Appam, Appam - Telugu

జూలై 19 – చిన్నవాడు ఎక్కడ

“చిన్నవాడు లేడే; అయ్యో నేనెక్కడికి పోవుదును” (అది.కా. 37:30).

కాలములు గతించే కొలది శిశుప్రాయము మారి బాల్యప్రాయము ప్రారంభించుచున్నది. బాలలు యవ్వనస్థులుగా మారి, యవ్వనస్థులు పురుషులుగాను, పురుషులు వృద్ధులుగా మారుచున్నారు. ఇట్టి ప్రాయములలో మధురమైన ప్రాయము బాల్యప్రాయమే.

బాలలనే ప్రభుత్వము మొదలుకొని అందరును అన్వేషిస్తూ ఉన్నారు. పలు సమయములలో రాజకీయ నాయకులు తమ స్వార్ధము నిమిత్తము వాడుకొనుటకు బాలలనే వాడుకొనుచున్నారు. సాతాను బాల్య వయస్సునందే చిన్నవారిని తన వలలోనికి పడవేసి నాశనము చేయుటకు ప్రయత్నించుచున్నాడు.

అతడు ఏ రకముగా ప్రయత్నించుచున్నాడో చూడుడి. నేడు పాఠశాలకు సమీపమున కొంతమంది దుర్మార్గులు నిలబడి విద్యార్థులకు మత్తు పదార్థములను ఉచితముగా ఇచ్చి వారిని వాటికి బానిసలుగా చేయుచున్నారు. తమ వ్యాపారము అభివృద్ధి చెంది ఫలితమును ఇవ్వవలెను అనుటయే వారి యొక్క ప్రణాళిక. ఇందును బట్టి నేడు అనేకులు యవ్వన వయస్సులోకిని వచ్చుటకు ముందుగానే మత్తు పదార్ధములకును, గంజాయికిని, మత్తు పానీయమునకును, సిగరెట్టుకును బానిసలైపోవుచున్నారు. ఈ సంగతిని చూచి ప్రభువు అంగళార్చకుండా ఉండునా? ఆయన యొక్క హృదయము పరితప్పించకుండా ఉండునా?

యోసేపు బాలుడైయున్నప్పుడు, అతని సహోదరులు అతనిని పాడుపడిపోయున గుంటలో ఎత్తి పడవేసిరి. ఆ తర్వాత ఐగుప్తునకు వెళ్ళుచున్న వర్ధకులైన మిద్యానియ్యులకు అమ్మివేసిరి. యోసేపు యొక్క జేష్ట సహోదరుడైన రూపేనునకు ఈ సంగతి తెలియనందున గుంట దగ్గరకు వచ్చి తన యొక్క తమ్ముడు అక్కడ లేనందున, “చిన్నవాడు లేడే; అయ్యో నేనెక్కడికి పోవుదును” అని విలపించెను.

ప్రభువు చిన్నవారిని ప్రేమించుచున్నాడు. బైబిలు గ్రంథము సెలవిచ్చుచున్నది: “ఇశ్రాయేలు బాలుడైయుండగా నేను అతని యెడల ప్రేమగలిగి నా కుమారుని ఐగుప్తుదేశములో నుండి పిలిచితిని” (హోషేయా. 11:1). బానిసత్వమునైయున్న ఐగుప్తు నుండి ప్రభువు బాలలను విమోచించుటకు కోరెను. దుష్టత్వపు పాప అలవాటైయున్న లోకపు స్నేహము నుండి వారిని ప్రభువు విడిపించుటకు కోరెను.

ఒక చిన్నవాడు చాంద్రరోగియై దురాత్మ చేత పట్టబడి పీడించబడుచున్నప్పుడు, అతని తండ్రి అతనిని క్రీస్తు యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు: “ప్రభువా, నా కుమారుని కరుణింపుము; వాడు చాంద్రరోగియై మిక్కిలి బాధపడుచున్నాడు; ఏలాగనగా అగ్నిలోను నీళ్లలోను తరుచుగా పడుచున్నాడు;” (మత్తయి. 17:15) అని బతిమాలేను. యేసు అంతట జాలిపడి ఆ దయ్యమును గద్దించినప్పుడు, వెంటనే అది వానిని వదలి పోయెను; ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థతనొందెను.

దేవుని బిడ్డలారా, మీ కుటుంబమునందు గల బాలలను ప్రభువు కొరకు సమర్పించుడి. వారిని క్రీస్తుని వద్దకు త్రోవ నడిపించుడి. ఆనాడు తన వద్దకు వచ్చిన బాలలను హక్కున చేర్చుకుని ఆశీర్వదించిన ప్రభువు, మీ పిల్లలను కూడాను హక్కున చేర్చుకుని ఆశీర్వదించును.

నేటి ధ్యానమునకై: “మోషే మేము యెహోవాకు పండుగ ఆచరింపవలెను గనుక మా బాలలను, మా వృద్ధులను, మా కుమారులను, మా కుమార్తెలను, మా మందలను మా పశువులను వెంటబెట్టుకొని వెళ్లెదమనెను” (నిర్గమ. 10:9).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.