నవంబర్ 03 – ఇదిగో, ఒక నిచ్చెన!
“అప్పుడు …. అందులో ఒక నిచ్చెన భూమిమీద నిలుపబడియుండెను; దాని కొన ఆకాశమునంటెను” (అది.కా. 28:12).
యవ్వన వయస్సులో యాకోబు తన అన్నయగు ఏశావునకు భయపడినవాడై, తన తల్లిదండ్రులను విడిచి ఒంటరిగా వెళ్లిన సమయమునందు, ప్రభువు యాకోబునకు ఒక కాలను ఇచ్చుటకు సంకల్పించెను. ఆ కలలో ఆయన ఒక అద్భుతమైన నిచ్చెనను చూచెను.
ప్రభువు మనకు దూరముగా కాక, సమీపముగా ఉన్నాడు అను సంగతిని ఈ నిచ్చెన కనబరుచుచున్నది. బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “తనకు మొఱ్ఱపెట్టువారి కందరికి తనకు నిజముగా మొఱ్ఱపెట్టువారి కందరికి యెహోవా సమీపముగా ఉన్నాడు” (కీర్తనలు. 145:18). “ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు” (అపో. కా. 17:27).
మునుపుట్టి కాలములో విదేశాలలో ఉన్న బంధువులను సంప్రదించుటకు మిగుల కఠినముగా ఉండును. ఒక ఉత్తరమును రాసినట్లయితే అది వచ్చి చేరుటకు ఒక మాసపు కాలము అగును. జాబు ఉత్తరమును వేసినట్లయితే, వారికి వెళ్లి చేరుటకు ఇంకను ఒక మాసము అగును. అయితే ఇప్పుడు చరవాణి వసతి, అంతర వలయపు వసతి అని విజ్ఞానము ఎంతగానో అభివృద్ధి చెందియున్నది. నేడు పిల్లలు అమెరికాలో ఉన్నప్పుడు కూడాను, ఎప్పుడు కావాలంటే అప్పుడు మాట్లాడేటువంటి దూరములోనే ఉన్నాము.
ప్రభువు కూడాను: “నేను సమీపముననుండు దేవుడను మాత్రమేనా? దూరముననుండు దేవుడనుకానా?” (యిర్మియా. 23:23) అని చెప్పుచున్నాడు. ఆయన మనకు ఒక నిచ్చెన, దూరమునందే నిలబడియున్నాడు. కుమారుడా, నేను నిన్ను విడిచి ఎడబాయుటను లేదు, నిన్ను చేయి విడిచి పెట్టుటను లేదు. “ఇదిగో, నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతోకూడ ఉన్నాను” (మత్తయి. 28:20) అని చెప్పుచున్నాడు.
మన ప్రభువు ఎంతటి ప్రేమగలవాడు! యాకోబు యవ్వనస్తుడేగా అని తలంచి, నిర్లక్ష్యము చేయక, కృపతో తనంతట తానుగా వచ్చి, దర్శనమునిచ్చి, నిచ్చనను చూపించి, ప్రేమతో మాట్లాడెను. భవిష్యత్తు కాలము ఎలాగూ ఉండును అను కలతను, అన్నను గూర్చిన భయమును, తల్లిదండ్రులను విడిచి దూరముగా వెళ్ళుట చేత వచ్చు అంగలార్పు అను సమస్తమును ప్రభువు రెప్పపాటు సమయములో మార్చి వేసెను. అవును, ఆయన తల్లి ఓదార్చునట్లు ఓదార్చువాడు కాదా? బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “దేవుడు మనకు ఆశ్రయమును, దుర్గమునైయున్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు” (కీర్తనలు. 46:1). సమస్యల సమయములో ఆయన పరుగున వచ్చి, మనకు సహాయము చేసి మనలను కాపాడుచుండు వాడు.
“యెహోవా దానికి పైగా నిలిచి–నేను నీ తండ్రియైన అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను; నీవు పండుకొనియున్న యీ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. సంతానము భూమిమీద లెక్కకు ఇసుక రేణువుల వలెనగును; నీవు పడమటితట్టును, తూర్పుతట్టును, ఉత్తరపుతట్టును, దక్షిణపుతట్టును వ్యాపించెదవు” (ఆది.కా. 28:13) అని మాట్లాడినప్పుడు, యాకోబు యొక్క అంతరంగము ఎంతగా పరవశించి యుండును! “నామీద నా ప్రభువు ఇంతటి ప్రేమను ఉంచియున్నాడు? నన్నేనా అభివృద్ధి పరిచెదను అని వాక్కనిచ్చుచున్నాడు? అని తలంచి ఆయన ఆనందభాష్మములను కార్చియుండును.
దేవుని బిడ్డలారా, నేడును అట్టి దేవుడు మీయొక్క దేవుడుగా ఉన్నాడు.
నేటి ధ్యానమునకై: “యాకోబూ, నీ గుడారములును, ఇశ్రాయేలూ, నీ నివాసస్థలములును ఎంతో రమ్యమైనవి!” (సంఖ్యా. 24:5).