ఆగస్టు 29 – ప్రభువా నీవు ఎవరు?
“ప్రభువా, (నీవెవడవని) నీవు ఎవరు, అతడడుగగా. అందుకు ఆయన: నేను నీవు హింసించుచున్న యేసును; మునికొల్లును ఎదురు తన్నుట నీకు సులభమా అని అనగా” (అపో.కా. 9:5).
యేసు ఎటువంటి వాడని ఎరుగునట్లుగా జక్కయ్య కోరినప్పుడు, ప్రభువు రక్షకుడిగా అతనికి తనను బయలుపరిచెను. అయితే, తన ఎదుట ప్రకాశించిన వెలుగు ఎవరు అనియు, ఆయన ఎటువంటి వాడు అనియు సౌలు ఎరుగుటకు కోరినప్పుడు, ప్రభువు తనను గూర్చి అత్యధికముగా బయలుపరచుకొనక, సౌలును గూర్చియే అత్యధికముగా బయలుపరచెను.
“సౌలా, నీవు నన్ను హింసించుచున్నావు, నీవు మునికొల్లును తనుచున్నావు” అనియు, “నీచేత హింసింపబడుచున్న యేసుగా నేను ఉన్నాను” అనియు యేసు చెప్పెను. అట్టి మాటలు సౌలును పగలగొట్టేను. ఆ తర్వాతి కాలములో శక్తివంతమైన పౌలుగా అతనిని రూపించెను.
కొందరికి ప్రభువు తన యొక్క గుణాతిశయమును తన యొక్క నామము ద్వారా బయలుపరచుచున్నాడు. ఆయన నామమును గూర్చి: “ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త” (యెషయా. 9:6) అని బైబిలు గ్రంధము చెప్పుచున్నది. సహజముగా, విశ్వాసుల వద్ద ప్రభువు ఎవరు అని అడిగినట్లయితే, ఆయన మంచివాడు, శక్తిమంతుడు, కనికరముగలవాడు అని ఆయన యొక్క గుణాతిశయములను బట్టి చెప్పుదురు.
ప్రభువును సమీపించి వచ్చుచున్నప్పుడు ఆయన మంచివాడు అని వెయ్యి సార్లు ప్రేమతో చెప్పునట్లుగా మన యొక్క హృదయము తపించుచున్నది. “యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలిసికొనుడి” (కీర్తనలు. 34:8). బహు క్రూరముగా శిలువలో కొట్టబడుటకు ఆయన నేరస్తుడా, చెడు గుణము గలవాడా కాదు. మిగుల ఉత్తముడుగా ఉండియు మన యొక్క పాపముల నిమిత్తము మన కొరకు, పాప నివారణ బలియగునట్లు పాపమెరుగని ఆయన మన కొరకు పాపమాయెను. నేరస్తునివలె ఆయన వ్రేలాడెను, ఆయన మంచివాడు.
ఆయనను విచారణ చేసిన ఫిలాతు కూడాను ఆయన వద్ద ఏ నేరమును కనుగొనలేకపోయెను. పిలాతు యొక్క భార్య ఆ నీతిమంతుడ్ని ఏమియు చేయవద్దు అని దయ తలచి మాట చెప్పి పంపించెను. ఆయన మంచివాడు.
రెండవదిగా, ఆయన మంచివాడు మాత్రము కాదు, ఆయన శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు (ఆది. కా. 17:1). ఆయనకు అసాధ్యమైన ఆశ్చర్యకార్యము ఏమియు లేదు. ఆయన యొక్క శక్తివంతమైన సృష్టిని గూర్చి నేడును ప్రకృతి సాక్ష్యమును ఇచ్చుచున్నది. ఆయన చేసిన అద్భుతములన్నియును ఆయన శక్తిమంతుడు, వ్యాధిని స్వస్థపరచుటకు శక్తిమంతుడు, దయ్యములను వెళ్ళగొట్టుటకు శక్తిమంతుడు, మృతులను బ్రతికించుటకు శక్తిమంతుడు అను సంగతిని బయలుపరచుచున్నది. మీ యొక్క జీవితమునందును ఆయన బహు బలమైన అద్భుతములను చేయును.
మూడోవదిగా, దేవుడైన ప్రభువు కనికరము గలవాడైయున్నాడు. ఆయన కనికరమునందు సంపన్నుడైయున్న దేవుడు. వెయ్యి తరముల వరకు కనికరమును చూపు దేవుడు. ఆయన యొక్క కనికరము చేతనే నేడును లోకము ఉనికిని కలిగి పనిచేయుచున్నది.
దేవుని బిడ్డలారా, క్రీస్తు యొక్క ఇట్టి మూడు స్వభావములును మీయొక్క జీవితములో కనబడవలెను. అప్పుడు మీరు క్రీస్తును ప్రతిభంభించువారిగా ఉందురు. మిమ్ములను చూచువాడు తండ్రిని చుచువాడైయుండును.
నేటి ధ్యానమునకై: “యెహోవా; కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల దేవుడైన యెహోవా” (నిర్గమ.34:6).