక్క జీవితము. మీరు లోకమునకు వెలుగైయున్నారు. మిమ్ములను ప్రకాశింపజేసేటువంటి బలమును ధరించుకొని తీరవలెను.

దేవుని బిడ్డలారా, బలమును ధరించుకొనుట మీయొక్క చేతిలోనే ఉన్నది. ప్రార్థించుటయందును, స్తోత్రించుటయందును, ఉపవాసమునందును, దేవుని బిడ్డల యొక్క సహవాసముయందును బలము కలదు. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము వలన అమితమైన బలము కలదు. అటువంటి గొప్ప ఔన్నత్యమైన బలమును ధరించుకొనుటకు ముందుకు రండి.

నేటి ధ్యానమునకై: “నా బలమును నీకు చూపునట్లును, భూలోక మందంతట నా నామమును ప్రచురము చేయునట్లును ఇందుకే నేను నిన్ను నియమించితిని” (నిర్గమ. 9:16).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.