ఆగస్టు 05 – యెహోవా దళపతి!
“యెహోవా సేనాధిపతిగా నేను ఇప్పుడు వచ్చియున్నాను అనెను” (యెహోషువ. 5:14).
“యెహోవా యొక్క దళపతి” అను అంశముపై ఒక వ్యక్తి ఒక వీడియోను తయారు చేసెను. ప్రభువు కొరకు బహు బలముగా వాడబడిన దేవుని యొక్క కొంతమంది సేవకులను గూర్చియు, వారు విస్తారమైన ఆత్మలను సంపాదించిన రహస్యములను గూర్చియు అందులో ఆయన తెలియజేసియుండెను. దాని మూలముగా అనేక దైవ రహస్యములను నేర్చుకొనుటకు సాధ్యమాయెను.
అవును, ప్రభువు మిమ్ములను చూచుచున్నప్పుడు, యుద్ధ యోధునిగా చూచుచున్నాడు. ప్రభువు యొక్క దళపతిగా చూచుచున్నాడు. మీరు ప్రభువు కొరకు యుద్ధమును చేయుటకు బయలుదేరుచున్నప్పుడు, పరలోకమునందుగల దేవదూతలు అందరును సైన్య సమూహముగా మీ పక్షమున నిలబడుచున్నారు. అత్యధిక బలిస్టులైన దేవదూతలను ప్రభువు పరిచర్యను చేయు సేవకులైన ఆత్మలుగా అనుగ్రహించియున్నాడు (హెబ్రీ. 1:14).
ఒక తాలూకా అధికారి ఏదైనా తనిఖీ చేయడానికి వెళ్ళినప్పుడు, అతనితో పాటు, అతని క్రింది అధికారులు ఇద్దరు వస్తారు. అదే సమయమున ఒక మండల అధికారి వెళితే, అతనితో పాటు యాభైమంది వస్తారు. ఒక మంత్రి వెళితే, ఐదు వందల మంది రావచ్చును. ఈ విధముగా వారివారి హోదాకు తగినట్లు సంఖ్యలో వారితో పాటు ఉండి, వారికి రక్షణను కల్పించుటకును, వారు ఆజ్ఞాపించుచున్న పనులను నెరవేర్చుటకును సహాయకులు వారితో పాటు వస్తారు.
రోమా సామ్రాజ్యమునందు శతాధిపతులను ఆ ప్రభుత్వము నియమించియుండెను. వారి క్రింద వందమంది యుద్ధయోధులు, సతాధిపతులు చెప్పుచున్న ఆజ్ఞలను నెరవేర్చుటకు సిద్ధముగా ఉంటారు. అదేవిధముగా, ఒక సైన్యాధిపతికి క్రింద వెయ్యి మంది యుద్ధ యోధులు ఉంటారు. ఈ విధముగా పలు విధములైన అధికారములును ఏలుబడులును కలదు.
అదే విధముగా, ప్రభువు కొరకు ఒక సైన్యము ఉన్నది. ఒక మాంత్రికుడు వంద దెయ్యములను తన వసమందు ఉంచుకొని వాటిని పంపించుచున్నప్పుడు, తనను కూడా ఒక శతాధిపతివలె తలంచుకొనుచున్నాడు.
ఇట్టివారు క్రైస్తవ మార్గమునకు విరోధముగాను, సేవకుల యొక్క శరీర ఆరోగ్యమునకు విరోధముగాను, కుటుంబములు చీలిపోవునట్లుగాను సాతాను వద్ద విన్నవించుకొనుచున్నారు. పరుస్థుతులు ఆరీతిగా ఉన్నప్పుడు, ప్రభువు యొక్క సేవకులమైయున్న మనము ఎంత అత్యధికముగా ప్రభువు కొరకు నిలబడి యుద్ధము చేయవలసిన వారమైయున్నాము!
ప్రభువు మిమ్ములను తన యొక్క దళపతిగా చూచుచున్నాడు. సాతానుకు విరోధముగా యుద్ధము చేయుట కొరకు ఆయన తన యొక్క రక్తమునే మీ యొక్క చేతులలో ఉంచియున్నాడు. గొర్రె పిల్లయైనవాణ్ణి రక్తము బట్టియు, తామిచ్చిన సాక్ష్యమును బట్టియు వానిని జయించుటకు మీవలన అగును (ప్రకటన. 12:11).
యుద్ధోపకారణముగా యేసుని నామమును మీకు అనుగ్రహించియున్నాడు. వాక్యము అను ఆత్మ ఖడ్గమును చేత ఎత్తి పట్టుకొనుడి. ప్రభువును స్తుతించే స్తుతియు, ఆసక్తితో కూడిన ప్రార్థనయు దేవుని యొక్క సర్వాంగ కవచమును ఉన్నాయి. వాటిని బహు శక్తితో వాడుకొనుడి. దేవుని బిడ్డలారా, మీరు యోధులుగాను, శతాధిపతులుగాను, ప్రభువు యొక్క తళాతిపతులుగాను ఉన్నారు.
నేటి ధ్యానమునకై: “మా యుద్ధోపకరణములు శరీరసంబంధమైనవి కావుగాని, దేవుని యెదుట దుర్గములను పడద్రోయజాలినంత బలముకలవైయున్నవి” (2. కోరింథీ. 10:4).