Appam, Appam - Telugu

జూలై 16 – నేడు కార్యమును!

“నా యజమానుడగు అబ్రాహాము దేవుడవైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలముచేసి నా యజమానుడగు అబ్రాహాము మీద అనుగ్రహము చూపుము” (ఆది.కా. 24:12).

కొన్ని కార్యములు ఆటంకపరచబడుచూనే ఉన్నాయి. దీర్ఘ కాలముగా ఆశీర్వాదమును స్వతంత్రించుకొనుటకు కోరియు కాలయాపన అవ్వుచూనే ఉన్నది. ఏలియాజరు ప్రార్ధించినట్లుగా మనము కూడాను ప్రార్థించెదము!

ప్రభువే కార్యమును సఫలపరచవలెను. లేక్కున్నట్లయితే మనము ఎంతగా ప్రయత్నించినను సమయమును ధనమును ప్రయాసయును వ్యర్థమైపోవును. కార్యమును సిద్ధింప చేయువాడు ప్రభువు. కావున, మనము దేనికై ప్రయత్నించినను: “ప్రభువా, నేడు నా యొక్క కార్యమును సిద్ధింపచేయుము” అని కన్నీటితో అడుగుదుము గాక!

అబ్రహాము తన యొక్క విచారణకర్తయగు ఏలియాజరునకు ఒక బాధ్యతను ఇచ్చియుండెను. తన కుమారుడైన ఇస్సాకునకు తగిన జీవిత భాగస్వామియగు ఒక చిన్నదానిని కనుగొనుటయే ఆ బాధ్యత. వివాహ కార్యమును చక్కపరచవలసిన బాధ్యత. గుణవంతురాలైన స్త్రీని వెతికే ప్రయత్నమునందు ఏలియాజరు బయలుదేరినప్పుడు ఆయన ఒక ఆసక్తితో కూడిన ప్రార్ధనను చేసెను. “నా యజమానుడగు అబ్రాహాము దేవుడవైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలముచేసి నా యజమానుడగు అబ్రాహాము మీద అనుగ్రహము చూపుము” (ఆది.కా. 24:12) అనుటయే ఆసక్తితో కూడిన ఆ ప్రార్థన.

అట్టి ప్రార్ధనను వెనువెంటనే ప్రభువు ఆలకించెను. ఏలియాజరు మనస్సునందు కలిగియున్న తలంపు చొప్పున రిప్కా అగపడి అతనికి అతని ఒంటెలకును నీళ్లను చేదిపోసెను. గుణవంతురాలైన చిన్నదానిని కనుగొనెను. ప్రభువు కార్యమును సఫలపరిచిన వెంటనే ఆయన: “తలవంచి, యెహోవాకు మ్రొక్కి, …. సరియైన మార్గమందు నన్ను నడిపించిన అబ్రాహామను నా యజమానుని దేవుడైన యెహోవాను స్తోత్రము చేసితిని” (ఆది.కా. 24:48) అని చెప్పి దేవుణ్ణి స్తుతించెను.

మీయొక్క పిల్లల వివాహము బహుశా ఆటంకపరచబడుచు ఉండవచ్చును. మీరు ఇల్లు కట్టుటకు తీయుచున్న ప్రయత్నములు అనుకూల పరచబడక పోయి ఉండవచ్చును. మీ పిల్లలు యొక్క ఉద్యోగపు అవకాశములు, భవిష్యత్కాలము యొక్క అభివృద్ధిని అనేకులు ఆటంకపరచి ఉండవచ్చును.

ప్రభువా, నేడు నాకు కార్యమును సఫలపరచుము అని ఏలియాజరువలె ప్రార్ధించుడి. నిశ్చయముగానే, ప్రభువు దూర దేశము నుండి వచ్చుచున్న శుభ సమాచారము చేత మిమ్ములను ఆనందింపజేయును. అద్భుతమైన ఒక మార్గమును చూపించి, అందులో ప్రభువు తానే మిమ్ములను చేయి పట్టి నడిపించుకుని వెళ్ళును.

సంతోషించి ప్రభువును స్తుతించుడి. నేడు మీయొక్క సమస్యలు తొలగిపోయి మనశ్శాంతి మీ అంతరంగమును నింపును. ‘ప్రభువే నా భారమును వహించెను. ఆయన బాధ్యత వహించి నడిపించును. సమస్తమును మేలుకరముగాను సమృద్ధిగాను ఉండును’. అను విశ్వాసము మీ యొక్క అంతరంగమునందు వచ్చును. అప్పుడు ప్రభువును స్తుతించి మహిమపరచుడి. దేవుని బిడ్డలారా, నేడు కార్యము సఫలమగు దినము.

నేటి ధ్యానమునకై: “నేడు యెహోవా ఇశ్రాయేలీయులకు రక్షణ కలుగజేసెను అనెను” (1. సమూ. 11:13).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.