Appam, Appam - Telugu

నవంబర్ 04 – అన్యభాషలతోను మట్లాడును!

“నత్తివారి పెదవుల చేతను, అన్యభాషతోను ఈ జనులతో మాటలాడుచున్నాడు” (యెషయా. 28:11).

పరిశుద్ధాత్ముని ద్వారా దేవుని యొక్క అభిషేకమును మనలో కుమ్మరించబడియున్నది. రాజు యొక్క విజయ సునాథము మనకు వచ్చుచున్నది. ప్రభువు యొక్క ఆత్ముడు మనలో నివసించుటచేత ఆయన మన ద్వారా మాట్లాడుచున్నాడు. ఈయన లోకములో ఉన్న వానికంటే గొప్పవాడు (1. యోహాను. 4:4). సర్వశక్తిమంతుడు, రాజాది రాజు!

లోకములో వేలకొలది సంఖ్యలో భాషలు కలదు. ఆత్మ చేత మనము నింపబడుచున్నప్పుడు, ప్రభువు తనకు చిత్తమైన భాష ద్వారా మనతో కూడా మాట్లాడుచున్నాడు. మన హృదయాంతరంగము ఆ సంగతిని తెలుసుకొనుచున్నది. ఆది అపోస్తుల యొక్క దినములలో ఎప్పుడంతా ఆత్మను జనులపై కుమ్మరించెనో, అప్పుడంతా వారు అన్యభాషలను మాట్లాడిరి.

ఒకసారి మా యొక్క తండ్రి గారు కొరియా దేశమునకు వెళ్లి తిరిగి వచ్చిన వెంటనే తన అనుభవమును నాతో పంచుకున్నారు. బోధకులైన పాల్ యాంగిచ్చో అనువారు ఆదివారపు ఆరాధనలో ప్రసంగించుచున్నప్పుడు, ఆ ప్రసంగమును ఆయనకు వెనకనున్న చిన్నచిన్న గదులలో అనువాదకులు కూర్చుండి పలు పలు భాషలలో తర్జుమా చేయుచు ఉండెనట.

వీరులో ప్రతి ఒక్కరికి చెవులలో తగిలించుకునేటువంటి చిన్న శబ్దయంత్రము (earphone) ఇవ్వబడి ఉండెనట. వారి ఎదుట ఉంచబడియున్న చిన్న పరిక్రమమును త్రీప్పుచున్నప్పుడు, ఆయన మాట్లాడుచున్న ప్రసంగము పలు పాషలలో చెవులలో వినబడునట.

మొదట జర్మనీ భాష, తరువాత జపనీస్ భాష, చైనా భాష, ఫ్రెంచ్ భాష, ఆంగ్ల భాష అను భాషలు. ఎట్టి భాషలో మనకు కావలెనో అట్టి భాషకు తగినట్లు పరిక్రమమును త్రిప్పి పెట్టుకొనవలెను. అదేవిధముగా, మనము మన యొక్క అంతరంగమును పరలోకము తిన్నగా త్రిప్పి ప్రార్థించుటకు ప్రారంభించు చున్నప్పుడు పరలోకపు భాషలను భూసంబంధమైన భాషలను మన యొక్క అంతరంగములోనికి వచ్చుచున్నది. మనము దేవునితో సమీపించి చేరుటకు సహాయము చేయుచున్నది.

కొన్ని సమయములో అన్యభాషలో మాట్లాడుచున్నప్పుడు, ప్రభువు దానిని అర్థము చేసుకునేటువంటి మాటను ఇచ్చుచున్నాడు. అది భాషలను వ్యాఖ్యానించుచున్న వరము అని పిలవబడుచున్నది. అట్టి వారము ఉన్నప్పుడు మనమే అన్యభాషలను అనువదించగలము. ఇతరులు మాట్లాడుచున్న భాషను అర్థము చేసుకొని అనువదించి చెప్పగలము. అన్యభాష మాట్లాడుచున్నవారు సహజముగా అందులోనే తృప్తి చెంది ఆగిపోవుచున్నారు. బైబులు గ్రంథము సెలవిచ్చుచున్నది: “అన్యభాషతో మాటలాడువాడు దాని అర్థమును చెప్పు శక్తి కలుగుటకై ప్రార్థన చేయవలెను” ‌ (1. కోరింథీ. 14:13).

అన్య భాషలో మాట్లాడునట్లు చేయుచున్నవాడు పరిశుద్ధాత్ముడే. మాట్లాడుచున్న అట్టి మాటలకు వ్యాఖ్యానము ఇచ్చి మాతృభాషలో దాని తగిన అర్థమును ఇచ్చువాడును ఆయనే, “పరిశుద్ధాత్ముడు ప్రవర్చించెను” అని బైబిలు గ్రంధములో మరల మరల చదువుచున్నాము. దేవుని బిడ్డలారా, ప్రభువు అన్యభాషల ద్వారా మనతో మాట్లాడను.

నేటి ధ్యానమునకై: “నా నామమున దయ్యములను వెళ్లగొట్టుదురు; క్రొత్త భాషలు మాటలాడుదురు” (మార్కు. 16:17)..

Leave A Comment

Your Comment
All comments are held for moderation.