ఆగస్టు 19 – ఒంటరియైయుండగా!
“మీ తండ్రియైన అబ్రాహాము, ….. ఒంటరియైయుండగా నేను అతని పిలిచితిని, అతనిని ఆశీర్వదించి, అతనిని పెక్కుమంది యగునట్లు చేసితిని” (యెషయా. 51:2).
ప్రభువు అబ్రహామును ఆశీర్వదించుచున్నప్పుడు, అబ్రహాము ఒంటరియైయుండెను. అతని యొక్క దేశమునుండియు, తండ్రి ఇంటినుండియు, స్వజ్జనుల వద్ద నుండియు ప్రత్యేకపరిచి ఆయనను ప్రభువు పిలిచి వెంటపెట్టుకొని వచ్చెను. అబ్రహాముతో నిబంధనను చేసి, అబ్రహామును ఫలించి అభివృద్ధి చేసెను.
మీరు ఒక్కరిగా ఒంటరిగా కనబడుచున్నారా? నాతో కలిసి ప్రార్ధించుటకు ఒక్కరును లేరే, నా గ్రామమునందు నేను మాత్రమే రక్షింపబడి ఉండగా నాతో కలసి ఆరాధించుటకు కుటుంబమునందు ఒక్కరును లేరే అని అంగలార్చుచున్నారా? ఇటువంటి ఒంటరి పరుస్థుతులలో నిశ్చయముగా మీ ప్రభువు యొక్క శక్తిని బాగుగా గ్రహించుదురు.
అబ్రహాము ప్రభువు యొక్క వాక్కు చొప్పున కనాను తట్టునకు బయలుదేరినప్పుడు, ఆయనకు సహాయము కొరకు ఒక్కరును లేరు. అయితే ప్రభువు తోడుగా నిలబడి ఆయనను కాపాడెను, పరామర్శించెను, బహు చక్కగా త్రోవ నడిపించెను. నాకంటూ ఎవరు లేరే, నా కొరకు మాట్లాడుటకు ఎవరు లేరే అని చింతించుచున్నారా? మీరు ఒంటరియైయున్నప్పుడే ప్రభువు మిమ్ములను ఆశీర్వదించ గలడు. వేవేల కొలది సహాయపు హస్తములను ఆయన మీకు లేవనెత్తును.
అబ్రహాము ఒంటరిగా నిలబడినను, ఆయన ఎల్లప్పుడును దేవుని ఎదుట నిలబడేటువంటి అలవాటును కలిగియుండెను (ఆది.కా. 18:22). ఇదియే ఆశీర్వాదము యొక్క తాళపు చెవియైయున్నది. ఆకాశమును భూమిని కలుగజేసిన సర్వశక్తిమంతుని ఎదుట మీరు నిలబడుచున్నప్పుడు, ఆయన సకల ద్వారములను మీకు తెరచి ఇచ్చును. అరణ్యమునందు త్రోవను కలుగజేసినవాడు, మీకు కూడాను త్రోవను తెరచును. మీకు తోడుగా నిలబడి సమస్తమును చేసి ముగించును.
ఏలియా కర్మేలు పర్వతము పైకి ఎక్కుచున్నప్పుడు ఒంటరివాడై ఎక్కెను. ఇశ్రాయేలు ప్రజలు అందరును బయలు యొక్క విగ్రహ ఆరాధనయందు నానిపోయి ఉండెను. ఏలియాకు ఎదురుగా నాలుగు వందల యాభై బయలు ప్రవక్తలు నిలబడిరి. రాజైన ఆహాబును, రాణియైన యెజబెలును ఏలియాను ఎదిరించిరి.
ఏలియా ఒంటరియైయుండగా, ప్రభువు ఏలియా యొక్క ప్రార్ధన విని ఆకాశము నుండి అగ్నిని పంపించెను. ఏకధాటిగా ఒకే సమయమునందు జనులందరి యొక్క మోకాళ్ళను మడచి, అందరి నాలుకలను ప్రభువే దేవుడని ఒప్పుకోలు చేసెను. నేను ప్రభువు ఎదుట నిలబడువాడను (1. రాజులు. 17:1) అనుటకే ఏలియా యొక్క సాక్ష్యము.
ఏలియా యొక్క శిష్యుడిగా దరిదాపులు పద్నాలుగు సంవత్సరములు ఏలియాను వెంబడించిన ఎలీషా ప్రభువు ఎదుట నిలబడుటకు నేర్చుకొనెను. గొప్ప రాజు ఎదుట నిలబడి, “ఎలీషా ఇట్లనెను: ఎవని సన్నిధిని నేను నిలువబడియున్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు” అని చెప్పెను (2. రాజులు. 3:14).
దేవుని బిడ్డలారా, మీరు ప్రభువు ఎదుట నిలబడినట్లయితే, అల్పులైన మనుష్యుల ఎదుట భయపడి చేతులను కట్టుకొని నిలబడవలసిన అవసరము ఉండదు. కావలి నిలయములకును, న్యాయస్థానములకును ఆలయుచు తిరగవలసిన అవసరము లేదు. మీ యొక్క నమ్మికను ప్రభువుపై ఉంచి ఆయన ఎదుట నిలబడుడి.
నేటి ధ్యానమునకై: “నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును; నీతో మాటలాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని” (లూకా. 1:19).