అక్టోబరు 27 – క్రొత్త కీర్తన!
“వారు సింహాసనము ఎదుటను, ఆ నాలుగు జీవుల యెదుటను, పెద్దల యెదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు; భూలోకములో నుండి కొనబడిన ఆ నూట నలువది నాలుగు వేలమంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకొన జాలరు” (ప్రకటన. 14:3).
సీయోను పర్వతము మీద గొర్రెపిల్లతో పాటు నిలబడుచున్నవారు అందరును మధురమైన ఆనందముతో తూలుతు కీర్తనను పాడిరి. ఆ కీర్తనను మరెవ్వరును నేర్చుకొనలేనిదైయుండెను. అది ఒక ఆశ్చర్యమైన కీర్తనయైయుండెను. భూసంబంధమైన జీవితమును విజయవంతముగా ముగించినవారు విజయ గంభీరముతో క్రొత్త కీర్తనను పాడుచున్నారు.
పాత నిబంధనలో, ఎర్ర సముద్రమును దాటుకొని ఇశ్రాయేలీయులు వచ్చినప్పుడు, మోషేయు, మిరియామును, ఇశ్రాయేలీయులు విజయభేరి వంటి ఒక కీర్తనను పాడిరి. “యెహోవాను గూర్చి గానము చేసెదను; ఆయన మిగుల అతిశయించి జయించెను; గుఱ్ఱమును దాని రౌతును ఆయన సముద్రములో పడద్రోసెను” (నిర్గమ. 15:1) అని పాడిరి. ఎర్ర సముద్రము యొక్క తీరములో పాడుట కంటే సీయోను కొండలో క్రీస్తుతో చెయ్యి కలిపి పాడుట ఎంతటి మహిమకరముగా ఉండును!
క్రొత్త నిబంధన, క్రొత్త కీర్తనల తోనే ప్రారంభమగుచున్నది. దేవదూతలు: “సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయన కిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును, కలుగునుగాక అని చెప్పి, దేవుని స్తోత్రము చేయుచుండెను” (లూకా. 2:14) అని బైబిలు గ్రంథము చెప్పుచున్నది. క్రీస్తు యొక్క పుట్టుక సమయమునందు, పరలోకమునందు గల పరమ సైన్యము యొక్క సమూహము పాడెను. లూకా సువార్తలో ఎలీసబెతు యొక్క కీర్తన కలదు. మరియ యొక్క కీర్తన కలదు. సుమెయోను యొక్క స్తుతి కీర్తన కలదు! ప్రవక్తినియైన అన్న యొక్క కీర్తనయు కలదు.
పౌలును, సీలను, క్రూరముగా కొట్టి చెరసాలలో వేసినప్పుడు, అక్కడ వారు బాధల మధ్యలోను పాడిరి. ప్రభువు కొరకు శ్రమలు అనుభవించుటయును, సీయోను పాటను పాడి ఆనందించుటయును ఆనందకరమైన ధన్యతగల అనుభవముగా వారికి ఉండెను. అట్టి కీర్తన చెరసాల నాయకుడ్ని రక్షణలోనికి తీసుకొని వచ్చుటకు హేతుగా ఉండెను.
ఇశ్రాయేలీయులు బబులోను చెరలో చిక్కుకున్నప్పుడు, పాపము వలన కలిగిన అట్టి వేదన వారి యొక్క అంతరంగమును పిండివేసెను. “బబులోను నదుల యొద్ద కూర్చుండియున్నప్పుడు, మనము సీయోనును జ్ఞాపకము చేసికొని యేడ్చుచుంటిమి. అచ్చట మనలను చెరగొన్నవారు …. సీయోను కీర్తనలలో ఒకదానిని మాకు వినిపించుడి అని మనవలన ఉల్లాసము గోరిరి” (కీర్తనలు. 137:1,3). అయితే చెరలో ఉన్నందున ఇశ్రాయేలీయులు కీర్తనను పాడలేకపోయిరి. “అన్యుల దేశములో యెహోవా కీర్తనలు మనమెట్లు పాడుదుము?” (కీర్తనలు. 137:4) అని చెప్పి వారు కలతచెందిరి.
అయితే మనము, అట్టి సీయోను పర్వతమునందు జెయించిన పరిశుద్ధులుగా నిలబడుచున్నప్పుడు, అంతరంము అనునది ఆనందముతో పొంగి, క్రొత్త క్రొత్త కీర్తనలు నీటీ ఊటలోనుండి నీళ్లు పొంగుచు వచ్చుచున్నట్లు వచ్చుచూనే ఉండును.
“ఎవనికైనను సంతోషము కలిగెనా? అతడు కీర్తనలు పాడవలెను.” సీయోను గొప్ప సంతోషకరమైన స్థలము. “ఉత్తరదిక్కున మహారాజు పట్టణమైన సీయోను పర్వతము రమ్యమైన యెత్తుగల చోటనుంచబడి సర్వభూమికి సంతోషకరముగా నున్నది” (కీర్తనలు. 48:2) అని కీర్తనకారుడు చెప్పుచున్నాడు.
నేటి ధ్యానమునకై: “సీయోను పర్వతము సంతోషించును గాక, యూదా కుమార్తెలు ఆనందించుదురుగాక ….. సీయోను చుట్టు తిరుగుచు దానిచుట్టు సంచరించుడి, దాని బురుజులను లెక్కించుడి” (కీర్తనలు. 48:11,12,13).