Appam, Appam - Telugu

ఆగస్టు 02 – జనమువలన వచ్చు శిక్ష!

“నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్లగొట్టితివి; నీ సన్నిధికి రాకుండ వెలివేయబడి దిగులుపడుచు భూమి మీద దేశదిమ్మరినైయుందును” (ఆది.కా. 4:14).

సహోదర ప్రేమ లేకుండా హేబేలుపై అసూయ చెంది అతనిని హత్య చేసిన కయీను, ఆత్మసంబంధముగా ఆత్మహత్య చేసుకున్న స్థితిలోనికి వచ్చెను. అతడు చేసిన పాపము అతనిని ఒంటరిగా అలయుచూ తిరుగునట్లుగా చేసెను.

అనేకులు సహోదర ఆప్యాయత లేక, బంధుత్వమును లక్ష్యము చేయక చిన్న అంశమునకు కూడాను ద్వేషమును కలుగజేసుకుని తమ చుట్టూతా తామే ఒంటరి కోటలను నిర్మించుకొనుచున్నారు. సహోదర ఐక్యతనందు గల ఆశీర్వాదమును వారు కోల్పోవుచున్నారు.

ఒక కుటుంబమునందు కోడళ్లుగా వివాహము చేసుకొని వచ్చిన ఒక స్త్రీ భర్త కుటుంబమునందు ఉన్న వారిని లక్ష్యపెట్టలేదు. ఎవరు వచ్చినా సరే, సహాయమును కోరి అప్పుపును అడుగుటకు వచ్చియున్నారని తలంచి ద్వేషించును. వచ్చిన అతిథుల వద్ద ఆమె వెంగ్యముగాను, చులకనగాను ప్రవర్తించుటచే బంధువులు ఎవరు వారి ఇంటికి రాకుండా మానివేసిరి. భర్తను తన యొక్క గుప్పిట్లో పెట్టుకుని బంధువులందరినీ దూరాన పెట్టేసింది. కొన్ని సంవత్సరాలకు తర్వాత ఆమె బలహీనత చెందినప్పుడు, ఆమెకు సహాయము చేయుటకు గాని, పలకరించి ఆదరించుటకుగాను ఎవరును లేకపోయెను. ఒంటరితనము యొక్క వేదన ఆమె యొక్క హృదయమును పిండి వేసెను.

దేవుని బిడ్డలారా, సహోదర ప్రేమను, మంచి స్నేహ బంధాలను, ఆప్యాయతను పెంచుకొనుడి. “ఇదిగో, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము! సీయోను కొండల మీదికి దిగివచ్చు హెర్మోను మంచువలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చియున్నాడు” (కీర్తనలు. 133:1,3) అని బైబిలు గ్రంథమునందు చదువుచున్నాము.

బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: ‘తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి, చీకటిలో నడుచుచున్నాడు; చీకటి అతని కన్నులకు గ్రుడ్డితనము కలుగజేసెను గనుక తానెక్కడికి పోవుచున్నాడో అతనికి తెలియదు” (1. యోహాను. 2:11). సహోదర ప్రేమ కొరకు శ్రమపడుడి. సహోదర ప్రేమలో నిలిచియుడవలెను. సహోదరులను వ్యర్థమైన మాటలతో గాని, కోపపు మాటలతో గాని గాయపరచకూడదు. సమాధానపడి వారి యొక్క గాయములను మాన్పుడి.

కయీను సహోదర బంధమును తెంచుకొనుటతో పాటు, దేవునికి అతనికి మధ్య ఉన్న సంబంధమును కూడా తెంచుకొని వంటరి తనములోనికి వెళ్ళిపోయెను. దేవుని సన్నిధిని విడిచిపెట్టి వైదొలగిపోయెను. “నేను నీ సన్నిధికి రాకుండ, వెలివేయబడి దిగులుపడుచు భూమిమీద దేశదిమ్మరినై యుందును” (ఆది.కా. 4:14) అని తనకు తానుగా శపించుకొనెను.

దేవుని బిడ్డలారా, మీకును మిగతా వారికిని మధ్యనున్న సంబంధములను సరిచేసుకోనుడి, బాగు చేసుకొనుడి, సమాధానపడుడి. దానికంటే ముఖ్యముగా, ప్రభువునకును మీకును మధ్యన ఉన్న సంబంధమును సరి చేసుకొనుడి.

నేటి ధ్యానమునకై: “మనము కయీను వంటివారమై యుండరాదు. వాడు దుష్టుని సంబంధియై తన సహోదరుని చంపెను; వాడతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవియునైయుండెను గనుకనే గదా?” (1. యోహాను. 3:12).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.

// Day of week // Sunday=0, Monday=1, Tuesday=2, Wednesday=3, Thursday=4, Friday=5, Saturday=6