అక్టోబరు 02 – ఇక సమయము లేదు!
“ఇక (ఆలస్య) సమయముండదు!” (ప్రకటన. 10:6).
మా తండ్రిగారు ఒకసారి భోజనశాల విడిదికి వెళ్ళుచు ఉన్నప్పుడు, అకస్మాత్తుగా ఆయన హృదయములో “నీ యొక్క ధనము కనబడకుండా పోవుచున్నది” అని ఎవరో హెచ్చరించినట్లు ఒక తలంపు కలిగెను. కావున ఆయన తన వద్ద ఉన్న ధనమును ఉపయోగకరముగా ఖర్చు పెట్టుటకు తీర్మానించెను.
ఆయన భోజనశాల విడిదికి వెళ్లి తిన్న వెంటనే, వయస్సు మళ్ళిన ఒక పేద వ్యక్తికి భోజనమును కొని ఇచ్చెను. ధనమును ఎంత త్వరగా ఖర్చుపెట్టగలడో అంత త్వరగా మంచి అంశముల కొరకు ఖర్చు పెట్టెను. చివర్లో ఇంకా కొన్ని వస్తువులను కొనుటకు వెళ్ళుచున్నప్పుడే ఆయన పెట్టుకొనియున్న మిగిలిన ధనమును ఆయన నడుచుచు వెళ్ళుచుండగా ఎవరో దొంగిలించిరి అను సంగతి ఆయనకు తెలిసింది.
మా తండ్రిగారు ధనమును కోల్పోయి దుఃఖముతో నిలబడినప్పుడు, ప్రభువు ఆయన యొక్క హృదయములో ఒక సత్యమును గ్రహింపజేసెను. “కుమారుడా, ఇటువంటిదే నీ యొక్క జీవితము. నీ జీవితములో ఎంత అత్యధిక సమయమును ప్రభువు కొరకు ఖర్చుపెట్టుచున్నావో అది నీకు తృప్తిని, మనస్సునందు మెండు తనమును ఇచ్చును. సాతాను నీయొక్క ఆరోగ్యమును, సౌఖ్యమును దొంగిలించుటకు ముందుగా, ప్రభువునకు ఇష్టమైన జీవితమును జీవించుము” అనుటయే ఆ సత్యము. అతిపెద్ద ఒక అంశమును ఎంత సులువైన పద్ధతిలో ప్రభువు గ్రహింపజేసెను.
అది మొదలుకొని మా తండ్రిగారు ప్రభువు కొరకు రాత్రనక, పగలనక శ్రమించుటకు తీర్మానించెను. తెల్లవారుజామున నాలుగు గంటలకే వీధులలో నడిచి: ‘యేసు జీవించుచున్నాడు, యేసుక్రీస్తు మార్గమును, సత్యమును, జీవమునైయున్నవాడు’ అని గొప్ప శబ్దముతో ప్రకటించేవారు. ఉదయకాలము ఆరు గంటలుయైన వెంటనే రైలు నిలయమునకు వెళ్లి, సుమారు రెండువేల కరపత్రములను పంచిపెట్టి వచ్చెవారు.
సాయంకాల వేళ వైద్యశాల పరిచర్యకు వెళ్లి, కనీసము నలుగురు రోగిష్టులైనను ప్రభువు వద్దకు నడిపించెవారు. రాత్రి సమయములో ఏదో ఒక గృహ కూటములలో పాల్గొని ఆసక్తితో ప్రార్థించెవారు. లేక ప్రభువు యొక్క సందేశమును కూటములలో పంచుకొనెవారు. ప్రతి ఆదివారమును చెరసాల పరిచర్యకు వెళ్లేవారు. సెలవు దినములలో గ్రామ పరిచర్యకు మిగతా సేవకులతో కలసి వెళ్లేవారు. ఆయన సమయమును పూర్తిగా వినియోగ పరుచుకొనెను.
ఒక రోజున ప్రభువు: “నీవు పుస్తకములను వ్రాయవలెను” అని చెప్పెను. మా తండ్రిగారు కూడాను ప్రయత్నించుటకు ప్రారంభించగా, ప్రభువు యొక్క ఆత్ముడు సుమారు 800 పుస్తకములకు పైగా వ్రాసి ముగించుటకు కృపను ఇచ్చెను. రెండుసార్లు ఆయనను అతి భయంకరమైన పక్షవాతము దాడిచేసి శరీరము యొక్క కుడి భాగమును చచ్చుబడిపోవునట్లుగా చేసెను. ఒకసారి ఆయన వాహనము భయంకరమైన విపత్తునకు గురై, ఊపిరాడని పరిస్థితి కలిగి, ప్రాణమునకై పోరాడెను. దేవుడు ఆయనకు అనుగ్రహించిన పగటి కాలము ముగించబడుచున్నది అను తలంపు ఆయనలోనికి వచ్చెను. అయినను దేవుడు ఆయనకు ఆయుష్షు దినములను పొడిగించి ఇచ్చెను.
దేవుని బిడ్డలారా, లోకము యొక్క అంతము లోనికి వచ్చియున్నాము. యుగాంతమును గూర్చి బైబిలు గ్రంధములో వ్రాయబడియున్న ప్రతి ప్రవర్చనమును నెరవేర్చబడియున్నది. ఇది ప్రభువును ఎదుర్కొనుటకు సిద్ధపడేటువంటి ఒక కాలము. ‘ఎల్లప్పుడును సిద్ధపడియుండుము’ అని ప్రభువు మనకు గ్రహింపజేయుచున్న సమయము.
నేటి ధ్యానమునకై: “భూమి పైరుపండియున్నది, కోతకాలము వచ్చినది, కావున నీ కొడవలి పెట్టి కోయుమని గొప్ప స్వరముతో …. చెప్పెను” (ప్రకటన. 14:15).