Appam, Appam - Telugu

నవంబర్ 15 – సమయమును వ్యర్థపరచకుడి!

“సహోదరులారా, నేనిదివరకే పట్టుకొని యున్నానని తలంచుకొనను; అయితే ఒకటి చేయుచున్నాను; వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికొరకై వేగిరపడుచు, క్రీస్తు యేసునందు దేవుడు పిలిచిన ఉన్నతమైన పిలుపునకు కలుగు పంద్యపు బహుమానమును పొందవలెనని, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను” (ఫిలిప్పీ. 3:13,14).

నేడు ఎటు చూచినను, “వ్యర్థపరచకుడి” అను ప్రకటనలు కంట పడుచున్నాయి. “నీటిని వ్యర్ధపరచుకుడి.” “పెట్రోలును వ్యర్థపరచుకుడి.” “విద్యుత్తును వ్యర్ధపరచకుడి” అనువాటికి సంబంధించిన ప్రభుత్వపు రంగాలు చెప్పుచున్నాయి. అయితే బైబిలు గ్రంథము: “సమయమును వ్యర్థపరచుకుడి” అని ప్రేమతో ఆలోచనను ఇచ్చుచున్నది.

భూమి మీద మనుష్యునికి ప్రారంభమును కలదు, ముగింపును కలదు, మద్యనున్న కాలము కొద్ది కాలమే. మనుష్యునికి ఇవ్వబడియున్న పగటి కాలము సంకూచితమైనదే. ఒక నిమిషమునకు 72 సార్లు కొట్టుకొనుచున్న మన యొక్క హృదయము అకస్మాత్తుగా ఆగిపోయినట్లయితే, నిత్యత్వములోనికి వెళ్ళవలసినదై ఉండును.

దేవుని బిడ్డలారా, మనము ప్రభువు కొరకు ఎడతెగక పరిగెత్తుచూనే ఉందుముగాక. అపో. పౌలు: “నేను వెనకున్న వాటిని మరచుచున్నాను. ముందున్న వాటికొరకు వేగిరపడుచున్నాను. యేసుక్రీస్తునందు పిలవబడిన ఉన్నతమైన పిలుపు యొక్క పంద్యపు బహుమానము కొరకు గురి యోద్దకే పరిగెత్తుచున్నాను” అని చెప్పుచున్నాడు. అవును, మనకు విశ్రాంతి ఈ భూమి మీద లేదు.

మనము ఈ లోకములో జీవించుట ఒకే ఒక్కసారి అనుట చేత రాత్రింబగళ్లు అంధకార లోకనాధులతోను, ఆకాశ మండలమునందు గల దురాత్మ సమూహములతోను యడతెరిపి లేకుండా యుద్ధమును చేయుచునే ఉండవలెను. మరోవైపున సువార్త ప్రకటించబడని గ్రామములకు వెళ్లి సువార్తను ప్రకటించవలెను.

యుద్ధమునకు వెళ్ళవలసిన కాలములో, దావీదు సమయమును వ్యర్ధపరుచుకుని మిద్దమీద సంచరించుచు తిరిగిన్నందున అట్టి బద్ధకమైన సమయము దావీదును పాపములోనికి ఈడ్చుకొని వెళ్లెను. “సోమరితనము గలవాని యొక్క హృదయము సాతాను యొక్క కర్మాగారము” అనుట సామెత.

అట్టి పాపపు చర్య, దావీదు యొక్క జీవితములో భయంకరమైన శాపములను తీసుకొని వచ్చెను. లోతైన గాయములను ఏర్పరచి వేసెను. అతని భార్యలు అందరును సూర్యుని యొక్క బట్టభలైన వెలుగులో బహిరంగముగా భయంకరముగా మానఛాదమునకు గురియైయ్యిరి.

దావీదునకు జన్మించిన కుమారుడు వ్యాధి చేత మొత్థబడి మరణించెను. ఒకానొక కాలమునందు దేవుని యొక్క హృదయానుసారుడుగా కనబడిన దావీదు, ఇప్పుడైయితే విలపించి ఏడ్చి రాజనగరును విడిచి పారిపోవలసినదాయెను. ఆయన రహస్యముగా చేసిన పాపము ఆయనను, బహిరంగముగా అవమానమునకు గురి చేసెను.

మీరు వ్యర్ధముగా ఖర్చుపెట్టిన సమయముల కొరకు కన్నీటితో పశ్చాత్తాపపడి ప్రభువు యొక్క కనికరమును అడుగుడి. క్షణములు, నిమిషములు, గడియలు అన్నియు దేవుడు మీకు అనుగ్రహించియున్న కృపగల తరుణములు. అమూల్యమైన వైఢూర్యపు ముత్యాలు.

దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్క క్షణ కాలమును ప్రభువు కొరకు సద్వినియోగ పరుచుకొందురుగాక.

నేటి ధ్యానమునకై: “ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారిమీదికి వచ్చుచున్నందున, వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచ నియ్యకుండునట్లు జాగ్రత్తగా ఉండుడి” (ఎఫెసీ. 5:6).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.