Appam, Appam - Telugu

ఆగస్టు 06 – “సంతోషించుచున్నది!”

“నా హృదయము యెహోవాయందు సంతోషించుచున్నది. యెహోవాయందు (నాకు మహా బలముకలిగెను) నా కొమ్ము హెచ్చింపబడియున్నది (1. సమూ. 2:1).

ఇక్కడ హన్నా యొక్క సంతోషమును చూచుచున్నాము. తన విన్నపమునకు ప్రభువు చెవియోగ్గి ఆశీర్వాదకరమైన సమూయేలును దయచేసినప్పుడు, హన్నా కృతజ్ఞతతో, “ఈ బిడ్డను దయచేయుమని, యెహోవాతో నేను చేసిన మనవిని, ఆయన నాకనుగ్రహించెను” (1. సమూ. 1:27)

దేవుని యొద్ద నుండి ఆశీర్వాదములను పొందుకొనిన హన్నా ఆమె హృదయపు ఆనందమును అనుచుకొనలేక పోయెను. 1. సమూ. 2 ‘వ అధ్యాయము యొక్క మొదటి వచనమునందు, ‘మరియు హన్నా విజ్ఞాపనచేసి’ అని ప్రారంభించుచున్నది. 10. ‘వ వచనమునందు, ‘అని స్తుతించెను’ అని ముగించబడుచున్నది. కావున ఈ లేఖన భాగమునందు హన్నా యొక్క ప్రార్ధనను, విన్నపమును, ప్రభువును స్తుతించు స్తుతిని చూచుచున్నాము. దానితోపాటు హన్నా యొక్క సంతోషమును చూచుచున్నాము.

మీరు మీ యొక్క హృదయమును ప్రభువు యొక్క పాదములయందు కుమ్మరించి నిజముగా విన్నపమును చేసినట్లయితే, ఇకమీదట మీరు దుఃఖముఖముతో ఉండరు. ప్రభువు నిశ్చయముగానే మీ కన్నీటిని తుడుచును. సంతోషించేటువంటి దినములను మీకు అనుగ్రహించును. మొదటిగా, హన్నా యొక్క హృదయమునందు సంతోషమును కలుగజేసిన ప్రభువు యొక్క పరిశుద్ధతయే. ప్రభువువలె పరిశుద్ధతగల దేవుడు, నీవంటి దేవుడు ఎవరును లేరు. నీవంటి వారు ఒక్కరును లేదు (1. సమూ. 2:2).

లోకమునందు ఎంతోమంది తత్వ జ్ఞానులును, మత వ్యవస్థాపకులును, మునీశ్వరులును, ఋషులును తమ్మును తాము దేవుడు అని పిలుచుకునేటువంటి అవతారములును కలరు. అయితే వారి యొక్క పరిశుద్ధతను ప్రభువు యొక్క మహా గొప్ప మహిమగల పరిశుద్ధతతో ఇహమందు పోల్చలేము. ఆయన పరిశుద్ధుడైయుండుట మాత్రము కాదు, తన యొక్క పిల్లలకు పరిశుద్ధతను దయచేయుచున్నాను. ఆయన మాత్రము పరిశుద్ధుడైయుండి, మీకు అట్టి పరిశుద్ధతను ఇవ్వకపోయినట్లయితే, ఆయన యొక్క పరిశుద్ధమైన సౌందర్యమునందు మీకు ఎట్టి ఫలితము కలదు? “నేను పరిశుద్ధుడనై యుండునట్లు, మీరును పరిశుద్ధలైయుండుడి” అని చెప్పుచున్న ప్రభువు తన యొక్క పరిశుద్ధతను మీకు అనుగ్రహించుచున్నాడు.

ప్రభువు యొక్క మధురమైన స్వభావమే తన పిల్లలకు మనసారా దయచేయుటయే. దయచేయుటకు ఆయన వద్ద శక్తియు, కృపయు, దయయు ఉన్నది. పరిశుద్ధతను ఇచ్చుటచేత ఆయన యొక్క నామము, “యెహోవా మెకాదీసు” అనుటయైయున్నది.

హన్నా ప్రభువు యొక్క పరిశుద్ధమైన సౌందర్యమును చూచెను‌. మొదట, సంతోషించిన ఆమె, రెండోవదిగా ఆరాధించుటకు ప్రారంభించెను. దేవా, నీవంటి దేవుడు ఎవరును లేరు. దేవుని వంటి ఆశ్రయదుర్గమైనవాడు ఒక్కరును లేరు (1. సమూ. 2:2) అని స్తుతించెను. ఆరాధన యొక్క ఉచ్చఘటమునకు వెళ్లెను.

మీరు ప్రభువు యొక్క పరిశుద్ధమైన సౌందర్యమును చూచుచున్నప్పుడు, ప్రభువును స్తుతించుడి అని మిమ్ములను ఎవరును బలవంతము చేయనవసరమును లేదు, బలవంతము పెట్టనవసరమును లేదు. మీ హృదయము తనకు తానుగానే ప్రభువును స్తుతించునట్లు పొంగును, ప్రేరేపించి రేపును. దేవుని బిడ్డలారా, ప్రభువును ఆరాధించి, స్తుతించి, పరిశుద్ధత యొక్క మెట్లలో పైపైకి ఎక్కి ఉన్నతమునకు వెల్లుడి.

నేటి ధ్యానమునకై: “నా ప్రాణము ప్రభువును (ఘన) మహిమపరచుచున్నది. నా ఆత్మ నా రక్షకుడైన దేవునియందు ఆనందించెను” (లూకా. 1:46,48).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.

// Day of week // Sunday=0, Monday=1, Tuesday=2, Wednesday=3, Thursday=4, Friday=5, Saturday=6