Appam, Appam - Telugu

అక్టోబరు 25 – అమూల్యమైనవి!

“ఇదిగో, నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సీయోనులో స్థాపించుచున్నాను” (1. పేతురు. 2:6).

మనుష్యుల యొక్క దృష్టిలో అమూల్యమైనవి అనేకములు కలవు. అయితే కాలక్రమేపి అవి తమ విలువను కోల్పోవుచున్నాయి; చెడిపోయి పాడైపోవుచున్నయి! ఒకానొక కాలమునందు విలువైనవారిగా కనబడినవారు నేడు మురికి గుడ్డగాను, చెత్తగాను కనబడుచున్నారు. ప్రభువు యొక్క దృష్టిలో అమూల్యమైనవి ఏమేమిటి?

  1. లోకము యొక్క దృష్టిలో విలువైన వస్త్రములును, బంగారపు ఆభరణములును అమూల్యమైనవి. అయితే ప్రభువు యొక్క దృష్టిలో, “సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణమను అక్షయాలంకారముగల మీ హృదయపు అంతరంగ స్వభావమే …. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది” (1. పేతురు. 3:4). సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకొందురు (మత్తయి. 5:5).
  2. లోకము యొక్క దృష్టిలో ముత్యము మిగుల అమూల్యమైనది. అయితే ప్రభువు యొక్క దృష్టిలో దైవిక జ్ఞానమే గొప్ప విలువైనదిగా ఉన్నది. “ముత్యములకంటేను, జ్ఞానసంపాద్యము కోరదగినది” (యోబు. 28:18). గుణవతియైన భార్య … ముత్యముకంటె అమూల్యమైనది” (సామెతలు. 31:10).

“పరలోకరాజ్యము, మంచి ముత్యములను కొన వెదకుచున్న వర్తకుని పోలియున్నది. అతడు అమూల్యమైన యొక ముత్యమును కనుగొని, పోయి, తనకు కలిగినదంతయు అమ్మి దాని కొనును” (మత్తయి. 13:45,46). అపో. పౌలు అట్టి అమూల్యమైన ముత్యముగా క్రీస్తునే చూచుచున్నాడు. కావున, నేను క్రీస్తును సంపాదించుకొను నిమిత్తము ఆయన కొరకు సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను (ఫిలిప్పీ. 3:9-11) అని చెప్పెను.

  1. లోకము యొక్క దృష్టిలో సంపన్నులును, పాలకులును, అంతస్తుగలవారును అమూల్యమైన వారిగా కనబడుచున్నారు. అయితే మనకు, మన కొరకు సిలువను మోసి, శ్రమపడిన క్రీస్తే అమూల్యమైనవాడు. కారణము మన కొరకు అమూల్యమైన రక్తమును ఆయన చిందించి ఇచ్చెను (1. పేతురు. 1:19). అమూల్యమైన విశ్వాసమును మనకు నేర్పించెను (1. పేతురు. 1:7). ఆయనే మన నిరీక్షణ అంతటి యొక్క అమూల్యమైన మూలరాయియైనవాడు (1. పేతురు. 2:6).

క్రైస్తవ మార్గమునందు లోకము యొక్క ఐశ్వర్యముల కంటేను, అమూల్యమైన అనేక అంశములు కలదు. పాప క్షమాపణ, రక్షణ యొక్క ఆనందము మహా గొప్ప అమూల్యమైనవి. పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకమును, ఆత్మ నింపుదలను అమూల్యమైనవి. ప్రభువు అనుగ్రహించుచున్న దైవీక సంతోషమును, సమాధానమును మహా గొప్ప అమూల్యమైనవి. నిత్యా జీవమును, పరలోక సంబంధమైన ఆశీర్వాదములును అమూల్యమైనవి. మీరు అమూల్యమైనవారును, ప్రత్యేకమైనవారై ఉందురు.

మీరు బహుశా లోకము యొక్క దృష్టిలో సాధారణమైన వారిగా కనబడవచ్చును. మీయొక్క నొసటియందు ప్రభువు తన యొక్క నామమును ధరింపజేసి ప్రభువునకు సొంతమైన వారు అను హెచ్చింపును ఇచ్చి అమూల్యమైనవారిగా చేసియున్నాడు. ప్రభువు మీయందు ఉంచియున్న అట్టి కాంక్షను ఎన్నడను నష్టపరచుకొనకుడి.

నేటి ధ్యానమునకై: “అమూల్యమైన రక్తముచేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొఱ్ఱెపిల్ల వంటి క్రీస్తు రక్తముచేత, విమోచింప బడితిరని మీరెరుగుదురు గదా” (1 పేతురు. 1:19).

Leave A Comment

Your Comment
All comments are held for moderation.