ఆగస్టు 25 – అనుదిన ఆహారము!
“మాకు కావలసిన అనుదినాహారము దినదినము మాకు దయచేయుము” (లూకా. 11:3).
“అనుదిన ఆహారము” అను మాట కేవలము ఆహారమును మాత్రమే సూచించుటలేదు. లోకపరమైన జీవితమునకు కావలసిన అత్యవసరతలన్నిటిని, “అనుదిన ఆహారము” అనియే బైబిలు గ్రంధము సూచించుచున్నది. సమస్త విధములైన ఈవులను ఇచ్చుటకు ఎరిగియున్న పరమ తండ్రి యొక్క పాదముల యొద్ద ఒక్కడు ఉదయకాలమునందు పరిగెత్తుకొని రావలసినది మీకుల ఆవశ్యము.
యేసు చెప్పెను: “ఏమి తిందుమో, యేమి త్రాగుదుమో, అని మీ ప్రాణమును గూర్చియైనను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చియైనను చింతింపకుడి; …. ఆహారము కంటేను ప్రాణమును, వస్త్రము కంటేను దేహమును శ్రేష్టమైనది కాదా? ఆకాశపక్షులను గమనించి చూడుడి; అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు; అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు; మీరు వాటికంటె బహు శ్రేష్టులు కారా?” (మత్తయి. 6:25,26).
అనుదిన ఆహారమును ప్రతి దినమును పొందుకొనుటకు ఏమి మార్గము? మొదటిది, లోకపరమైన ఆశీర్వాదములన్నిటిని ప్రభువు నిశ్చయముగానే అత్యధికముగా కలిపి ఇచ్చును (మత్తయి. 6:33). రెండవది, ప్రభువు మీకు ఇచ్చును అనుటలో ఎట్టి సందేహమును లేక విశ్వాసము ద్వారా వాటిని పొందుకొందురు.
“నా జనులకు ఆత్మీయ ఆహారమును ఇవ్వవలెను” అని మా తండ్రిగారి హృదయములో ప్రభువు గ్రహింపజేసినందున 1982 ‘వ సంవత్సరమున అనుదిన ఆహారము అను పేరిట ఒక అనుదిన ధ్యానాంశ మాసపత్రికను ప్రారంభించెను. ప్రారంభమునందు నాలుగువందల పత్రికలు మాత్రమే ముద్రించబడెను. ప్రస్తుతమునందు దరిదాపులు నలభైనాలుగు సంవత్సరములు దొర్లిపోయెను. నేడు వేల కొలది పత్రికలు లోకమంతట వ్యాపించి జీవించుచున్న భారతీయ క్రైస్తవులకు వెళ్లి చేరుచున్నది. బైబిలు గ్రంథమును ధ్యానించుటకును, బైబిలు గ్రంధములోని ఘూఢమైన సంగతులను తెలుసుకొనుటకు, వాగ్దానములను పొందుకొనుటకును ఇట్టి అనుదిన ధ్యానాంశము ప్రయోజనకరముగా అమర్చబడునట్లు ప్రభువు ఆశీర్వదించియున్నాడు. బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని, దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాట వలనను జీవించును” (మత్తయి. 4:4).
“యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును; యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. అవి బంగారము కంటెను విస్తారమైన మేలిమి బంగారము కంటెను కోరదగినవి, తేనెకంటెను జుంటితేనె ధారల కంటెను మధురమైనవి” (కీర్తనలు. 19:7,10).
దేవుని బిడ్డలారా, ప్రభువు యొక్క మాటను పరలోకపు మన్నాగా భావించి వాంఛతో పాఠించుడి. వాగ్దానములను సొంతము చేసుకొని స్వతంత్రించుకొనుడి. వాటిని మీ కొరకే ప్రేమ గల పరలోకపు తండ్రి ద్వారా అనుగ్రహింప బడియున్నది.
నేటి ధ్యానమునకై: “సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై, నిర్మల మైన వాక్యమను పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము, ఆ పాలను అపేక్షించుడి” (1. పేతురు. 2:2,3).