సెప్టెంబర్ 27 – సొమ్మసిల్లుపాటను మార్చును!
“సొమ్మసిల్లినవారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే” (యెషయా. 40:29).
సొమ్మసిల్లుట అను అనుభవమును దాటి వెళ్ళని ఒక్క మనుష్యుడును ఈ లోకమునందు లేడు. విశ్వాసులకును, సేవకులకును సొమ్మసిల్లుపాటు వచ్చును. పేదవారికిని, ధనికులకును సొమ్మసిల్లుపాటు వచ్చును.
సాతాను సొమ్మసిల్లుపాటు అను ఆయుధముతో విశ్వాసులను దాడిచేయుచున్నాడు. అయితే ప్రభువు, సొమ్మసిల్లు సమయములో బలమును ఇచ్చి మీకు బలమును అభివృద్ధి కలుగజేయుచున్నాడు. ఉత్సాహభరితమైన ఆత్మను అనుగ్రహించుచున్నాడు. అట్టి సమయములయందు ప్రభువును స్తుతించి ఆనందించునట్లు ఆనందతైలము చేత అభిషేకము చేయుచున్నాడు.
యోనా యొక్క అనుభవము ఏమిటి? “నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసికొంటిని” (యోనా. 2:7). మీకు సొమ్మసిల్లుపాటు వచ్చుచున్నప్పుడల్లాను మీ యొక్క విశ్వాసమును కట్టి లేవనెత్తి ప్రభువును జ్ఞాపకము చేసుకోనుడి. యోనా ప్రభువు యొక్క చిత్తమును విడిచి పారిపోయినవాడే, యోనాను సముద్రములోని చేప మ్రింగి వేయగా, చేప కడుపులో ఉన్న యోనా సొమ్మసిల్లిపోయెను. అప్పుడు అట్టి సొమ్మసిల్లుపాటు మధ్యలోను ప్రభువును తేరి చూచి ఆసక్తితో ప్రార్థించుట చేత, చేప వడ్డునకు వచ్చి యోనాను కక్కి వేసెను. సొమ్మసిల్లుపాటంతా పోయి, ఉత్సాహముతో నేనివేకి వెళ్లి ప్రసంగించుటకు ప్రారంభించెను.
ఒక వ్యాపారవేత్తకు నష్టము పై నష్టము వచ్చినప్పుడు, సొమ్మసిల్లుపాటు అతనిని పట్టిపీడించెను. మనస్సు ఆత్మహత్యకు ప్రయత్నించెను. మనస్సునందుగల అట్టి సొమ్మసిల్లుపాటు వలన ఆయన శరీరమునందు ఎర్రటి పొక్కులు ఏర్పడెను. ఆయన ఎల్లప్పుడును పండుకొనే ఉండవలెను అనియు లేచి నడవకూడదు అనియు వైద్యులు చెప్పిరి. మనస్సునందు బహుగా సొమ్మసిల్లిపోయినందున ఒక పేపర్‌ను తీసుకుని, తన భార్యకు ఒక ఉత్తరమును వ్రాసెను. “ప్రియమైన భార్యామణి, రేపటి రోజున నేను ప్రాణలతో ఉండను. నా యొక్క సమాధి కార్యక్రమమును చేసి ముగించుడి”.
ఆయన ఏ గదిలో అయితే ఉంటున్నాడో, ఆ గదికి తిన్నగా, క్రింద ఒక ఆత్మీయఆరాధన జరుగుచు ఉండెను. అక్కడున్న విశ్వాసులు మిగుల ఉత్సాహముతో ఆనందించి స్తుతించి ప్రభువును పాడి ఆరాధించుచు ఉండిరి. ఆ శబ్దమును విని ఆయన, మెల్లగా దిగి ఆ ప్రార్ధనా గదిలోనికి వచ్చెను. అక్కడ ప్రసంగించుచున్న సేవకుడు: “ఆయన మిమ్ములను గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తును ఆయన మీద వేయుడి” (1. పేతురు. 5:7) అని విశ్వాసముతో ప్రసంగించెను.
ఆ వర్తమానము ఆయన యొక్క హృదయమును తాకేెను. నన్ను విచారించువాడు ఒకడు ఉన్నప్పుడు, నేను ఎందుకని చింతించి సొమ్మసిల్లవలెను అని తలంచెను, అంతే ఇక ఆలస్యము. అకస్మాత్తుగా జెడివర్షపు వరదవలె దేవుని యొక్క శక్తి ఆయనపై దిగివచ్చెను. పరలోకపు శక్తి ఆయనను ఆవరించెను. ఇక మీదట నేను సొమ్మసిల్లను అని చెప్పి, తన మనస్సును ధైర్యపరచుకొనెను. ఆ దినము మొదలుకొని ఆయన యొక్క జీవితములో గొప్ప పునరుద్ధరణ కలిగెను.
దేవుని బిడ్డలారా, మిమ్ములను గూర్చి చింతించుచున్న ప్రభువు, మీ యొక్క సొమ్మసిల్లు పాటులనన్నిటిని మార్చి, నిశ్చయముగానే ఒక అద్భుతమును చేయును.
నేటి ధ్యానమునకై: “నీ భారమును యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును; నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు” (కీర్తనలు. 55:22).