ఆగస్టు 07 – జ్ఞానముగలవాడు!
“యెహోవా అనంతజ్ఞానియగు దేవుడు; ఆయన క్రియలు యదార్ధమైనవి కదా?” (1. సమూ. 2:3)
హన్నా యొక్క సంతోషమును గూర్చి 1. సమూ. 2 ‘వ అధ్యాయమునందు చదువుచున్నాము. మొట్టమొదట ప్రభువు యొక్క పరిశుద్ధమైన సౌందర్యమును కీర్తించిన హన్నా, రెండోవదిగా, ప్రభువు యొక్క జ్ఞానమును కీర్తించి పొగెడెను. ప్రభువు యొక్క పరిశుద్ధతను ప్రశంసించినప్పుడు మీలోనికి పరిశుద్ధత వచ్చును. ప్రభువు యొక్క జ్ఞానమును ప్రశంసించినప్పుడు మీరు జ్ఞానమునందు శ్రేష్టులైయుందురు.
దైవ జ్ఞానము అనుట ఏమిటి? బలిస్టుల యొక్క విల్లును విరుచుటకు ఆయన జ్ఞానముగలవాడు. తృణీకరించబడిన వారిని బలముచేత అంటుకట్టుటకు ఆయన జ్ఞానముగలవాడు. గొడ్రాలుగా ఉన్న దానిని ఏడుగురు పిల్లలను కనునట్లుగా కృపను కనబరచువాడు. ఈ లోకమునందు విశ్వవ్యాప్తమైన జ్ఞానము కలదు. మనుష్యులకు సంబంధించిన సహజమైన జ్ఞానము కలదు. సాతానునకు కుయుక్తితో కూడిన దుష్ట జ్ఞానము కలదు. ప్రభువు యొక్క జ్ఞానమైతే కొలవలేనిది. జ్ఞానమునందు కొదువగల వారికి ఆయన జ్ఞానమును దయచేయుచున్నాడు. (యాకోబు.1:5). “యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట జ్ఞానమునకు ప్రారంభము” (సామెతలు.1:7).
గోలియాతును జయించుటకు సౌలునకు యుద్ధ జ్ఞానము లేకుండెను. దావీదు ముందుకు వచ్చినప్పుడు, దావీదును కూడా అధర్యపరచెను. దేవుని యొక్క తలంపునే మీయొక్క ఆలోచనగా మార్చుకొనుచున్నప్పుడే, దైవజ్ఞానము కలుగును. అట్టి దైవ జ్ఞానముచేతను, భక్తి వైరాగ్యముచేతను దావీదు సులువుగా గోలియాతును పడగొట్టెను.
ప్రభువు యొక్క జ్ఞానము అన్ని జ్ఞానములకంటేను అత్యున్నతమైన పరలోకపు జ్ఞానమునైయున్నది. జ్ఞానమును ప్రభువు వద్ద అడుగుడి. జ్ఞానమును దయచేయు ఆత్మ చేత నింపబడుడి. జ్ఞానమును తెలియజేయు వాక్యము అను ఉన్నతమైన ఆత్మ వరమును పొందుకొనుడి.
ఐగుప్తు దేశమునకు ఒక జ్ఞానవంతుడు కావలసిన వాడాయెను. అక్కడ రాబోవుచున్న కరువు గల ఏడు సంవత్సరములను ఎదుర్కొనుటకు తగిన ఒక జ్ఞానము గల మనుష్యుడు కావలసిన వాడాయెను. ఫరో యోసేపునే అట్టి జ్ఞానముగల మనుష్యునిగా ఏర్పరచుకొనెను. “దేవుడు ఇదంతయు నీకు తెలియపరచెను గనుక, నీవలె వివేక జ్ఞానములు గలవారెవరును లేరు” (ఆది.కా. 41:39) అని ఫరో చెప్పెను. ఇందువలన యోసేపు ఫరోకు ప్రధానమంత్రి ఆయెను.
మీరు ప్రభువును తేరి చూడుడి. బుద్ధిహీనులను జ్ఞానులుగా చేయువాడు. చిన్ని చిన్ని పనులు చేయుటకు కూడాను మీకు జ్ఞానము అవసరము. అనుదిన జీవితమునందు ఇతరులతో మాట్లాడుటకును, మసులుకొనుటకును మీకు జ్ఞానము అవసరము. ప్రభువు తన యొక్క జ్ఞానమును మీ యొక్క పెదవులకు అనుగ్రహించును. అప్పుడు మాట్లాడుచున్నవారు మీరైయుండక తండ్రి యొక్క ఆత్ముడే మీలో ఉండి, మాట్లాడుచున్నాడు అను సంగతిని తెలుసుకొందురు (మత్తయి. 10:20). దేవుని బిడ్డలారా, ఇదియే మీకు జ్ఞానమును వివేకమునైయుండును.
బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు ఈ కట్టడలన్నిటిని గూర్చి విని, ఈ గొప్ప జనమే జ్ఞానవివేచనలు గల జనమని చెప్పుకొందురు” (ద్వితీ. 4:6).
నేటి ధ్యానమునకై: “పైనుండివచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనదియు, తరువాత సమాధాన కరమైనదియు, మృదువైనదియు, సులభముగా లోబడునదియు, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినదియు, పక్షపాతమైనను లేనిదియు, వేషధారణయైనను లేనిదియునైయున్నది” (యాకోబు. 3:17).