అక్టోబరు 20 – నీతియుక్తములైన బలులు!
“నీతియుక్తములైన బలులును …. నీకు అంగీకృతములగును అప్పుడు జనులు నీ బలిపీఠము మీద కోడెల నర్పించెదరు” (కీర్తనలు. 51:19).
ఒక సుంకరియును, పరిసయ్యుడను దేవుని యొక్క ఆలయమునకు వచ్చిరి. పరిసయ్యుడు ప్రార్థించుచున్నప్పుడు తన యొక్క స్వనీతినంతటిని చెప్పి ఢంబబముగా ప్రార్ధించెను. అయితే, సుంకరి విరిగినలిగిన హృదయముతో తన కన్నులను ఆకాశము తట్టునకు ఎత్తి చూచుటకు సాహసించక తన రొమ్మున కొట్టుకొనుచు: ‘దేవా, పాపినైన నన్ను కరుణించుము’ అని ప్రార్ధించెను (లూకా. 18:10-13).
మంచి కార్యములను చేసిన పరిసయ్యునిపై దేవుడు ఇష్టపడలేదు. అయితే విరిగినలిగిన హృదయముతో, హృదయమును కుమ్మరించి ప్రార్ధించిన సుంకరినే నీతిమంతునిగా చూచెను. దేవుని యొక్క కృప మీలో పని చేయుటకు చోటును ఇచ్చుచున్నప్పుడు, మీలో నలిగిన ఆత్మ కలుగుచున్నది. హృదయ కాటిన్యము మారి, విరిగి నలిగిన బలిగా సమర్పించుటకు బైబిలు గ్రంథము మీకు మూడు మార్గములను చెప్పుచున్నది.
మొట్టమొదటిగా, లేఖన వచనములు. పేతురు ఆత్మతో నింపబడి జీవపు మాటలను అభిషేకముతో మాట్లాడినప్పుడు, ఆలకించుచున్నవారు హృదయమునందు నోచ్చబడిరి. (అపో.కా. 2:37). ప్రభువు యొక్క మాటలు బండలను బద్దలు చేయు సమ్మెటవలె కఠినమైన హృదయమును విరిచి వేయును. “ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించు నంతమట్టుకు దూరుచు, …. శోధించుచున్నది’ (హెబ్రీ. 4:12).
రెండోవదిగా, మీలో నలిగిన హృదయమును పరిశుద్ధాత్ముడు తీసుకొని వచ్చుచున్నాడు. “నేను వారి శరీరములలో నుండి. రాతిగుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి, … నూతన ఆత్మను పుట్టింతును” అని చెప్పుచున్నాడు (యెహేజ్కేలు. 11:19).
అవును, పరిశుద్ధాత్ముడు మీలో నుండి గొప్ప మూలుగులతో ప్రార్థించుటకు చోటును ఇచ్చుచున్నప్పుడు, దేవుని సముఖము మిమ్ములను కప్పుచున్నది. అప్పుడు ప్రభువు యొక్క ప్రసన్నత చేత పర్వతముల వంటి కఠినమైన హృదయము మైనమువలె కరుగుచున్నది (కీర్తనలు. 97:5). అందుచేతనే “జనులారా, … ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించుడి” అని దావీదు చెప్పుచున్నాడు (కీర్తనలు. 62:8).
మూడోవదిగా, శ్రమలును ఉపద్రవములును మీయొక్క హృదయమును
నలిగిపోవునట్లు చేయుచున్నది. ఉదాహరణముగా హన్నా యొక్క జీవితమును చదివి చూడుడి. ఆమెకు పిల్లలు లేని వేదన ఒకవైపునుండెను. గొడ్రాలు అను నిందతో కూడా ఆమె యొక్క వైరి ప్రతిదినమును ఆమెను గాయపరచుచు మాట్లాడిన మాటలు ఆమె హృదయమును విరిచివేసెను.
కావున విరిగినలిగిన హృదయముతో తన హృదయమును దేవుని యొక్క సన్నిధిలో కుమ్మరించి ప్రార్ధించెను (1. సమూ. 1:25). అందుచేత ఆమె ప్రభువునకు ఇష్ఠురాళ్లుగా కనబడుట మాత్రము గాక, గొప్ప ప్రవక్తయైన సమూయేలును కానెను. దేవుని బిడ్డలారా, మీరు కూడా హృదయమును కుమ్మరించి ప్రార్థించుచున్నప్పుడు, ప్రభువునకు ఇష్టులుగా కనబడుదురు. అద్భుతములను పొందుకొందురు.
నేటి ధ్యానమునకై: “స్తోత్రార్పణ అర్పించుడి, ( దహించుడి ) స్వేచ్ఛార్పణను గూర్చి చాటించి ప్రకటన చేయుడి; ఇశ్రాయేలీయులారా, యీలాగున చేయుట మీకిష్టమైయున్నది; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు” (ఆమోసు. 4:5).