ఆగస్టు 17 ఒకే ఒక్క జీవితము!
“ప్రతిదానికి సమయము కలదు; ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. పుట్టుటకు ఒక సమయము కలదు” (ప్రసంగి. 3:1,2).
ఈ భూమి మీద ఒకే ఒక్క జీవితము మనుష్యునికి కృపగా ఇవ్వబడియున్నది. మనుష్యునికి ఇవ్వబడియున్న జీవిత దినములు మిగుల స్వల్పమైనది. కృప యొక్క తరుణములు కూడాను స్వల్పమైయున్నది. శాశ్వతము కాని ఈ లోకములో మనము బహు వేగముగా దాటి వెళ్ళుచున్నాము. మనము ఈ లోకమునకు అన్యులమును పరదేశులమునైయున్నాము.
పుట్టుక, జీవితము, మరణము, మరణమునకు తర్వాత గల జీవితము మొదలగు నాలుగు ప్రాముఖ్యమైన సంభవములను ఈ లోకమునందు జన్మించుచున్న ప్రతి ఒక్క మనుష్యుడును ఎదుర్కొని తీరవలెను. “మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని; ఆ తరువాత తీర్పు జరుగునని నియమింపబడెను” (హెబ్రీ. 9:27) అని బైబిలు గ్రంధము చెప్పుచున్నది.
ప్రభువు ఒక్క ఉద్దేశముచేతనే మిమ్ములను ఈ లోకమునందు జన్మించునట్లు చేసియున్నాడు తప్ప ఈ లోకమును నింపుటకు గాని, ఇష్టము వచ్చినట్లు జీవించుటకు గాని కాదు. లోకమును గూర్చి దిట్టమైన, స్పష్టమైన ఉద్దేశ్యము ఆయనకు కలదు. మిమ్ములను తల్లి యొక్క గర్వమునందు రూపించిన ఆయనకు, దానికి పూర్వమే మిమ్మలను గూర్చిన ఒక నియమము కలదు. మీరు ఆకస్మికముగా ఈ లోకములోనికి రాలేదు.
ప్రభువు సెలవిచ్చుచున్నాడు: “గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని; నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని” (యిర్మియా. 1:5).
మీ యొక్క జీవితమును గూర్చి ప్రభువు వద్ద అడుగుడి. యిర్మియాను తల్లి యొక్క గర్వములో ఏర్పరచుకున్నవాడా, ప్రవక్తగా వాడుకున్నవాడా నన్ను గూర్చి నీ యొక్క చిత్తము ఏమిటి అని అడుగుడి. అపో. పౌలు కూడాను ప్రభువు వద్ద అలాగునే అడిగెను.
“ప్రభువా, నన్ను ఏమి చేయవలెనని సంకల్పించియున్నావు” అని పౌలు అడిగెను. అందుకు ప్రభువు: “నీవు లేచి, పట్టణములోనికి వెళ్లుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడునని చెప్పెను” చెప్పినట్లుగానే ప్రభువు అక్కడ తన యొక్క చిత్తమును బయలుపరిచెను. “అతడు అన్యజనుల యెదుటను రాజుల యెదుటను ఇశ్రాయేలీయుల యెదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమైయున్నాడు” (అపో.కా. 9:15) అని చెప్పెను.
కొందరు: “నేను ఎందుకని జన్మించానో తెలియలేదు. నేను ఎందుకని ఈ లోకములో జీవించవలెను? ఆత్మహత్య చేసుకుని చనిపోవుటయే మేలు” అని తలంచుచున్నారు. దేవుని యొక్క బిడ్డల నోటియందు అటువంటి ఓటమి మాటలు ఎన్నడును రానేకూడదు. అదేవిధముగా, కొంతమంది తల్లిదండ్రులు కూడాను లోబడని తమ పిల్లలను: “నీవు ఎందుకని నాకు జన్మించావో తెలియలేదు. నీవల్ల నాకు ఎంతటి బాధలు! నీవు చనిపోయినట్లయితే బాగుండునే” అని విలపించుచున్నారు.
దేవుని బిడ్డలారా, మీరు ఎన్నడను బాధలతో ఇలాగున మాట్లాడకుడి. మీ పిల్లలను ప్రభువు యొక్క చేతులకు అప్పగించుకోనుడి. అప్పుడు ప్రభువు వారిని ఆశీర్వదించి గొప్ప చేయును.
నేటి ధ్యానమునకై: “యెహోవా, నీయందు నమ్మిక యుంచియున్నాను; నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను. నా కాలగతులు నీ వశములో నున్నవి” (కీర్తనలు. 31:14,15).