జూలై 14 – అగ్నిమయమైన జీవితము!
“కట్టెలు లేనియెడల అగ్ని ఆరిపోవును; కొండెగాడు లేనియెడల జగడము చల్లారును. కొండెగాని మాటలు రుచిగల పదార్థములవంటివి; అయినను అవి లోకడుపులోనికి దిగిపోవును” (సామెతలు. 26:20,22).
అగ్ని ఆరిపోకుండా మండుచు ఉండవలెను అంటే, అక్కడ కట్టెలు మండుచూనే ఉండవలెను. మీ యొక్క
అంతరంగమునందు ప్రేమాగ్ని రగులుకొని మండుచూనే ఉండవలెను అంటే, మీరు క్రీస్తును గూర్చి ఇతరులకు చెప్పుచూనే ఉండవలెను.
“నేను నీ నోట పెట్టిన మాటలను అగ్నిగాను, ఈ జనమును కట్టెలుగాను నేను చేసెదను” (యిర్మీయా. 5:14) అని ప్రభువు చెప్పెను. ఏలియా ఆకాశము నుండి అగ్నిని దించ్చునట్లుగా, జనులందరిని కర్మేలు పర్వతము పైకి సమకూర్చి రప్పించెను. నా యొద్దకు రండి అని పిలచినప్పుడు, జనులందరు అతని యొద్దకు వచ్చిరి. (1. రాజులు. 18:30).
అప్పుడు ఏలియా కట్టెలను పేర్చి, ఒక ఎద్దును ముక్కలు ముక్కలుగా తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి ప్రార్ధించుచుండగా, “యెహోవా అగ్ని దిగి, దహనబలి పశువును, కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి, కందకమందున్న నీళ్లను ఆరిపోచేసెను” (1. రాజులు. 18:38).
నేడును ప్రభువు అగ్నిని వేయుటకు కోరుచున్నాడు. అంతరంగమునందును జనుల మధ్యలోనూ ప్రభువే దేవుడు అని నిరూపించునట్లుగా పరలోకపు అగ్ని వేయుటకు కోరుచున్నాడు. పరిశుద్ధాత్ముని యొక్క అగ్నిని వేయుటకు కోరుచున్నాడు. అంత మాత్రమే కాదు, అది రగులుకొని మండవలెనని ఆయన ఆసక్తి కలిగియున్నాడు (లూకా. 12:49).
కొర్నేలీయను శతాధిపతి ఇంట నిలబడి పేతురు ప్రసంగించెను. కట్టెలవలె విస్తారమైన అన్యజనులు చేరి వచ్చియుండెను. పేతురు లేచి నిలబడి, ఆత్మీయు జీవమునైయున్న వచనములను ప్రసంగించినప్పుడు, జనుల మధ్యలో అగ్ని రగులుకొని మండెను. “అతని (బోధ) మాటలను విన్నవారందరి మీదికి పరిశుద్ధాత్ముడు దిగివచ్చెను” (అపో.కా. 10:44).
ఈ కాలము అగ్ని అభిషేకము యొక్క కాలము. సర్వ శరీరుల మీదను ప్రభువు తన యొక్క అగ్నిని కుమ్మరించుచున్న కాలము. దేశమునందు అగ్ని యొక్క స్థాయియు, అభిషేకము యొక్క స్థాయియు, పెరుగుచూనే ఉన్నది. మొదటిగా, అగ్ని దిగిరావలెను. రెండోవది, దిగి వచ్చిన అగ్ని మానక రగులుకొని మండుచూనే ఉండవలెను. బలిపీఠంపై ఉన్న అగ్ని ఆరిపోకుండా మండుచూనే ఉండవలెను. యాజకుడు ప్రతి ఉదయమును దాని మీద మండునట్లు కట్టెలను వేయుచూనే ఉండవలెను (లేవీ. 6:13).
దేవుని బిడ్డలారా, ప్రతి దినమును అగ్నిమయమైన ప్రభువు ఎదుటకు వచ్చి నిలబడుడి. మిమ్ములను ప్రకాశింప చేయువాడును, అగ్ని అభిషేకముచేత నింపుచున్నవాడును, తన సేవకులను అగ్నిజ్వాలగా చేయుదును అని వాగ్దానము చేసినవాడైయున్న ప్రభువు ఎదుట ఆకాంక్షతో వచ్చి నిలబడుడి. ఆయన మీద ఉన్న అగ్ని, మీ మీదకు నిశ్చయముగా వచ్చి నిలబడును.
నేటి ధ్యానమునకై: “నేను ఏమియు మాటలాడక మౌనినైతిని; క్షేమమును గూర్చియైనను పలుకక నేను మౌనముగా నుంటిని; అయినను నా విచారము అధికమాయెను; నా గుండె నాలో మండుచుండెను; నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను; అప్పుడు నేను ఈ మాట నోరార పలికితిని” (కీర్తనలు. 39:2,3).