Appam, Appam - Telugu

అక్టోబరు 26 – సీయోను పర్వతము!

“మరియు నేను చూడగా, ఇదిగో, ఆ గొఱ్ఱెపిల్ల సీయోను పర్వతము మీద, నిలువబడియుండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్లయందు లిఖింపబడియున్న నూట నలువది నాలుగు వేలమంది ఆయనతో కూడ ఉండిరి” (ప్రకటన. 14:1).

భారతదేశమునకు న్యూఢిల్లీ, అమెరికాకు వాషింగ్టన్, శ్రీలంకకు కొలంబు, పాకిస్తాన్కు కరాచి అని ప్రతి ఒక్క దేశమునకు ఒక రాజధాని కలదు. ఆయా రాజధానిలో దేశమును ఏలేటువంటి శాసనసభ కలదు. అక్కడ నుండే శాసనాలను అమలుపరుస్తుంటారు.

పరలోకమునందు నూతన ఆకాశము, నూతన భూమి, నూతన ఎరూషలేము, స్పటికము వంటి సముద్రము అనియు, తండ్రి యొక్క నివాస స్థలములు అనియు పలు రకాల స్థలములు ఉండినను, రాజధాని ముఖ్య పట్టణము సీయోను పర్వతమునందే కలదు. అక్కడనే తండ్రియగు దేవుడు నివాసము చేయుచున్నాడు. ఆయన సింహాసనము యొక్క కుడి పాస్వమునందు యేసుక్రీస్తు ఆసీనుడైయున్నాడు.

అక్కడనుండి భూతల మంతటిని ఏలుబడి చేయుచున్నాడు. ఆయనను మనము, “పరలోకమునందు ఉన్న మాయొక్క తండ్రి” అని ప్రేమతో పిలచి, ఆయనకు ప్రార్థన చేయుచున్నాము. పరలోకమునందుగల సమస్త స్థలములలోను సీయోను మహా గొప్ప ఔన్నత్యమైన, మహిమకరమైన స్థలమునైయున్నది.

“ప్రభువగు యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు: ఇదిగో, సీయోనులో పునాదిగా ఒక రాతిని వేసినవాడను నేనే ; అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాదియైన మూలరాయియైయున్నది, విశ్వసించువాడు కలవరపడడు” (యెషయా. 28:16). క్రీస్తు అను మూలరాయిపై అంతటి గొప్ప భవనమును, నివాస స్థలములను కట్టి నిర్మించబడుచు ఉన్నది. మనము అక్కడ క్రీస్తుతో కూడా, యుగాయుగములు జీవించి సౌఖ్యముగా ఉందుము.

అట్టి నిరీక్షణ ప్రవక్తయగు యెషయాకు ఉండెను. “ఇదిగో, నేనును, యెహోవా నా కిచ్చిన పిల్లలును, సీయోను కొండమీద నివసించు సైన్యములకధిపతియగు యెహోవా వలని సూచనలుగాను, మహత్కార్యములుగాను ఇశ్రాయేలీయులమధ్య ఉన్నాము” (యెషయా. 8:18).

మార్త, మరియ ఇంట ఆయనకు ఒక పూట భోజనము సిద్ధముచేసిరి. కొంతసేపు వారితో ఉండెను. జక్కయ్య ఇంట ఒకరోజు బస చేసెను. సిలువేయబడిన దొంగతో పరదేశిలో ఒకరోజు ఉండెను. అయితే మనతో కూడా నిరంతరమును నిత్యా నిత్యముగా క్రీస్తు ప్రేమతో నివాసము చేయును. మనము కూడాను ఆయనతో నివాసము చేయుదుము.

కావున కీర్తనకారుడు: ‌ “చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసెదను” (కీర్తనలు. 23:6) అని సంతోషముతో చెప్పెను. ఆ సీయోను పర్వతమును సూచించుచూ అపో. పౌలు కూడాను: ‌ “మన యొక్క పౌరస్థితి పరలోకమునందున్నది” (ఫిలిప్పీ. 3:20) అని వ్రాసెను .

సీయోను పర్వతమునందు లక్షల సంఖ్యలో పరిశుద్ధులు వచ్చి క్రీస్తుతో కూడా ఆనందముగా నిలబడుదురు. మీరు కూడాను గొర్రె పిల్లయైన వానితో, వేల పదివేల కొలది దేవుని దూతలతో అట్టి తేజోమయమైన దేశమునందు నిలబడవలెను. నిరంతరమును ఆ పరిశుద్ధ పర్వతమునందు నివాసము చేయవలెను.

నేటి ధ్యానమునకై: “యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు?” (కీర్తనలు. 15:1).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.