Appam, Appam - Telugu

జూలై 07 – గొప్ప శబ్దము!

“అప్పుడు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పుట వింటిని: ….ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవునివాయెను; ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయెను” (ప్రకటన. 12:10).

పరలోకము నుండి వచ్చిన శబ్దములన్నిటిలోను అతి గొప్ప శబ్దమును ఇక్కడ మనము చూచుచున్నాము. ఈ శబ్దము మనకు నాలుగు అంశములను వివరించుచున్నది. మొదటిది, రక్షణ; రెండోది, శక్తి; మూడోది, దేవుని రాజ్యము; నాలుగోది, క్రీస్తుని అధికారము.

ఇంతటితో ఆ శబ్దము ఆగిపోలేదు, “పరలోకమా, పరలోకనివాసులారా, (ఉత్సహించుడి) ఉల్లసించుడి” అని చెప్పి ఆజ్ఞాపించుచున్నది. అవును, రక్షణయందు ఒక ఉల్లాసము కలదు; శక్తియందు ఒక ఉల్లాసము కలదు; దేవుని రాజ్యమే ఉల్లాసముతో నిండిన ఒక స్థలము. క్రీస్తును స్తుతించుటయందు ఉల్లాసము కలదు. నేనును, మీరును ఉల్లసించునట్లుగా పిలవబడియున్నాము.

ఉల్లసించుట అను మాట గొప్ప లోతైనదియు, ఔనత్యము గలదైయున్నది. సంతోషము, ఉత్సాహము, ఆనందము మొదలగు వాటికంటేను, గొప్ప ఔన్నత్యమైన అనుభవమే ఉల్లసించుటయైయున్నది. అందులోను ఆత్మలో ఉల్లసించుట ఇంక అత్యధికమైన శ్రేష్టమైనది.

క్రీస్తు యొక్క తల్లియైన మరియ: “నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. నా ఆత్మ నా రక్షకుడైన దేవునియందు (ఆనందించెను) ఉల్లసించుచున్నది” (లూకా. 1:46,48) అని చెప్పెను. యేసు క్రీస్తు కూడాను, ఆత్మలో ఉల్లసించెను. “తండ్రీ! ఆలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయెను” (లూకా. 10:21) అని ఆయన చెప్పెను.

ప్రభువునందు ఉల్లసించుట ఒక మంచి ధన్యకరమైన అనుభవము. అలాగున ఉలచలసించుడి అని పరలోకము నుండి వచ్చుచున్న శబ్దము మన చెవులలో ధ్వనించుచూనే ఉన్నది. హింసింపబడి, వేదనచెంది, దుఃఖించకుడి. ప్రభువుపై మీ భారములను మోపివేసి, ప్రభువునందు ఉల్లసించుడి. మొట్టమొదట ప్రభువునందు ఉల్లసించిన భక్తుడు అబ్రహామే. యేసు చెప్పెను: “మీ తండ్రియైన అబ్రాహాము నా దినమును చూతునని మిగుల (ఆనందించెను) ఆశతో ఉండెను; అది చూచి (సంతోషించెను) ఉల్లసించెను” (యోహాను. 8:56).

నేడు మీరు ఉల్లసించుటకు వేలకొలది కారణములు కలదు. క్రీస్తు రక్షకుడిగా మీ యొక్క అంతరంగమునందు ఆశీనుడైయుండు అట్టి రక్షణ యొక్క సంతోషమును తలంచి చూచి ఉల్లసించుడి. రెండవదిగా, ఆయన శక్తిని మీకు దయచేసియున్నాడు. అది పరిశుద్ధ ఆత్ముని యొక్క శక్తి.

మూడోవదిగా, దేవుని యొక్క రాజ్యమును తలంచి ఉల్లసించుడి. మీరు అతి తేజోమయమైన రాజ్యమునందు ప్రవేశించుచున్నప్పుడు, నిత్యమైన ఉల్లాసము కలుగును. నాల్గవదిగా, క్రీస్తు యొక్క అధికారమును ఉపయోగించుచున్నప్పుడు ఉల్లసించుడి. ఆయన పరలోకమందును భూమియందును సకల అధికారము గలవాడు.

ప్రభువునందు ఎల్లప్పుడును ఉల్లసించిన దావీదు రాజు: “నిన్ను ఆశ్రయించువారందరు సంతోషించుదురు, …. నిత్యము ఆనందధ్వని చేయుదురు; నీవు వారిని దయతో కప్పెదవు; కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు” (కీర్తనలు. 5:11,12).

నేటి ధ్యానమునకై: “యెహోవా, …. నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను; మహోన్నతుడా, నీ నామమును కీర్తించెదను” (కీర్తనలు. 9:1,2).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.