Appam, Appam - Telugu

మే 30 – సహాయము కలదు!

“ఇశ్రాయేలూ, నీ సహాయకర్తను నేనే” (హోషేయా. 13:9).

బైబిలు గ్రంథమునందు చిన్న ప్రవక్తలలో ఒకడైన హోషేయా పద్నాలుగు అధ్యాయములను వ్రాసియున్నాడు. ప్రత్యేకముగా ఆయన సూటిగా ఇశ్రాయేలు, యూదా, ఎఫ్రాయిము అని పిలచి, ప్రభువు యొక్క మాటను ప్రవర్తించుటను చూడ వచ్చును. హోషేయాలో వచ్చుచున్న దేవుని యొక్క ప్రధానమైన సందేశము: “ప్రభువు వద్దకు తిరుగుడి. ఆయన వద్ద సహాయము కలదు” అనుటయే.

ప్రభువును విడిచి దూరముగా వెళుచున్నప్పుడు పలు కీడులును, శాపములును, పేదరికమును వేదనయు వెంబడించుచున్నది. అయితే మారుమనస్సును పొందినవారై దేవుని యొక్క సమూఖమునకు కన్నీటితో వచ్చుచున్నప్పుడు ప్రభువు వద్ద ఎల్లప్పుడును మనకు సహాయము కలదు. ‘బ్రష్టులైన వారులారా నా యొద్దకు తిరుగుడి’ అని ఆయన పిలచుచున్నాడు. బైబులు గ్రంథము సెలవిచ్చుచున్నది: “ఇశ్రాయేలూ, నీ పాపముచేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము” (హోషేయా. 14:1). “ఇశ్రాయేలూ, నీ సహాయకర్తనగు నాకు నీవు విరోధివై నిన్ను నీవే నిర్మూలము చేసికొనుచున్నావు” (హోషేయా. 13:9).

ఒక సంగతిని దిట్టముగా తెలుసుకొనుడి. ఎట్టి స్థితియందు ఉండినప్పటికిని మనము ప్రభువు వద్దకు తిరుగుచున్నప్పుడు, ఆయన యొక్క ప్రేమ గల హస్తములు మనలను హక్కున చేర్చుకొనుటకు ఆసక్తిగలదై ఉన్నది. తన వద్దకు వచ్చుచున్న ఎవరినైనను ఆయన వెలుపలకు నెట్టివేయడు. బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “నిజమైన వెలుగు ఉండెను; అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది ” (యోహాను. 1:9).

“సహాయము కలదు” అను సంగతిని క్రొత్త నిబంధనలో ప్రభువు ఒక చక్కటి ఉపమానము ద్వారా తెలియజేయుటకు సంకల్పించెను. అదియే తప్పిపోయిన కుమారుని చరిత్ర. అతడు వేశ్యా సాంగత్యము చేసి తన ఆస్థినంతటిని హరింపజేసుకుని ఎక్కడికి వెళ్ళుట అను సంగతి తెలియక పందుల మధ్యన పంది వలె జీవించి పందులు తినే తవుడు చేత తన కడుపును నింపుకొను స్థితికి వచ్చెను. పాపము ఎంతటి లోతైన నాశనము లోనికి త్రోవ నడిపించుచున్నది!

అయితే ఒక దినమున అతడు ఆలోచింపజేసేను. ‘నేను నా తండ్రి యొద్దకు తిరిగి వెళ్ళినట్లయితే నిశ్చయముగానే నాకు సహాయము కలదు. నా తండ్రి ఇంటిలో పనివారు కూడాను ఎంతో తృప్తిగా తిని సంతోషముగా ఉన్నారు. కావున నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్లి, నీకు విరోధముగాను, పరలోకమునకు విరోధముగాను పాపము చేసితిని. నన్ను నీ కుమారుడను అని చెప్పుటకు కూడాను నేను యోగ్యుడను కాను అని చెప్పెదను’ అని కన్నీటితో లేచి బయలుదేరి వచ్చెను.

సహాయము చేయుటకు ఆత్రుత గల తండ్రి తన కుమారుని చూచిన వెంటనే ఆసక్తితో ఎదురుకొని పరిగెత్తుకుని వెళ్లెను. అతని మెడ మీద పడి కౌగిలించుకొని ముద్దు పెట్టెను, చేతికి ఉంగరమును తొడిగించెను, విలువైన క్రొత్త వస్త్రమును ధరింపజేసెను, క్రొవ్విన దూడను వధింపచెసెను, నాట్యముతో కూడిన విందును ఏర్పాటు చేసెను. ఇవి అన్నియును సహాయములే. అతనిని ఆ తండ్రి మరల తన యొక్క కుమారునిగా అంగీకరించుటయే సహాయములలోనే అతిమేటియైన సహాయము.

దేవుని బిడ్డలారా, ఎట్టి స్థితిలో మీరు ఉండినప్పటికిని మిమ్ములను ద్వేషింపనివాడు, మిమ్ములను తప్పించువాడు యేసు ఒక్కడే. ఆయన వద్దకు తిరుగుడి. బహువిస్తారమైన సహాయము మీ కొరకు కనిపెట్టుకొనియున్నది.

నేటి ధ్యానమునకై: “ఇదిగో, దేవుడే నాకు సహాయకుడు; ప్రభువే నా ప్రాణమును ఆదరించువారితో ఉన్నాడు” (కీర్తనలు. 54:4).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.