Appam, Appam - Telugu

సెప్టెంబర్ 03 – కుంటివానికి కాళ్లు!

“లుస్త్రలో బలహీనమైన (పాదములు) కాళ్లుగల యొకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై యెన్నడును నడువలేక కూర్చుండియుండువాడు, అతడు పౌలు మాటలాడుటను వినుచుండెను” (అపో.కా. 14:7-9).

లుస్త్ర అను ఒక ఊరిలో కుంటివాడైన ఒక మనిషిని అపో. పౌలు చూచెను. ఆ మనుష్యునికి స్వస్థత పొందుటకు తగు విశ్వాసము కలదని చూచి, లేచి పాదములు మోపి సరిగా నిలువుమని, బిగ్గరగా చెప్పెను. వెంటనే అతడు గంతులువేసి నడువ సాగెను.

బైబిలు గ్రంథములో అక్షరానుసారమైన అద్భుతములును కలదు. ఆత్మానుసారమైన అద్భుతములును కలదు. నేడును ప్రభువు కుంటి వారిని లేచి నడుచునట్లు చేయుచున్నాడు. అదే సమయమునందు, ఆత్మీయ జీవితములో ముందుకు సాగలేక ఉన్న స్థలములోనే ఉంటున్న కుంటి వారిని ప్రభువు స్వస్థపరచి, సువార్త ప్రకటించునట్లుగా చేయుచున్నాడు.

వ్రాతపూర్వకముగా గుడ్డివారు చూపును పొందుచున్నారు. అదే సమయమునందు, అతని యొక్క ఆత్మీయ కన్నులు తెరవబడుచున్నప్పుడు, అది ఇంకను గొప్ప ఆశీర్వాదకరముగా ఉన్నది. “నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులను తెరువుము” (కీర్తనలు. 119:18) అని దావీదు ప్రార్ధించెను. ఆయన వేడుకునుచున్నదెల్లా ఆత్మీయ కన్నుల యొక్క దృష్టియైయున్నది.

దైవచిత్తమును ఎరుగునట్లుగాను, ప్రభువు యొక్క మాటకు చెవియొగ్గునట్లుగాను అనేకుల యొక్క ఆత్మీయ చెవిటి చెవులను ప్రభువు తెరుచుచున్నాడు. అవును, మీ యొక్క ఆత్మీయ చెవులను సున్నతి చేయబడి, తెరవబడవలెను.

ప్రభువును గూర్చి సాక్ష్యము చెప్పుటకు సిగ్గుపడుచున్న మూగ క్రైస్తవులు కలరు. ప్రభువును ఆత్మతోను, సత్యముతోను, ఆరాధించి పాడి, ఆనందించలేని మూగవారును కలరు. అయితే ప్రభువు అద్భుతమును చేయుచున్నప్పుడు, వారి యొక్క నోటి బంధకాలు తెంపివేయ బడుచున్నాయి. ప్రభువును స్తుతించి పాడి పరిచర్యను చేయువారిగా వారు మారుచున్నారు.

యోబు చెప్పుచున్నాడు: “గ్రుడ్డివారికి నేను కన్నులైతిని, కుంటివారికి కాళ్లునైతిని” (యోబు. 29:15). గొప్ప బాధల యొక్క త్రోవలో నడిచి వెళ్లినవాడే యోబు. అయినను ఆయన గుడ్డివారికి కన్నులనైతిని అనియు, కుంటివారికి కాళ్లునైతిని అనియు చెప్పుచున్నాడు. దేవుని బిడ్డలారా, మీరు ఇతరులకు సహాయకరముగా ఉండుడి, ఆదరణగా ఉండుడి. ఆలయమునకు రాలేని కుంటి వారిని ఆరాధనకు మొసుకుని రండి. మీతో కలిసి ప్రభువును ఆరాధించుటకు వారికి సహాయపడుడి.

యేసు యొక్క దినములలో నలుగురు కలిసి కుంటివాడివలె ఉన్న పక్షవాయుగలవానిని ప్రభువు వద్దకు మోసుకొని వచ్చిరి. జనులు అత్యధికముగా గుంపుకూడి ఉన్నందున ద్వారము గుండా తీసుకుని రాలేక, ఇంటి కప్పును విప్పి ఇంటిలోపలకి దించిరి. ప్రభువు వారి యొక్క విశ్వాసమును చూచి, పక్షవాయువు గలవానిని స్వస్థపరిచెను. దేవుని బిడ్డలారా, “ప్రభువా, అక్షరానుసారమైన కుంటివారిని నడవ చేయుము, ఆత్మానుసారమైన కుంటి వారిని నడవ చేయుము” అని ప్రార్ధించెదము.

నేటి ధ్యానమునకై: “యెహోవా మందిరమునకు వెళ్లుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. యెరూషలేమా, మా (పాదములు) కాళ్లు నీ గుమ్మములలో నిలుచుచున్నవి” (కీర్తనలు. 122:1,2).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.