సెప్టెంబర్ 26 – యేసుతోకూడా దేవుడు!
“దేవుడాయనకు తోడైయుండెను గనుక ఆయన మేలు చేయుచు, అపవాదిచేత పీడింపబడిన వారినందరిని స్వస్థపరచుచు సంచరించుచుండెను” (యోహాను. 10:38).
మనవలె మాంసమును రక్తమునుగలవాడై మారిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తునితో తండ్రియైన దేవుడు ఎల్లప్పుడును తోడుగా ఉండెను. ఆయన యొక్క ప్రసన్నతయు, ఆయన యొక్క సమూఖమును తోడుగా ఉండెను. కావున యేసుక్రీస్తు మేలును చేయుచుండువాడై సంచరించుచుండెను. మీరు భూమి మీద మేలును చేయుచుండు వారిగాను, ఇతరులకు ఆశీర్వాదకరమైన వారిగాను ఉండవలెను అంటే, ప్రభువు ఎల్లప్పుడును మీతో కూడా ఉండవలెను. ఆయన ఎల్లప్పుడును మీతో కూడా ఉన్నాడా అను సంగతిని మీరు ఖచ్చితముగా దృఢపరచుకొనుడి.
ప్రభువు ఎడబాసిన సంగతిని సంసోను ఎరుగకుండెను అని బైబిలు గ్రంథము చెప్పుచున్నది. మిమ్ములను విడిచిపెట్టి దేవుని యొక్క ప్రసన్నతయు, పరిశుద్ధాత్ముడును ఎడబాయకుండునట్లు ఎల్లప్పుడును ప్రభువు యొక్క ప్రసన్నతలో మిమ్ములను జాగ్రత్తతో స్థిరపరచుకొనుడి. సంసోను వేశ్యల వెంబడి వెళ్లి, తన యొక్క ప్రతిష్టగల జీవితమును చెరుపుకొనుట చేతనే ప్రభువు సంసోను విడిచి ఎడబాయ వలసినదైయుండెను. ఎంతటి దుర్భలమైన పరిస్థితి!
యేసు క్రీస్తుతోకూడా తండ్రియైన దేవుడు ఎల్లప్పుడును తోడుగా ఉండెను. బాల్య వయస్సునందే ఆయన దేవుని కృపలో అత్యధికముగా వర్ధిల్లెను అని మనము లూకా. 2:52 నందు చదువుచున్నాము. దేవుని ప్రసన్నత తోడుగా ఉంటెనే మనము దేవుని కృపలో వర్ధిల్లెదము. మంచి దేవునితో కూడా ఉండుట చేత మనము కూడాను మేలును చేయుచుండువారిగా సంచరించెదము.
దేవుని ప్రసన్నత ఎల్లప్పుడును తనతోకూడా ఉండుటను యేసు గ్రహించెను. “తండ్రికి కిష్టమైన కార్యము నేనెల్లప్పుడును చేయుదును గనుక, ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు” (యోహాను. 8:29) అని ఆయన చెప్పెను. మనము మనుష్యులను కాదు, ఇంటివారిని కాదు, బంధువులను కాదు, దేవుణ్ణే ఎల్లప్పుడును ప్రియపరచునట్లుగా మనలను సంపూర్ణముగా సమర్పించుకున్నప్పుడు, ప్రభువు యొక్క ప్రసన్నత ఎల్లప్పుడును మనతో కూడా ఉండును.
యేసు తన యొక్క పంన్నెడవవ ఏటలో ప్రభువును ప్రియపరచి ఆయనతో కూడా ఉండుటకు కోరుకున్న సంగతిని లూకా 2 ‘వ అధ్యాయములో మనము చదువుచున్నాము. పస్కాపండగ సమయమున యేసు యెరూషలేములో ఉండిపోయేను. కనబడకపోయినందున తల్లియు, యోసేపును మరల దేవాలయమునకు వచ్చి ఆయనను వెదికిరి. అప్పుడు ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చోని ఉండుటను చూచిరి.
యేసుక్రీస్తు యొక్క జీవితమంతయును తండ్రిని ప్రియపరచుటయును, ఆయన యొక్క చిత్తము చొప్పున చేయుటయును, భూమిమీద మేలును చేయుటయును, పేద ప్రజల పైన జాలిపడుటయందే ఉండెను.
దేవుని బిడ్డలారా, ఆయనే మన అందరికీ ముందు మాదిరియైనవాడు. ఆయనతో కూడా తండ్రి ఉండినట్లుగా, మనతో కూడాను ఆయన ఉండును.
నేటి ధ్యానమునకై: “పగలున్నంత వరకు నన్ను పంపినవాని క్రియలు మనము చేయుచుండవలెను; రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడును పనిచేయలేడు” (యోహాను. 9:4).